రణ రంగం.. పాక్ వెనుక చైనా

Written By:

పాకిస్తాన్ కు చెందిన సమాచార ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించడంతో చైనా.. పాకిస్తాన్ ల మధ్య బంధం పతాక స్థాయికి చేరింది. వీరిద్దరూ ఇప్పుడూ జిగ్రీ దోస్తులయ్యారు. ఇక చైనా పాకిస్తాన్ తన సొంత తమ్ముడంటూ ఏం కావాలన్నా ఇస్తామంటూ ఎప్పటినుంచో బల్లలుగుద్దినట్లు చెబుతోంది. భారత్ తో పోటీగా సమాచార ఉపగ్రహ రంగంలో దూసుకుపోవాలని కలలు కంటోంది. ఏసియన్ టైగర్ కావాలని కలలు కంటున్న పాకిస్తాన్ కు చైనా ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలో పూర్తి స్థాయి అండదండలు అందిస్తామని చెబుతోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : భూమిని పోలిన మరో భూమి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిలైట్ తయారీకి అవసరమైన నిధులు

పాకిస్థాన్‌ దేశానికి చెందిన సమాచార ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంతో సహా ఈ శాటిలైట్ తయారీకి అవసరమైన నిధులను కూడా చైనా సమకూర్చింది. దీన్ని నింగిలోకి కూడా చైనానే పంపించింది.

శాటిలైట్‌ జి శాట్- 12

భారత్ ఇదే తరహా శాటిలైట్‌ జి శాట్- 12ను భారత్ నింగిలోకి ప్రయోగించిన విషయం తెల్సిందే. ఈ ఉపగ్రహాన్ని భారత్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీనికి పోటీగా పాకిస్థాన్ శాటిలైట్‌ను ప్రయోగించింది.

పాక్ శాట్-1

అదే తరహాలో పాకిస్థాన్ రక్షణ శాఖ పాక్ శాట్-1 ఆర్ అనే ఉపగ్రహాన్ని చైనా సహకారంతో తయారు చేసింది. దీనికి తయారీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాన్ని చైనాయే సమకూర్చింది.

లాంగ్ మార్చ్ 3బి రాకెట్

ఆ తర్వాత లాంగ్ మార్చ్ 3బి రాకెట్ ద్వారా చైనాలోని షిషాంఘ్ పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఆ దేశ సాంకేతిక, సమాచార రంగం అభివృద్ధికి మరింతగా దోహదపడుతుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల కోసం

ముఖ్యంగా దీని సహకారంతో బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్, డిజిటల్ టెలివిజన్ బ్రాడ్‌కాస్ట్, గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యాల కల్పన, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసన్ తదితర వాటికి ఎంతగానో ఉపయోగపడుతుందని పాకిస్తాన్ చెబుతోంది. 

15 సంవత్సరాల పాటు పాకిస్థాన్‌కు సేవలు

ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు పాకిస్థాన్‌కు సేవలు అందించనుంది.అయితే దీంతో పాటుగా 2016 కల్లా అత్యంత అధునాతనమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆలోచన చేస్తోంది

పాకిస్తాన్ కయ్యానికి కాలు

కాని జరుగుతున్న పరిణామాలు చూస్తే అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈమధ్య అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్దానికి సై అంటోంది. భారత్ కూడా ఇందుకు ధీటుగానే బదులిస్తోంది.

ఒక్కటైన పొరుగు దేశాలు

అయితే చైనాతో సాగిస్తున్న స్నేహ హస్తమే అనేక అలోచనలను ఇప్పుడు రేకెత్తిస్తోంది. పొరుగు దేశాలు ఒక్కటై ఇండియా మీద దాడికి వ్యూహ రచన చేస్తున్నాయా అనే అనుమానాలు కొట్టి పారేయలేం.

జింగ్ పింగ్ వేదాంతం

ఎందుకంటే గతంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాకిస్తాన్ కు వెళితే తన సొంత తమ్ముడు ఇంటికి వెళ్లినట్టు ఉంటుందని పాకిస్తాన్ పత్రిక డైలీ టైమ్స్ కు రాసిన ప్రత్యేక వ్యాసంలో తెలిపారు

ఏసియన్ టైగర్ కలలు

పాకిస్తాన్ ఏసియన్ టైగర్ గా ఆవిర్భవించాలని కోరుకుంటోందని ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెబుతున్నారు. దీని వెనుక పరమార్థం లేకపోలేదు.

చైనా నుంచి భారీ స్థాయిలో మద్దతు

2006 నుంచి చైనా పాక్ ల మధ్య వాణిజ్యపరంగా అలాగే దౌత్య పరమైన అనేక విషయాలలో మద్దతు ఇస్తూనే, పెట్టుబడులకు సహకరిస్తోంది. ఆయుధాలను సమకూరుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది.అన్నింటికీ మించి పాక్ అణ్వాయుధ పాటవానికి చైనా నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.

4600 కోట్ల డాలర్ల చైనా -పాకిస్థాన్ ఎకనామి క్ కారిడార్‌కు (సిపిఈసి) సాయం

అన్నింటికి మించి ఇప్పుడు అత్యంత భారీ సహాయ ప థకంగా రికార్డులలోకి వచ్చిన 4600 కోట్ల డాలర్ల చైనా -పాకిస్థాన్ ఎకనామి క్ కారిడార్‌కు (సిపిఈసి) సాయం లభిస్తోంది. ఈ కారిడార్ చైనా జింజియాం గ్ నుంచి అరేబియా సముద్రంలోని గ్వాదర్ ఫోర్టు వరకూ పాకిస్థాన్ మీదుగా విస్తరిస్తుంది.

భారతీయ నిఘా వర్గాలకు తగు సమాచారం

అసలు చైనా- పాకిస్థాన్ బంధం ఇప్పటిది కాదు. 1962లో భారత్‌పై చైనా ఆక్రమణ నాటి నుంచి ఇది సాగుతూ వస్తోంది. దీనికి ముందు కూడా రెండు దేశాల బంధం గురించి భారతీయ నిఘా వర్గాలకు తగు సమాచారం ఉంది.

మొదటికే మోసం వచ్చే అవకాశం

పక్కలో బల్లెంలా మారిన ఉగ్రవాద సంస్థను దెబ్బతీయ డానికి పాక్‌తో దౌత్యనీతి విషయంలో మరింత లౌక్యం ప్రదర్శించాలి. లేకపోతే చైనా-పాక్ బంధం విస్తరించుకుంటూ పోతూ ఉంటే దిగాలుగా చూడాల్సి వస్తుంది. దీనిపై తగు జాగ్రత్తగా లేకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write China agrees cooperation with Pakistan in space technology
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot