అమెరికాకు చైనా వార్నింగ్

Posted By:

అగ్రరాజ్యం అమెరికాకు చైనా హెచ్చరికలు జారీ చేసింది.అమెరికాకు చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు రేఖలను ఉల్లంఘించింది. వివాదస్పద దక్షిణ చైనా సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పార్ట్ లీ దీవులకు నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా యుద్ధ నౌక పహారా కాసింది.ఈ క్రమంలోనే యుద్ధ నౌకకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. అంతే కాకుండా అమెరికా అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశిస్తోందని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పగడపు దిబ్బలు అత్యధికంగా ఉండే స్పార్ట్ లీ దీవులపై చైనా, తైవాన్,మలేషియా,బ్రూనై,వియాత్నం,ఫిలీప్ఫీన్స్ దేశాలు ఎప్పటినుంచో కన్నేశాయి. ఈ క్రమంలో ఈ సముద్ర జలాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మరి ఆ జలాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి.

Read more: సముద్ర గర్భంలో యుద్ధమేఘాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా ఎప్పటినుంచో ఫిలిప్పీన్స్‌తో సహా మూడు దేశాలతో ..

ఇరుగుపొరుగు దేశాల భూభాగాల్లోకి మాత్రమే కాకుండా, సాగర జలాల్లో సైతం తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఎప్పటినుంచో ఫిలిప్పీన్స్‌తో సహా మూడు దేశాలతో వివాదానికి తెరలేపుతోంది.

స్పార్ట్‌లీ దీవుల్లో మేటలను తవ్వేసి కృత్రిమంగా మరో దీవిని ..

ఫిలిప్పీన్స్‌ కాకుండా,వియత్నాం,తైవాన్‌ లు కూడా తమకు హక్కుఉందంటున్న స్పార్ట్‌లీ దీవుల్లో మేటలను తవ్వేసి కృత్రిమంగా మరో దీవిని నిర్మించేందుకు సాగిస్తున్నప్రయత్నాలు చాలావరకూ ఫలించినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.దక్షిణ సాగర ప్రాంతంలోనే సెంకాకో దీవుల విషయంలో చైనాకు జపాన్‌తో చాలాకాలంగా వివాదం ఉంది.

చమురు సంపదపై కన్ను వేసిన చైనా,జపాన్‌తో ..

ఈ దీవుల్లో చమురు సంపదపై కన్ను వేసిన చైనా,జపాన్‌తో తరచు ఘర్షణలకు తలపడుతోంది.ఈ దీవులపై హక్కుతమదేనని జపాన్‌చాలా సార్లు ప్రకటించింది.ఇప్పుడు స్పార్ట్‌లీ దీవి ఆర్చ్‌ పెలాగో దీవుల సముదాయంలోనిది.స్పార్ట్‌ లీ దీవిలో తవ్వకాలను భారీ బందోబస్తుమధ్య సాగిస్తోంది. వందలాది చైనీస్‌ సైనికులు ఆ ప్రాంతంలో పహరా కాస్తున్నారు.

స్పార్ట్‌ లీ ద్వీపాల సమూహంపై హక్కుతమదేనని..

స్పార్ట్‌ లీ ద్వీపాల సమూహంపై హక్కుతమదేనని చైనా వాదిస్తోంది. ఈ ప్రాంతం చైనా భూభాగానికి వందలాది మైళ్ళ దూరంలో ఉంది.ఈ ప్రాంతంలో కూడా చమురు,వాయు నిక్షేపాలుఅధికంగా ఉన్నాయి.

చైనా నిర్వహిస్తున్న తవ్వకాలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు ..

ఈ ప్రాంతంలో చైనా నిర్వహిస్తున్న తవ్వకాలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమనీ, ఈప్రాంతంపై ఫిలిప్పీన్స్‌,మలేసియా, వియత్నాలకు కూడా హక్కు ఉందని అమెరికా ఫసిపిక్‌ నౌకా విభాగం కమాండర్‌ అడ్మిరల్‌ హేరీహారీస్‌ అన్నారు.

గ్రేట్‌ వాల్‌ నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని ..

ఉన్న ద్వీపాన్ని తవ్వేసి కృత్రిమ ద్వీపాన్ని సృష్టించేందుకు చైనా సాగిస్తున్న యత్నాల వెనుక దురుద్దేశ్యం ఉందని ఆయన ఆరోపించారు. డ్రెడ్జ్‌స్‌లు,బుల్‌డోజర్ల సాయంతో తవ్వకాలు జరుపుతూ గ్రేట్‌ వాల్‌ నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆయన ఆస్ట్రేలియాలోని కాన్‌బెరాలో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆరోపించారు.

చైనా చర్యలు ఉద్రిక్తతలకు దారితీస్తాయన్న..

చైనా దౌత్య పరమైన మర్యాదలను పాటించడం లేదని అమెరికా రక్షణ మంత్రి ఆష్‌ కార్టర్‌ ఆరోపించారు. చైనా చర్యలు ఉద్రిక్తతలకు దారితీస్తాయన్న ఆయన మాటల్లో అసత్యం లేదు. దక్షిణ సాగర ప్రాంతంలో వివాదాస్పద ప్రాంతంగా పేర్కొనబడిన ద్వీపంలో త్రవ్వకాలు జరపడం చైనా కవ్వింపు ధోరణికి నిదర్శనం.

ఈప్రాంతంలో త్రవ్వకాలను నిలిపి వేయాలని..

ఈప్రాంతంలో త్రవ్వకాలను నిలిపి వేయాలని హిల్లరీక్లింటన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు చైనా విదేశాంగ మంత్రితో ఈ విషయమై నిష్కర్షగా స్పష్టం చేశారు.ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలకు దారితీస్తాయని కూడా హెచ్చరించారు.వాషింగ్టన్‌లోని వ్యూహాత్మక,అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయన కేంద్రం తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు చైనా దురాక్రమణ ధోరణికి అద్దం పడుతున్నాయి.

ఈ ప్రాంతంలో అమెరికా పెత్తనం ఏమిటనే ధోరణిలో ..

సరిహద్దు వివాదాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనాకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చాలా సార్లు సూచించారు.ఈ ప్రాంతంలో అమెరికా పెత్తనం ఏమిటనే ధోరణిలో చైనా లెక్క చేయలేదు.చైనా ని కట్టడి చేయడానికి ఫిలిప్పీన్స్‌తో సంయుక్తంగా నౌకా విన్యాసాలు నిర్వహించాలని అమెరికా యోచిస్తోంది, అయితే,అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యతను చైనా విస్మరిస్తోంది.

మెరుగుపర్చుకోవాలని కోరుతున్నామని చెబుతూనే పరోక్షంగా కవ్వింపులకు ..

మనదేశంతో కూడా చైనా సాధారణ సంబంధాలు మెరుగుపర్చుకోవాలని కోరుతున్నామని చెబుతూనే పరోక్షంగా కవ్వింపులకు పాల్పడుతోంది.లడఖ్‌లోకి గత నెల 20,28 తేదీల్లో చైనీస్‌ సైనికులు చొచ్చుకుని వచ్చారు.అయితే,మనసైనికులు సకాలంలో అప్రమత్తం కావడంతో చైనీస్‌ సేనలు వెనక్కి వెళ్ళాయి.

ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను సృష్టించుకోవడం..

ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను సృష్టించుకోవడం,వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెబుతూనే కవ్వింపు చర్యలకు పాల్పడటం చైనాకు అలవాటు .ఇప్పుడు స్పార్ట్‌లీ ద్వీపం విషయంలో అది రుజువవుతోంది.

ఏడాది క్రితం భద్రత మండలం పేరిట చైనా ఇదేమాదిరిగా ..

ఫిలిప్పీన్స్‌తో సంయుక్తంగా నౌకా విన్యాసాలను నిర్వహించేందుకు అమెరికా సాగిస్తున్న యత్నాలతో చైనా తోకముడచవచ్చు.ఏడాది క్రితం భద్రత మండలం పేరిట చైనా ఇదేమాదిరిగా గగనతలంపై చొరబాటుకు ప్రయత్నించినప్పుడు అమెరికా ఇదే మాదిరిగా రంగ ప్రవేశంచేయగానే చైనా వెనక్కి మళ్ళింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write China says US warship's Spratly islands passage illegal
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot