రూ. 13 వేల కోట్ల డీల్ : గోతులు తవ్వేసిన చైనా

Written By:

ఓ వైపు స్నేహానికి రారమ్మంటూ కమ్మని పిలుపులు..మరో వైపు కవ్వించేందుకు గోతులు...ఇది మన పొరుగుదేశం చైనాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో..ఇలా చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. మరి ఇప్పుడు ఏం గోతులు తవ్వుతోంది అనేగా మీ డౌటు. ప్రపంచంలో ఏ వస్తువైనా తన దేశం నుంచి ఎగుమతి కావాలనుకునే చైనా ఇప్పుడు దిగుమతుల గురించి ఆలోచిస్తోంది. అది కోటి రెండు కోట్లో కాదు.దాదాపు 13 వేల కోట్ల రూపాయల దిగుమతుల డీల్. ఆసియా ఖండాన్ని ఆ డీల్ ఇప్పుడు వణికించబోతోంది.

Read more: ఆకాశంలోనే శత్రు క్షిపణులు ధ్వంసం:భారత్ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యంత శక్తిమంతమైన సుఖోయ్-35 రకం యుద్ధవిమానాల్ని

అత్యంత శక్తిమంతమైన సుఖోయ్-35 రకం యుద్ధవిమానాల్ని

ఓ వైపు భారత్‌తో స్నేహహస్తం అంటూనే... మరోవైపు గోతులు తవ్వుతోంది చైనా. ఇప్పటికే భారీగా ఆయుధ సంపత్తి కలిగివున్న డ్రాగన్ దేశం... తాజాగా... అత్యంత శక్తిమంతమైన సుఖోయ్-35 రకం యుద్ధవిమానాల్ని రష్యా నుంచి కొనేసింది.

మొత్తం 24 విమానాల కోసం 13వేల కోట్ల రూపాయలు

మొత్తం 24 విమానాల కోసం 13వేల కోట్ల రూపాయలు

మొత్తం 24 విమానాల కోసం 13వేల కోట్ల రూపాయలు చెల్లించింది. రష్యాలోని రోస్టెక్ కంపెనీకి లభించిన అతిపెద్ద విదేశీ డీల్ ఇది. ఆర్థిక వ్యవస్థ పతనమైన రష్యాకు... ఈ ఒప్పందం జీవం పోసినట్లే. రష్యా ఆయుధ ఎగుమతులు మరింత పెరిగేందుకు దోహదం చేస్తోంది.

ఒక్కోదాని రేటు దాదాపు 5వందల కోట్ల రూపాయలు

ఒక్కోదాని రేటు దాదాపు 5వందల కోట్ల రూపాయలు

ఈ యుద్ధ విమానం ఒక్కోదాని రేటు దాదాపు 5వందల కోట్ల రూపాయలు. అత్యంత శక్తిమంతమైన సుదూర లక్ష్యాల్ని ఛేదించే... గైడెడ్ మిస్సైళ్లు, బాంబుల్ని ఈ విమానాలు తీసుకెళ్లగలవు. 2008లో ఇలాంటి విమానాలు కొనాలను నిర్ణయించిన చైనా... 2011లో రష్యాతో ఒప్పందం దిశగా అడుగులు వేసింది. ఎట్టకేలకు 24 యుద్ధ విమానాల్ని త్వరలోనే సొంతం చేసుకోబోతోంది.

రష్యా నుంచి సుఖోయ్ విమానాల్ని ఎందుకు కొంటోంది

రష్యా నుంచి సుఖోయ్ విమానాల్ని ఎందుకు కొంటోంది

ప్రపంచంలో ఏ వస్తువైనా... తమ దేశం నుంచి ఎగుమతి అవ్వాలే తప్ప... తాము దిగుమతి చేసుకోకూడదన్నది చైనా ఆలోచన. అలాంటిది... 13వేల కోట్ల రూపాయలు పెట్టి... రష్యా నుంచి సుఖోయ్ విమానాల్ని ఎందుకు కొంటోంది? దీనివెనుక రెండు ప్లాన్స్ ఉన్నాయి.

