మూడు అగ్ర దేశాల మధ్య స్పేస్‌వార్‌‌కు తెర

Posted By:

అగ్రరాజ్యాల మధ్య ఇప్పుడు స్పేస్‌వార్ కు తెర లేచింది. అంతరిక్షం మొత్తాన్ని తమ శాటిలైట్లతో నింపేయాలని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అగ్రరాజ్యాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. చందమామ దగ్గర నుంచి అంగారక గ్రహం దాకా అన్నింటినీ జల్లెడపడుతూ అగ్రరాజ్యాలు ఇప్పుడు మిగతా దేశాలను శాసించేందుకు సిద్ధమైపోయాయి.ఈ నేపథ్యంలో అమెరికా..రష్యాల మధ్య స్పేస్ వార్ పతాక స్థాయికి చేరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన వార్నింగ్ తో ఇది మరింత ముదిరి పాకాన పడింది. దీనికి తోడు చైనా స్పేస్ లో రెండు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగతా కథనం స్లైడర్ లో..

Read more: త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రష్యా అధ్యక్షుడు.. అమెరికా అధినేత ఒబామాకు వార్నింగ్

రష్యా అధ్యక్షుడు.. అమెరికా అధినేత ఒబామాకు వార్నింగ్

గతేడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధినేత ఒబామాకు వార్నింగ్ ఇచ్చాడు. మమ్మల్ని అమెరికా స్పేస్ రంగంలో ఢీ కొట్టలేదని. మాస్కోలో జరిగిన ఆల్ రష్యా పీపుల్స్ సమావేశంలో పుతిన్ ఈ డైలాగులు వదిలారు.

ఒక్కసారిగా షాక్ తిన్నంత పని

ఒక్కసారిగా షాక్ తిన్నంత పని

స్పేస్ రంగంలో రష్యాని దెబ్బ కొట్టాలని ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలకు తెర లేపుతున్న అమెరికా ఈ హఠాత్ పరిణామంతో పెద్దన్న ఒక్కసారిగా షాక్ తిన్నంత పనిచేశారు. అయితే రష్యా ప్రయోగిస్తున్న శాటిలైట్లతో ఈ వ్యవహారం మరింత ముదిరి పాకానికొచ్చినట్లుగా తెలుస్తోంది.

స్పుత్నిక్-1 ప్రయోగంతో..

స్పుత్నిక్-1 ప్రయోగంతో..

స్పుత్నిక్-1 ప్రయోగంతో సోవియట్ యూనియన్,అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో ఆధిపత్య పోరు మొదలైంది. అమెరికా చంద్రుడిపై మానవసహిత ప్రయోగాన్ని చేపట్టక మునుపు అనేకసార్లు రష్యా అంతరిక్షనౌకలు చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు నిర్వహించి,చంద్రుడి శిలల నమూనాలను భూమికి తీసుకురాగలిగాయి.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అమెరికా,రష్యా మధ్య ఒప్పందం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అమెరికా,రష్యా మధ్య ఒప్పందం

1990 దశకం మొదట్లో 16 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐ.ఎస్.ఎస్)నిర్మాణానికి అమెరికా,రష్యా మధ్య ఒప్పందం కుదరడంతో అంతరిక్షరంగంలో ఆధిపత్య పోరు అంతర్జాతీయ అంతరిక్ష సహకారంగా మారింది. అంతరిక్షంలోకి అమెరికా ,చైనా,రష్యాలు శాటిలైట్లను పంపి వాటి ద్వారా భూమి మీద కంట్రోల్ చేసే మిషన్లను రూపొందించనున్నారని సమాచారం.

ఇదే జరిగితే మరో యుద్దానికి తెర

ఇదే జరిగితే మరో యుద్దానికి తెర

ఇదే జరిగితే మరో యుద్దానికి తెర లేవక తప్పదని నిపుణులు అభిప్రాయం ఎక్స్‌ థర్టీ సెవెన్‌-బీ అంతరిక్ష విమానం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎక్స్‌ థర్టీ సెవెన్‌-బీ అంతరిక్ష విమానం 2012లో అంతరిక్షంలోకి ఎగిరింది. మొదట ఈ విమానాన్ని 2010, ఏప్రిల్‌లో ప్రయోగించారు. అది 8 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వచ్చింది.

నాలుగో యాత్ర 2015లో..

నాలుగో యాత్ర 2015లో..

2011 మార్చిలో జరిగిన రెండో ప్రయోగంలో ఈ విమానం 15 నెలల పాటూ అంతరిక్షంలో ఉంది. ప్రస్తుతం పూర్తి చేసిన రహస్య యాత్ర మూడోది కాగా... నాలుగో యాత్ర 2015లో ఉంటుందని తెలుస్తోంది.

చైనా అంతరిక్షంలో నెలకొల్పిన స్పేస్‌ ల్యాబ్‌ కోసమేనా..

చైనా అంతరిక్షంలో నెలకొల్పిన స్పేస్‌ ల్యాబ్‌ కోసమేనా..

ఈ విమాన ప్రయోగం ఉద్దేశం ఏమిటనే దానిపై అమెరికా నోరు విప్పడం లేదు. చైనా అంతరిక్షంలో నెలకొల్పిన స్పేస్‌ ల్యాబ్‌ను రహస్యంగా పరిశీలించేందుకే దీనిని ఏర్పాటు చేశారనే వాదన ఒకటి వినిపిస్తోంది.

ఇతర దేశాల ఉపగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకోవడం..

ఇతర దేశాల ఉపగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకోవడం..

ఇతర దేశాల ఉపగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకోవడం దీని లక్ష్యమనేది మరో వాదన.ఈ విమానంలో రహస్య పరిశోధనకు ఉపయోగపడే అనేక పరికరాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అమెరికా వైమానిక దళం మాత్రం ఈ వాదనలు ఖండిస్తోంది

అమెరికా వైమానిక దళం మాత్రం ఈ వాదనలు ఖండిస్తోంది

ఇవన్నీ పొంతన లేని సమాధానాలు అయితే అమెరికా వైమానిక దళం మాత్రం ఈ వాదనలు ఖండిస్తోంది. భవిష్యత్‌లో... తిరిగి ఉపయోగించుకోగలిగే, ప్రమాదాలను తగ్గించే అంతరిక్ష విమానాలను నిర్మించడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యమని అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చెబుతోంది.

ఈ పరిశోధనను నాసా చేపట్టాలి

ఈ పరిశోధనను నాసా చేపట్టాలి

తాము కేవలం అంతరిక్ష పరిభ్రమణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది.అదే నిజమైతే ఈ పరిశోధనను నాసా చేపట్టాలి కానీ, అమెరికా వైమానికి దళానికి ఇలాంటి బాధ్యతలు ఎందుకు అప్పగిస్తారన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

చైనా శక్తివంతమైన 130 శాటిలైట్లను ఆర్బిట్ లోకి ..

చైనా శక్తివంతమైన 130 శాటిలైట్లను ఆర్బిట్ లోకి ..

ఇక అమెరికాకు, చైనాకు మధ్య స్పేస్ కోల్డ్ వార్ ఎప్పటినుంచో స్టార్ట్ అయింది. చైనా శక్తివంతమైన 130 శాటిలైట్లను ఆర్బిట్ లోకి రీసెంట్ గా ప్రవేశపెట్టింది. ఇక సొంతంగా చైనాలోని తైగాంగ్ లో 2022 కల్లా స్పే శాటిలైట్ పేరుతో స్పేస్ స్టేషన్ ఓపెన్ చేయాలని చూస్తోంది.

యునైటైడ్ స్టేట్ నుంచి దాదాపు 500 శాటిలైట్లు ఆకాశంలో

యునైటైడ్ స్టేట్ నుంచి దాదాపు 500 శాటిలైట్లు ఆకాశంలో

ఇక ఆకాశంలో యునైటైడ్ స్టేట్ నుంచి దాదాపు 500 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో దాదాపు 100 శాటిలైట్లు మిలిటరీ కోసం వాడుతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం మీద దాదాపు 1200 శాటిలైట్లు ఆకాశంలో

మొత్తం మీద దాదాపు 1200 శాటిలైట్లు ఆకాశంలో

మొత్తం మీద దాదాపు 1200 శాటిలైట్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ శాటిలైట్లు భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఆకాశంలో విహరిస్తున్నాయి. వీటిలో దాదాపు 80 శాతం శాటిలైట్లు యుఎస్ మిలిటరీ తో సంబంధాలను కలిగి ఉన్నాయి.

అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఓ మిస్టరీ..

అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఓ మిస్టరీ..

పాశ్చాత్య దేశాల స్పేస్ ఏజెన్సీలు ఇటీవల అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఓ మిస్టరీ వస్తువును కనుగొన్నాయి. ఆ వస్తువు ఓ శాటిలైట్ అని ఇతర దేశాల శాటిలైట్లను నాశనం చేయడానికి దీన్ని రష్యా ప్రయోగించి ఉంటుందని టైమ్స్ నౌ పేర్కొంది.

ఆబ్జెక్ట్ 2014-28 ఈ అని నామకరణం

ఆబ్జెక్ట్ 2014-28 ఈ అని నామకరణం

ఆ శాటిలైట్ కిల్లర్‌కు ఆబ్జెక్ట్ 2014-28 ఈ అని నామకరణం చేశారు. అంతరిక్ష శకలాలను సేకరించేందుకు రష్యా మిలిటరీ దీన్ని ప్రయోగించినట్లు భావిస్తున్నా రష్యా దీని ప్రయోగంపై నిర్ధిష్ట ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది.

మే నెలలో రష్యా ఓ రాకెట్

మే నెలలో రష్యా ఓ రాకెట్

పాట్రీషియా టూయిస్ అనే స్పేస్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ దీనిపై స్పందిస్తూ ఇది ప్రయోగాత్మక శాటిలైట్ గానే కన్పిస్తోందన్నారు. కాగా గత మే నెలలో రష్యా ఓ రాకెట్ ప్రయోగించింది. దాని ద్వారా మూడు శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టారు. అయితే ఈ మిస్టరీ శాటిలైట్ ప్రయోగం వివరాలు ఎక్కడా వెల్లడి కాలేదు.

నార్త్ అమెరికన్ ఏరో స్పేస్ డిఫెన్స్ కమాండ్ ద్వారా నిశితంగా ..

నార్త్ అమెరికన్ ఏరో స్పేస్ డిఫెన్స్ కమాండ్ ద్వారా నిశితంగా ..

ప్రస్తుతం ఈ శాటిలైట్ కిల్లర్ గమనాన్ని అమెరికా మిలిటరీ తన నార్త్ అమెరికన్ ఏరో స్పేస్ డిఫెన్స్ కమాండ్ ద్వారా నిశితంగా పరిశీలిస్తోంది. 1960 ప్రాంతంలో రష్యా ఇస్త్రెబిటెల్ స్నుతిక్ పేరిట ఓ ఫైటర్ శాటిలైట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది.

పోరాట ఉపగ్రహాలను రష్యా మరలా రూపొందిస్తుందని ..

పోరాట ఉపగ్రహాలను రష్యా మరలా రూపొందిస్తుందని ..

అయితే ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ప్రస్తుతం రష్యా స్పేస్ ఏజెన్సీ అధిపతిగా వ్యవహరిస్తున్న ఒలెగ్ ఒస్తాపెంకో 2010లో మాట్లాడుతూ పోరాట ఉపగ్రహాలను రష్యా మరలా రూపొందిస్తుందని తెలిపారు.అప్పట్లో ఆయన రష్యా స్పేస్ ఫోర్స్ కమాండర్ గా వ్యవహరించారు.

ఆకాశంలో పట్టు సాధించాలని అగ్రదేశాలు

ఆకాశంలో పట్టు సాధించాలని అగ్రదేశాలు

మొత్తం మీద ఆకాశంలో పట్టు సాధించాలని అగ్రదేశాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి..ఏమి చేయడం లేదంటూనే చేయల్సినవన్నీ చేసేస్తున్నాయి..వీటిపైన ప్రపంచంలోని మిగతా దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Vladimir Putin Declares US Cannot Suppress Russia; Mystery Russian Object 2014-28 E a 'Satellite Killer'
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot