సముద్ర గర్భంలో యుద్ధమేఘాలు

|

అగ్రరాజ్యాలు మొన్నటి దాకా బయట కొట్టుకున్నాయి...కాని ఇప్పుడు సముద్రం లోపలికి చేరాయి.సముద్రం లోపల యుద్ధం చేసేందుకు సిద్ధమయిపోయాయి. సముద్రం లోపల అడుగు భాగాన కీలక సమాచారాన్ని చేరవేసే ఇంటర్నెట్ కేబుల్స్ తో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఈ కేబుల్ లింక్ లను కంట్రోల్ చేయడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసే పనికి శ్రీకారం చుట్టాయి. అదే జరిగితే ప్రవంచంలో సమాచార వ్యవస్థ దెబ్బతినడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు,ఆర్థిక వ్యవస్థ అంతా ఈ కేబుల్స్ కేంద్రంగానే నడుస్తోందన్న విషయం విదితమే..మిగతా కథనం స్లైడర్‌లో...

Read more: లండన్‌పై రష్యా అణుబాంబులు

ఇంటర్నెట్ వార్. భవిష్యత్తు యుద్ధం ఇదే..
 

ఇంటర్నెట్ వార్. భవిష్యత్తు యుద్ధం ఇదే..

ఇంటర్నెట్ వార్. భవిష్యత్తు యుద్ధం ఇదేనేమో. అది కూడా ప్రచ్ఛన్న ప్రత్యర్థుల మధ్యే. అగ్రరాజ్యం అమెరికా, రష్యా మధ్య ఇంటర్నెట్ యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌ను రష్యా టార్గెట్ చేసినట్లు అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

రష్యాకు చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్ సముద్రంలో..

రష్యాకు చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్ సముద్రంలో..

రష్యాకు చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్ సముద్రంలో అండర్‌వాటర్ కేబుల్స్ ఉన్న కీలక ప్రాంతాల్లో తిష్టవేశాయి.ఒకవేళ సబ్‌మెరైన్లు కేబుల్ లింకులను తెంచేస్తే ఇక ఇంటర్నెట్ సేవలకు అంతరాయం తప్పదు. అదే జరిగితే ఇక రెండు సూపర్‌పవర్ దేశాల మధ్య డిజిటల్ యుద్ధం అనివార్యమవుతుంది.

 అంతర్జాతీయ సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందన్న ..

అంతర్జాతీయ సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందన్న ..

దాని వల్ల అంతర్జాతీయ సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఉపగ్రహాలు క్షేమంగా ఉన్నంత వరకు మాత్రం సైనిక సత్తాకు ఎటువంటి ప్రమాదం ఉండదట.

తీరం దగ్గర ఉన్న కేబుల్స్ ఒకవేళ తెగినా ..
 

తీరం దగ్గర ఉన్న కేబుల్స్ ఒకవేళ తెగినా ..

తీరం దగ్గర ఉన్న కేబుల్స్ ఒకవేళ తెగినా వాటిని రిపేర్ చేయడం సులభమే. కానీ సముద్రం మధ్యలో ఉన్న కేబుల్స్‌ను రిపేర్ చేయడం కష్టంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గతేడాది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను ..

గతేడాది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను ..

ఈ ప్రమాదం అంతటితో ఆగిపోలేదు. గతేడాది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను సొర చేపలు కలవరపెట్టాయి. ప్రపంచదేశాలకు అంతర్జాలం (ఇంటర్నెట్) అనుసంధానం కోసం సముద్రం అడుగుభాగాన గూగుల్ అమర్చిన కేబుల్ వ్యవస్థను ప్రమాదకర సొరచేపలు ధ్వంసం చేశాయి.

 తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్..

తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్..

ఈ భయానక సముద్ర జీవుల నుంచి తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్, ఓ రక్షణాత్మక వ్యవస్థను రూపొందించింది. సముద్ర గర్భంలో ఏర్పాటు చేయబడని ఫైబర్ కేబుళ్లకు కెవ్లార్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే పదార్థం) తరహా తొడుగును గూగుల్ వర్గాలు అమర్చే పనిలో పడ్డాయి. దీన్ని నిరోధించేందుకు కేబుల్స్‌కు పైపూతగా కేవ్లార్ అనే సింథటిక్ ఫైబర్‌ను పైపొరగా వాడినా ఫలితం ఉండట్లేదని తెలుస్తోంది.

1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి..

1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి..

ఈ సరికొత్త రక్షణాత్మక వ్యవస్థను అత్యంత కఠినమైనదని గూగుల్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. సముద్రంలో ఏర్పాటు చేయబడని కేబుల్ వ్యవస్థను సొర చేపలు ధ్వంసం చేస్తున్నాయనే విషయం 1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది. పశ్చిమ అమెరికా నుంచి ఆసియా వరకూ సముద్రం అడుగున ఆ కంపెనీ వేసుకున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను సొరచేపలు కొరికేస్తున్నాయని గూగుల్ కంపెనీ వెల్లడించింది.

ఆహార వేట కోసం సొరచేపల నోటిలో..

ఆహార వేట కోసం సొరచేపల నోటిలో..

కేబుల్స్ వల్ల స్వల్ప అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. అయితే ఆహార వేట కోసం సొరచేపల నోటిలో అయస్కాంత క్షేత్రాలను గుర్తించే సెన్సర్లు ఉండటంతో అవి ఈ కేబుల్స్‌ను గుర్తించి దాడి చేస్తున్నాయట.

PACNET హ్యాకింగ్

PACNET హ్యాకింగ్

హాంగ్ కాంగ్ కి సైతం అమెరికాతో ఈ తిప్పలు తప్పలేదు. హాంగ్ కాంగ్ లో Pacnet కంపెనీకి హెడ్ క్వార్టర్ లోని కంప్యూటర్లను కూడా అమెరికా ప్రభుత్వ గూఢచారులు హ్యాక్ చేశారని స్నోడెన్ తెలిపాడు. 2009లో Pacnet కంప్యూటర్లపై గూఢచారులు దాడి చేశారని అయితే ఆ తర్వాత మళ్ళీ దాడి చేయలేదని స్నోడెన్ తెలిపాడు.

Pacnet కార్యాలయం వద్ద 24 గంటల కాపలా విధించినట్లు..

Pacnet కార్యాలయం వద్ద 24 గంటల కాపలా విధించినట్లు..

స్నోడెన్ వెల్లడితో హాంగ్ కాంగ్ పోలీసులు Pacnet కార్యాలయం వద్ద 24 గంటల కాపలా విధించినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న కంప్యూటర్లన్నింటినీ నిపుణులు తనిఖీ చేసినట్లు కూడా తెలుస్తోంది. అమెరికన్ ఎన్.ఎస్.ఎ, బ్రిటిష్ జి.సి.హెచ్.క్యూ గూఢచారులు ఈ దాడులకు పాల్పడ్డారని స్నోడెన్ తెలిపారు. చైనా, హాంగ్ కాంగ్ లలోని వందలాది కంప్యూటర్లను ఎన్.ఎస్.ఎ హ్యాక్ చేసిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో..

Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో..

Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించిన భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ నిర్మాణాలకు సొంతదారు. దీనికి హాంగ్ కాంగ్, సింగపూర్ లలో గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కంపెనీ ఆధీనంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్సు సముద్రం అడుగున దాదాపు 46,000 కి.మీ విస్తరించి ఉన్నాయని ఎస్.సి.ఎం.పి తెలిపింది.

ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు ..

ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు ..

ఆసియా-పసిఫిక్ దేశాలలో విస్తరించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు ఈ కేబుల్స్ ను వినియోగిస్తాయి. ఈ కేబుల్స్ ను హేక్ చేయగలిగితే ఆసియా-పసిఫిక్ దేశాలన్నింటి కమ్యూనికేషన్లను తెలుసుకోవచ్చు. అమెరికా, బ్రిటన్ గూఢచార కంపెనీలు చేసింది అదే. చైనా, హాంగ్ కాంగ్, కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు ఈ నెట్ వర్క్ ను వినియోగిస్తున్నాయి.

2008 సంవత్సరంలో కూడా ఈ కేబుల్స్ వల్ల..

2008 సంవత్సరంలో కూడా ఈ కేబుల్స్ వల్ల..

ఇక 2008 సంవత్సరంలో కూడా ఈ కేబుల్స్ వల్ల తీవ్ర అంతరాయం జరిగింది. అది ఫిబ్రవరి, 2008 సంవత్సరం! మధ్యధరా సముద్రంలో వున్న ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి!

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్‌వర్క్‌లన్నీ..

ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్‌వర్క్‌లన్నీ..

మధ్యప్రాచ్యంలోని పలు దేశాలల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్‌వర్క్‌లన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి (ఇండియాతో సహా!). ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.

సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వలల వల్లా, నౌకల లంగర్లవల్లా, ..

సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వలల వల్లా, నౌకల లంగర్లవల్లా, ..

సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వలల వల్లా, నౌకల లంగర్లవల్లా, సముద్రంలో వచ్చే ఉపద్రవాలవల్ల అప్పుడప్పుడూ తెగిపోతూంటాయి. ఐతే బ్యాకప్‌గా అదనపు లైన్లుండటంవల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడదు.

ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా ..

ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా ..

2008లో ఫిబ్రవరి నెలలో ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. దాంతో అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇలా జరగడం చరిత్రలో మొదటిసారేమీ కాదు.

2006లో డిసెంబర్ నెలలో కూడా ఒకసారి ఇలా..

2006లో డిసెంబర్ నెలలో కూడా ఒకసారి ఇలా..

2006లో డిసెంబర్ నెలలో కూడా ఒకసారి ఇలా జరిగింది. అయితే తైవాన్‌కు చెందిన సర్వీస్ ప్రొవైడర్ 8లో 7 కేబుల్స్, సముద్ర భూకంపంవల్ల తెగిపోయాయి. ఫలితంగా హాంగ్‌కాంగ్‌తో సహా ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొన్ని నెలలపాటు ఆ సంస్థ అందించే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

ఇంటర్నెట్ కేబుళ్లను పునరుద్ధిరించే పనిని ఫ్లాగ్ టెలీకాం..

ఇంటర్నెట్ కేబుళ్లను పునరుద్ధిరించే పనిని ఫ్లాగ్ టెలీకాం..

అయితే ఇటీవల సముద్రగర్భంలో తెగిపోయిన తమ ఇంటర్నెట్ కేబుళ్లను పునరుద్ధిరించే పనిని ఫ్లాగ్ టెలీకాం తీసుకుంది. జనవరి 30వ తేదీన ఈజిప్ట్ నగరమైన అలెగ్జాండ్రియా తీరానికి 56 కిలోమీటర్ల దూరంలో ఒక నౌక సముద్రంలో లంగరు వేసే ప్రయత్నంలో కేబుళ్లు తెగిపోయిన సంగతి తెలిసిందే.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సబ్సిడరీ అయిన ఫ్లాగ్ టెలీకాం ..

రిలయన్స్ కమ్యూనికేషన్స్ సబ్సిడరీ అయిన ఫ్లాగ్ టెలీకాం ..

ఈ ఘటనలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సబ్సిడరీ అయిన ఫ్లాగ్ టెలీకాం సంస్థకు చెందిన రెండు కేబుళ్లు తెగిపోయాయి. దీనిపై ఫ్లాగ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేబుళ్ల పునరుద్ధరణ దిశగా మరమ్మతు చర్యలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు తెలిపాయి.

కేబుళ్లతో మరమ్మతులు చేపట్టే ఒక నౌక రంగప్రవేశం చేసినట్లు..

కేబుళ్లతో మరమ్మతులు చేపట్టే ఒక నౌక రంగప్రవేశం చేసినట్లు..

ఈ నేపథ్యంలో విడిభాగాలు, కేబుళ్లతో మరమ్మతులు చేపట్టే ఒక నౌక రంగప్రవేశం చేసినట్లు ఫ్లాగ్ తెలిపింది. ఈ నౌక అక్కడకు చేరుకున్నప్పటికీ వాతావరణం అనుకులించక పోవడంతో మరమ్మతు పనుల్లో జాప్యం చోటు చేసుకుంది. ఇంటర్నెట్ కార్యకలాపాల్లో 95 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారా సాగుతుండగా, మిగిలిన పనులు ఉపగ్రహ అనుసంధానంతో కొనసాగుతున్నాయి.

ఇంటెర్ నెట్ కేబుల్స్ వల్ల రానున్న కాలంలో ఆధిపత్య పోరు..

ఇంటెర్ నెట్ కేబుల్స్ వల్ల రానున్న కాలంలో ఆధిపత్య పోరు..

సముద్రం అడుగు భాగాన వస్తున్న ఇంటెర్ నెట్ కేబుల్స్ వల్ల రానున్న కాలంలో ఆధిపత్య పోరు జరిగే అవకాశాలను కొట్టి పారేయలేము...ఇదే జరిగితే మరో ప్రపంచ ఇంటర్ నెట్ యుద్ధం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.

సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్..

సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్..

ఇక ఇక్కడ మీరు చూస్తున్నది సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్. దీని అడ్డుకొలత 69 మిల్లీమీటర్లు(అంటే 2.7 ఇంచ్లు). ఇది ప్రపంచములోని 99 శాతం అంతర్జాతీయ ఇంటర్ నెట్, టెలిఫోన్ మరియూ ప్రైవేట్ డాటా ట్రాఫిక్ ను ప్రపంచ నలుమూలాలలనూ కలుపుతుంది. అంటార్కిటికా ను తప్ప. అద్భుతమైన ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఎన్నో సముద్రాలను దాటుతూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వేయబడింది.

ఇదే ఫైబర్ ఆప్టికల్ ను వేసే ఓడ

ఇదే ఫైబర్ ఆప్టికల్ ను వేసే ఓడ

ఇదే ఫైబర్ ఆప్టికల్ ను వేసే ఓడ

సముద్ర గర్భంలోని ఇంటర్ నెట్ కనెక్ట్ కేబుల్ నెట్ వర్క్

సముద్ర గర్భంలోని ఇంటర్ నెట్ కనెక్ట్ కేబుల్ నెట్ వర్క్

సముద్ర గర్భంలోని ఇంటర్ నెట్ కనెక్ట్ కేబుల్ నెట్ వర్క్

ప్రపంచాన్ని కలిపే అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్ వర్క్ మ్యాప్

ప్రపంచాన్ని కలిపే అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్ వర్క్ మ్యాప్

ప్రపంచాన్ని కలిపే అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్ వర్క్ మ్యాప్

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write US fears Russia could sever undersea internet cables

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more