గూగుల్ సీక్రెట్ ప్రాజెక్ట్‌లో అసలేం చేస్తోంది,దిమ్మతిరిగే రహస్యాలు

  స్కైబెండర్..ఈ పేరు చాలామందికి తెలియదు..కాని బయటిప్రపంచానికి తెలిసిందంటే అది మరో విప్లవమవుతుంది. ఎందుకంటే గూగుల్ తన 5జీ టెస్టింగ్‌కు పెట్టుకున్న పేరు ఇది. ఈ కోడ్ పేరుతోనే మెక్సికోలో గూగుల్ 5జీ నెట్ వర్క్ మీద పరీక్షలు జరుపుతోంది. అదీ చిన్న విమానాల ద్వారా ఈ టెస్ట్‌లు సీక్రెట్ గా చేస్తోంది. కేవలం సౌర శక్తి ఆధారంగా ఈ పరీక్షలు గూగుల్ జరుపుతోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

  Read more: ఆకాశంలో గూగుల్ హై స్పీడ్ ఇంటర్నెట్

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  గూగుల్ సీక్రెట్ గా 5జీ టెస్టింగ్ లతో

  4జీ ఇంకా పూర్తి స్థాయిలో రానే లేదు కాని. గూగుల్ సీక్రెట్ గా 5జీ టెస్టింగ్ లతో ముందుకు దూసుకుపోతోంది. అన్నీ కుదిరితే మరో రెండేళ్లలో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది.

  మెక్సికోలో బుల్లి విమానాల (డ్రోన్‌) ద్వారా 5జీని

  ఇప్పటికే దీనిపై స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, అమెరికాలోని పలు టెలికం సంస్థలు.. గూగుల్‌, ఎరిక్సన్‌ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. గూగుల్‌ ఒక అడుగు ముందుకేసి మెక్సికోలో బుల్లి విమానాల (డ్రోన్‌) ద్వారా 5జీని పరీక్షించింది కూడా.

  ఈ 5జీ డ్రోన్ల ప్రాజెక్ట్‌కి స్కైబెండర్‌ అనే సంకేతనామం

  సౌరశక్తి ఆధారంగా పని చేసే ఈ 5జీ డ్రోన్ల ప్రాజెక్ట్‌కి స్కైబెండర్‌ అనే సంకేతనామం (కోడ్‌నేం) పెట్టుకుంది. ఇది ప్రస్తుతం ఉన్న 4జీకన్నా 40 రెట్లు అధిగవేగంతో డాటాను పంపిణీ చేయగలదు. అంటే 5జీతో అంతర్జాల వేగం 4జీకన్నా 40 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట.

  ఇప్పటికే ప్రాజెక్ట్ లూన్ పేరుతో గూగుల్

  ఇప్పటికే ప్రాజెక్ట్ లూన్ పేరుతో గూగుల్ ముమ్మరంగా పరిశోధనలు ప్రారంభించిన విషయం విదితమే. ప్రాజెక్ట్ లూన్' పేరుతో గూగుల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్దపెద్ద ఫ్లోటింగ్ బెలూన్లను భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేలా చేసి వాటికి అనుసంధానించే వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సిగ్నళ్లను పంపిస్తారు.

  ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని భారత్‌లో పరీక్షించేందుకు

  ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని భారత్‌లో పరీక్షించేందుకు బీఎస్ఎన్ఎల్‌లో కలిసి గూగుల్ పనిచేయనున్నట్లు సమాచారం. ఇందుకు గాను 2.6గిగాహెర్ట్జ్ బ్యాండ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గూగుల్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

  టవర్ల సహాయం లేకుండా 4జీ ఇంటర్నెట్ మొబైల్

  ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే టవర్ల సహాయం లేకుండా 4జీ ఇంటర్నెట్ మొబైల్ యూజర్లకు చేరువచేయవచ్చు. ఒక్కో బెలూన్ తనకు 40 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్‌ను చేరువచేయగలదు.

  ఫేస్‌బుక్ కూడా ఈ 5జీ నెట్‌వర్క్ పై

  ఇప్పటికే ఫేస్‌బుక్ కూడా ఈ 5జీ నెట్‌వర్క్ పై అనేక పరిశోధనలు చేస్తోంది. డ్రోన్లతో పరీక్షలు జరుపుతోంది. ఎలాగైనా 5జీని అందుబాటులోకి తేవాలని కసరత్తులు చేస్తోంది కూడా. బెలూన్లతో ,డ్రోన్లతో 5జీ నెట్ వర్క్ ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఫేస్‌బుక్ సీక్రెట్ గా పావులు కదుపుతోంది కూడా.

  స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ అమెరికా సీక్రెట్‌గా 5జీ ప్రాజెక్ట్‌కు

  స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ అమెరికా సీక్రెట్‌గా 5జీ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. దీనిక సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇందుకోసం అమెరికా పెద్ద మొత్తాన్నే కేటాయించింది. ఇది 4జీ కన్నా 40 రెట్లు వేగంగా పనిచేస్తుంది.

  అమెరికాలోని టెలికం సంస్థ వెరిజాన్‌ కూడా

  ఇక అమెరికాలోని టెలికం సంస్థ వెరిజాన్‌ కూడా ఈ ఏడాది ఆఖరుకల్లా 5జీని పరీక్షించాలని చూస్తోంది. 5జీ వస్తే..! వైర్‌ ద్వారా అంతర్జాల సేవలు.. వైఫై హబ్‌లు క్రమంగా కనుమరుగవుతాయి. డ్రోన్లు.. మొబైల్‌ టవర్లు.. బుడగల ఆధారంగా అతివేగవంతమైన అంతర్జాల సేవలు అందుబాటులోకి వస్తాయి.

  స్వీడన్‌లోని స్టాక్‌హోం అనే నగరంలో తొలిసారిగా 5జీ సేవలు

  తొలి నగరం స్వీడన్‌లోని స్టాక్‌హోం అనే నగరంలో తొలిసారిగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇక్కడ 2018లో 5జీ సాకార నెట్‌వర్క్‌ ఏర్పాటుకానుంది. స్వీడన్‌కి, ఫిన్‌లాండ్‌కి చెందిన టెలియాసొనెరా అనే టెలికం సంస్థ ఇక్కడ 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తోంది.

  ప్రస్తుతం 5జీ ఫోన్‌

  ప్రస్తుతం 5జీ ఫోన్‌ వచ్చేసింది. అయితే ఇది మనుషులు వాడలేరు. దీన్ని ఎరిక్సన్‌ రూపొందించింది. స్టాక్‌హోంలో దీన్ని బస్సులో ఉంచి 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్నారు.దీని బరువు 150 కిలోలు.

  జపాన్‌లోనూ దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి

  జపాన్‌లోనూ దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.ఇప్పటికైతే 5జీకి చిన్నపాటి ఫోన్లు, పరికరాలు లేవు. 5జీకి చిన్నపాటి పరికరాలు అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్ల సమయం పడుతుంది.

  5జీ వచ్చాక వాహనాల మధ్య ఢీకొనే అవకాశం లేని సాంకేతిక

  ప్రస్తుతం డ్రైవర్‌ లేని కార్లపై కసరత్తు జరుగుతుండగా.. 5జీ వచ్చాక వాహనాల మధ్య ఢీకొనే అవకాశం లేని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

  జపాన్‌లోని ప్రముఖ కమ్యూనికేషన్స్ సంస్థ ఎన్‌టీటీ డొకోమో

  ఇక జపాన్‌లోని ప్రముఖ కమ్యూనికేషన్స్ సంస్థ ఎన్‌టీటీ డొకోమో టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్స్‌లో ఇటీవల 5జీ వేగంతో డేటాను విజయవంతంగా ప్రసారం చేసింది. ఆ స్పీడ్ దాదాపుగా 2జీబీపీఎస్ వరకు వచ్చిందని సంబంధిత కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  మిల్లీమీటర్ వేవ్‌లెంగ్త్‌తో కూడిన సిగ్నల్స్‌ను

  మిల్లీమీటర్ వేవ్‌లెంగ్త్‌తో కూడిన సిగ్నల్స్‌ను దాదాపు 70 జీహెచ్‌జడ్ ఫ్రీక్వెన్సీతో పంపించామని తెలిపారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటే 2020 వరకు వాణిజ్యపరంగా 5జీ టెక్నాలజీని వినియోగదారులకు అందిస్తామని చెబుతున్నారు.

  4 జీ రాకముందే 5జీ వేగాన్ని

  4 జీ రాకముందే 5జీ వేగాన్ని పుంజుకుంటోంది. కంపెనీలన్నీ పోటీలు పడీ మరీ 5జీ నెట్ వర్క్ మీద పరీక్షల మీద పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ముందుగా ఏ కంపెనీ 5జీని తీసుకువస్తుందో చూడాలి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write Google's secretive SkyBender project plans to deliver 5G internet using DRONES: Craft will act as hotspots as they fly above homes
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more