ఇలాంటి విమానాల్ని చైనా తయారు చేయాలంటే

ఇలాంటి విమానాల్ని చైనా తయారు చేయాలంటే

ఇలాంటి విమానాల్ని చైనా తయారు చేయాలంటే... దాదాపు పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం చైనా చుట్టూ ఉన్న దేశాలతో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్ లాంటి దేశాలతో సరిహద్దు దీవుల వివాదాలు కొనసాగుతున్నాయి.

శత్రు దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం

శత్రు దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం

శత్రు దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం... మోస్ట్ పవర్‌ఫుల్ యుద్ధ విమానాల్ని కొంటోంది. ప్రస్తుతం చైనా దగ్గర జే-11 యుద్ధ విమానాలున్నాయి. సుఖోయ్‌తో పోల్చితే అవి ఎందుకూ పనికిరావు.

సుఖోయ్ విమానాల్ని కాపీ కొట్టాలన్నది చైనా ప్లాన్‌గా

సుఖోయ్ విమానాల్ని కాపీ కొట్టాలన్నది చైనా ప్లాన్‌గా

అందువల్ల సుఖోయ్ విమానాల్ని కాపీ కొట్టాలన్నది చైనా ప్లాన్‌గా తెలుస్తోంది. చైనా కుతంత్రం తెలుసుకాబట్టే... ఎట్టిపరిస్థితుల్లో సుఖోయ్ విమానాల్ని చైనాలో ఉత్పత్తి చేయరాదని రష్యా కండీషన్ పెట్టింది.

ఆర్థిక వ్యవస్థ పతనమైన రష్యాకు

ఆర్థిక వ్యవస్థ పతనమైన రష్యాకు

రష్యాలోని రోస్టెక్ కంపెనీకి లభించిన అతిపెద్ద విదేశీ డీల్ ఇది. ఆర్థిక వ్యవస్థ పతనమైన రష్యాకు... ఈ ఒప్పందం జీవం పోసినట్లే. రష్యా ఆయుధ ఎగుమతులు మరింత పెరిగేందుకు దోహదం చేస్తోంది. ఈ యుద్ధ విమానం ఒక్కోదారి రేటు దాదాపు 500 కోట్ల రూపాయలు.

తాము దిగుమతి చేసుకోరాదన్ని చైనా పాలకుల విధానం

తాము దిగుమతి చేసుకోరాదన్ని చైనా పాలకుల విధానం

నిజానికి ప్రపంచంలో ఏ వస్తువైనా తమ దేశం నుంచి ఎగుమతి చేసుకోవాల్సిందేగానీ, తాము దిగుమతి చేసుకోరాదన్ని చైనా పాలకుల విధానం.

సుఖోయ్ యుద్ధ విమానాల విషయంలో

సుఖోయ్ యుద్ధ విమానాల విషయంలో

కానీ సుఖోయ్ యుద్ధ విమానాల విషయంలో ఆ విధానాన్ని చైనా పక్కనబెట్టింది. శత్రు దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా ఈ విమానాలను కొనుగోలు చేసిందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మన దేశంలో కూడా అత్యంత పవర్ పుల్ సుఖోయ్ యుద్ధ విమానాలు

మన దేశంలో కూడా అత్యంత పవర్ పుల్ సుఖోయ్ యుద్ధ విమానాలు

అయితే మన దేశంలో కూడా అత్యంత పవర్ పుల్ సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. దాదాపు 220 సుఖోయ్ యుద్ధ విమానాలు భారత్ చేతిలో ఉన్నాయి. 2019 నాటికి మరో 50 విమానాలు భారత అమ్ములపొదిలోకి చేరనున్నాయి.

ఎంత శక్తి ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని

ఎంత శక్తి ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని

ఆసియా ఖండంలో అపారమైన సైనిక శక్తి కలిగి ఉన్న దేశాల్లో భారత్ ప్రముఖ స్థానంలో ఉంది. చైనా కూడా అత్యంత పటిష్టమైన సైనిక సామర్థ్యాన్ని ఇప్పుడు ఈ యుద్ధ విమానాలతో కలిగి ఉంది. ఎంత శక్తి ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here WriteChina Buys 24 Advanced Hi tech Fighter Jets From Russia
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot