విశ్వ రహస్యాలు చైనా చేతిలో..?

Posted By:

విశ్వాంతర రహస్యాలను చేధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉండే ఈ టెలీస్కోప్ ద్వారా భూమి పట్టుక, గ్రహాంతర జీవనం ఉనికి వంటి ఆంశాల పై పరిశోధనలు మరింత ముమ్మరం కానున్నాయి. గుయోజౌ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ టెలీస్కోప్‌కు ‘ఫాస్ట్' (ఫైవ్ - హండ్రెడ్ - మీటర్ అపెర్చర్ స్పెరికల్ రేడియో టెలీస్కోప్) అని నామకరణం చేసారు. 500 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ టెలీస్కోప్ రిఫ్లెక్టర్‌కు 4,450 త్రిభుజాకార ప్యానల్స్‌ను అనుసంధానించనున్నారు.

Read More: సామ్‌సంగ్‌తో ‘ఢీ' అంటోన్న 10 బ్రాండ్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అర్థవంతమైన ధ్వనులు పసిగట్టగలదు

చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ టెలీస్కోప్ విశ్వం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనులు పసిగట్టగలదు.

ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో

ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ఈ భారీ టెలీస్కోప్ను ఏర్పాటు చేస్తున్నారు.

ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేరటరీ

ప్రస్తుతానికి ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేరటరీ ప్రపంచపు అతిపెద్ద టెలీస్కోప్‌గా ఉంది. దీని వ్యాసం 300 మీటర్లు.

సుదూర తీరాలను నుంచి వెలువడే రేడియో సంకేతాలను

ప్రపంచంలోని సుదూర తీరాలను నుంచి వెలువడే రేడియో సంకేతాలను ఈ టెలీస్కోప్ పసిగట్టగలదు. 

గ్రహాంతర జీవనం పై

గ్రహాంతర జీవనం పై  ‘ఫాస్ట్' టెలీస్కోప్ పరిశోధనలు సాగించనుంది. 

సహజసిద్ధంగా ఏర్పడిన ఓ అనువైన లోయలో

ఈ టెలీస్కోప్‌ను గుయోజౌ ప్రావిన్స్ లో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ అనువైన లోయలో ఏర్పాటు చేస్తున్నారు.  

టెలీస్కోప్ చుట్టుకొలత 1.6 కిలోమీటర్

టెలీస్కోప్ చుట్టుకొలత 1.6 కిలోమీటర్

వాతవరణం చాలా నిశ్శబ్థంగా ