విధ్వంసక శాటిలైట్లతో చైనా దూకుడు

By Hazarath
|

చైనా ఇప్పుడు సరికొత్త ఎత్తుగడలకు తెరలేపింది. ఏకంగా అంతరిక్షంలో అలాగే కక్ష్యలో తిరుగుతన్నశాటిలైట్లపైనే కన్ను వేసింది. వాటిని ధ్వంసం చేసేందుకు సరికొత్త యాంటీ శాటిలైట్లను రెడీ చేస్తోంది. ఈ శాటిలైట్లతో అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న అన్ని రకాల శాటిలైట్లను నామరూపాల్లేకుండా చేయవచ్చు. చైనా ప్రయోగిస్తున్న ఈ శాటిలైట్లతో అమెరికా ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. చైనా నీకు ఇది తగదంటూ హెచ్చరిస్తోంది. ఎంత హెచ్చరించినా డ్రాగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. మిగతా కథనం స్లైడర్ లో...

మూడు అగ్ర దేశాల మధ్య స్పేస్‌వార్‌‌కు తెర

శాటిలైట్లను ధ్వంసం చేసేందుకు తగిన వ్యూహాలకు ..
 

శాటిలైట్లను ధ్వంసం చేసేందుకు తగిన వ్యూహాలకు ..

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలనే తాపత్రయంలో చైనా ఇప్పుడు సరికొత్త ఎత్తుగడలకు తెరలేపింది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న శాటిలైట్లను ధ్వంసం చేసేందుకు తగిన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ వర్గం ధ్రువీకరించింది. లెప్ట్ జనరల్ జే రేమండ్ అభిప్రాయం ప్రకారం చైనా అత్యంత శక్తివంతమైన యాంటీ ఉపగ్రహాలను కలిగి ఉంది. వాటి ద్వారా శత్రు దేశాల ఉపగ్రహాలను వెంటనే ధ్వంసం చేయవచ్చు.

ఒకే ఒక క్షణంలో ఈ యాంటీ శాటిలైట్లు నామరూపాల్లేకుండా..

శత్రు దేశాల నుంచి దూసుకువచ్చే శాటిలైట్లను ,అలాగే మిసైల్స్ ను ఒకే ఒక క్షణంలో ఈ యాంటీ శాటిలైట్లు నామరూపాల్లేకుండా చేస్తాయి. ఈ ఉపగ్రహాలతో చైనా అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న ఇతర దేశాల ఉపగ్రహాలపై కన్నేసిందని ఆయన అంటున్నారు. ఈయన అమెరికాలో ఎయిర్ ఫోర్స్ 4వ కమాండర్ కూడా..

చిన్న శాటిలైట్లను నియత్రించే అత్యంత సమర్థవంతమైన యాంటీ శాటిలైట్లు..

బీజింగ్ లో ఇప్పటికే అతి చిన్న శాటిలైట్లను నియత్రించే అత్యంత సమర్థవంతమైన యాంటీ శాటిలైట్లు రెడీగా ఉన్నాయని ఇవి కక్ష్యలో తిరుగాడే ప్రతి శాటిలైట్ ను ధ్వంసం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ఈ యాంటి శాటిలైట్లకు అంత సామర్ధ్యం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

చైనా తన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో తనే నాశనం చేసుకుంది
 

చైనా తన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో తనే నాశనం చేసుకుంది

కొలరాడోలో జరిగిన 31ఫస్ట్ స్పేస్ సింపోజియమ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఇప్పటికే ఈ పనులు ప్రారంభించిందని గత జులైలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ ను అత్యంత సమర్థవంతంగా పూర్తి చేసిందని వాస్తవాన్ని వెల్లడించారు. అప్పుడు చైనా తన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో తనే నాశనం చేసుకుంది కూడా.

భూమికి దగ్గరగా తిరుగాడే ఉపగ్రహాలను టార్గెట్ చేసేందుకు..

జులైలో చైనా బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంకు సంబంధించిన టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది .అయితే ఇది రక్షణ వ్యవస్థకి సంబంధించింది కాదని ఇదొక యాంటీ శాటిలైట్ మిషన్ అని యుఎస్ గ వర్నమెంట్ వారం రోజుల తర్వాత నిర్థారించింది.ముఖ్యంగా భూమికి దగ్గరగా తిరుగాడే ఉపగ్రహాలను టార్గెట్ చేసేందుకు ఈ వెపన్స్ సిస్థంకు చైనా పదును పెడుతోందని తెలుస్తోంది.

విధ్వసంక పరీక్షలకు సంబంధించిన టెస్ట్ లు..

దీనిపై అమెరికా చైనాను వివరణ కోరగా చైనా బదులివ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందని, విధ్వసంక పరీక్షలకు సంబంధించిన టెస్ట్ లు దానికి సంబంధించిన డెవలప్ మెంట్లు చేసుకుంటూ పోతోందని అమెరికా అంటోంది.

ఇది అన్ని దేశాలపై పెను ప్రభావం చూపే అవకాశం

ఇది అన్ని దేశాలపై పెను ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని ఈ యాంటి శాటిలైట్ ద్వారా అన్ని దేశాల శాటిలైట్లు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా తమ శాటిలైట్లను రక్షించుకోడానికి ఇప్పటికే రక్షణ చర్యలు ప్రారంభించింది.

చైనాకు ఇది తొలిసారి కాదు

అయితే ఇలా ప్రయోగించడం చైనాకు ఇది తొలిసారి కాదు. మే 2013లో కూడా ఇదే తరహా శాటిలైట్లు ప్రారంభించింది. సౌత్ వెస్ట్ చైనాలోని జియాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి రాకెట్ ను లాంచ్ చేసింది. కక్ష్యలో తిరుగుతున్న శక్తివంతమైన కణాల రహస్యం తెలుసుకోడానికి అలాగే అయస్కాంత ధృవాల కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

నేషనల్ స్పేస్ సెంటర్ పరిశోధనలో ..

అయితే ఇది సక్సెస్ పుల్ గా శాస్ర్తవేత్తలు అనుకున్న డేటాను వారికి అందించడంలో విజయం సాధించిందని నేషనల్ స్పేస్ సెంటర్ పరిశోధనలో తేలింది.ఈ టెస్ట్ ను పరీక్షించిన తరువాత అమెరికా దీనిని నిజమా కాదా అని నిర్థారించుకోవడం కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

కక్ష్యలో తిరుగుతన్న మిస్సైల్స్ ను ధ్వంసం చేయగలదని..

అయితే చైనా యాంటి మిస్సైల్ శాటిలైట్ ను పంపడం నిజమేనని వారి నిర్థారణలో వెల్లడైంది. చైనా పంపిన డాంగ్ నింగ్ 2 కింద నుంచే కక్ష్యలో తిరుగుతన్న మిస్సైల్స్ ను ధ్వంసం చేయగలదని తేలింది. ఈ యాంటీ శాంటిలైట్లు టెక్నాలజీని సర్వనాశనం చేస్తాయని..ఇవి చాలా డేంజర్ తో కూడుకున్నవని సమాచారం మొత్తం వారి చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఎఫ్-15 నుంచి దూసుకెళ్లిన మిసైల్ తునాతునకలు

1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిండ్‌ను అమెరికా... ఇదే పద్దతిలో కూల్చేసింది. సెప్టెంబర్ 13, 1985న భూమికి 555 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని.. ఎఫ్-15 నుంచి దూసుకెళ్లిన మిసైల్ తునాతునకలు చేసింది..

2007, జనవరి 17న యాంటీ శాటిలైట్ టెస్ట్

దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రశాంతంగా ఉన్న అంతరిక్షంలో.. బాంబుపేల్చింది.. చైనా. ప్రపంచ దేశాల అభ్యంతరాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. 2007, జనవరి 17న యాంటీ శాటిలైట్ టెస్ట్ జరిపింది. ఫెంగ్‌యున్ - 1సి వెదర్ శాటిలైట్ చెడిపోయిందని చెప్పిన చైనా.. S-19 మిసైల్‌ను పంపించి.. దాన్ని పేల్చేసింది. చైనా ఉపగ్రహం దాదాపు 40 వేల ముక్కలైనట్లు అంచనా.

దాని ఆంతర్యం మాత్రం వేరన్న సంగతి..

ఇవి ఇప్పటికీ భూమిచుట్టూ తిరుగూతూనే ఉన్నాయి. చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేయడానికే పేల్చేశామని చైనా చెబుతున్నా.. దాని ఆంతర్యం మాత్రం వేరన్న సంగతి అందరికీ తెలిసిందే. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా తనకుందని నిరూపించుకోవడానికే.. చైనా ఈ ప్రయోగం చేసిందన్న వాదనా ఉంది.

ఫిబ్రవరి 20, 2008న SM-3 మిసైల్‌ను పంపి..

అయితే.. అమెరికా మాత్రం.. అనూహ్యంగా రియాక్ట్ అయ్యింది. చైనాను తలదన్నే రీతిలో యాంటీశాటిలైట్ వెపన్ సిస్టంను ప్రయోగించింది. 2006 డిసెంబర్ 14న అమెరికా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం USA - 193ని ఈ ప్రయోగానికి ఎన్నుకొంది. పసిఫిక్ సముద్రంలో మోహరించిన యుద్ధ నౌక నుంచి.. ఫిబ్రవరి 20, 2008న SM-3 మిసైల్‌ను పంపి.. స్పై శాటిలైట్‌ను కూల్చేసింది.

చైనా చూపించిన సాకునే.. అమెరికా ..

చైనా చూపించిన సాకునే.. అమెరికా ఇక్కడా చూపించింది. ఈ స్పై శాటిలైట్ పనిచేయడం లేదన్న అమెరికా.. అందులో 450 కిలోల టాక్సిక్ హైడ్రోజన్ ఉందని.. అది భూమిపై కూలిపోతే.. పెను ప్రమాదం జరుగుతుందని ఊదరగొట్టింది. కానీ.. వాస్తవం మాత్రం వేరు. చైనాకు దీటుగా తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికే ఈ ప్రయోగం చేసిందన్నదే.. ఆ వాస్తవం.

ఇస్రో చేస్తున్న ప్రయోగాలు చాలా వరకూ విజయవంతమైనవే

మన దేశం విషయానికి వస్తే.. ఇస్రో చేస్తున్న ప్రయోగాలు చాలా వరకూ విజయవంతమైనవే. 1975 నుంచి ఇప్పటివరకూ 54 భారత ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. వాతావరణ శాటిలైట్లను మొదలుకొని.. నిఘా ఉపగ్రహాలవరకూ ఈ జాబితాలో ఉన్నాయి. చైనాకు మనకూ మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ శాటిలైట్లన్నింటినీ రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది.

మన రక్షణ రహస్యాలు.. శత్రు దేశాలకు చిక్కకుండానూ..

ఇదే సమయంలో మన రక్షణ రహస్యాలు.. శత్రు దేశాలకు చిక్కకుండానూ చూసుకోవాలి. అందుకే.. సరిహద్దు రక్షణతో పాటు.. అంతరిక్ష రక్షణ కూడా ఎంతో కీలకం. ఈ విషయంపైనా దృష్టి పెట్టిన భారత సైన్యం.. ఇస్రో సహకారంతో కలిసి ఏరో స్పెస్‌ కమాండ్‌ ఏర్పాటుకు కృషి చేస్తోంది.

పొరుగు దేశాలనుంచి ముప్పు పొంచి ఉండటంతో..

పొరుగు దేశాలనుంచి ముప్పు పొంచి ఉండటంతో ఏరోస్పేస్‌ కమాండ్‌ వ్యవస్థ భారత్‌కు రక్షణ కవచంగా దోహదపడనుంది. ఈ కమాండ్‌ను త్రివిధదళాలను అనుసంధానం చేసి శాటిలైట్‌ పంపే చిత్రాలు... రాడార్స్‌ పంపే సిగ్నల్స్‌ ఆధారంగా శత్రుదేశాల కదిలికలను గుర్తించి ముందస్తుగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని అమెరికా, రష్యా, చైనాలు సమకూర్చుకున్నాయి...

రష్యా దగ్గర కూడా.. శాటిలైట్ కిల్లర్స్..

రష్యా దగ్గర కూడా.. శాటిలైట్ కిల్లర్స్ ఉన్నాయి. శత్రుదేశ ఉపగ్రహాన్ని గుర్తించిన వెంటనే.. భూమిపై నుంచి మిసైల్స్ దూసుకువెళతాయి. శాటిలైట్‌కు చేరువలోకి వచ్చిన తర్వాత వాటంతట అవే పేలిపోతాయి. దీంతో.. శాటిలైట్ కూడా నాశనమవుతుంది. దాదాపు కిలోమీటర్ ముందే మిసైల్ పేలినా.. శాటిలైట్ విధ్వసం కావడం ఖాయం. అయితే.. మిసైల్స్ ద్వారా కన్నా.. లేజర్ కిరణాల ద్వారానే ఇతర దేశాల శాటిలైట్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది రష్యా.

2010లో ఒకటి అలాగే జనవరి 2013లో..

2010లో ఒకటి అలాగే జనవరి 2013లో ఇలాంటి యాంటి శాటిలైట్లను ప్రయోగించింది. అయితే చైనా పంపిన ఈ యాంటి శాటిలైట్లతో అమెరికాకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అమెరికానే అంతరిక్షంలో ఎక్కువ శాటిలైట్లను పంపిన విషయం అందరికీ తెలిసిందే.

అమెరికా, సోవియెట్ యూనియన్‌లే..

అమెరికా, సోవియెట్ యూనియన్‌లే.. ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి. కోల్డ్‌వార్ సమయంలోనే ఈ రెండు దేశాలు కలిసి దాదాపు 54 సార్లు ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను పరీక్షించాయి.ఒకదేశంపై మరొకటి దాడి చేయడం కోసం.. కొన్ని నెలలపాటు.. వీటిని ప్రయోగానికి సిద్ధంగా మోహరించాయి.

సోవియెట్ ఎన్నో ప్రయోగాలు..

సోవియెట్ ఎన్నో ప్రయోగాలు చేసింది. అయితే.. యూనియన్ విచ్చిన్నం కావడంతో.. పెద్ద దేశంగా మిగిలిన రష్యా.. అంతరిక్ష యుద్ధంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇతరత్రా ప్రయోగాలు జరిగినా.. యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం అమెరికా, రష్యాలకు రాలేదు.

ముందు ముందు ఇది ఏ తీరాలకు ..

ఢిపెన్స్ పేరుతో అమెరికా అంతరిక్షంలోకి తన శాటిలైట్లను పంపి ప్రపంచం మొత్తాన్ని తన ఆదీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. దీనికి ప్రతిగా చైనా తన యాంటీ శాటిలైట్లతో అమెరికాకు ధీటుగానే సమాధానం చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు అమెరికా తన శాటిలైట్లను రక్షించుకోడానికి అలాగే చైనాను ఎదుర్కోవడానికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మరి ముందు ముందు ఇది ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write China's Next Super Weapon Revealed: Satellite Destroyers

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more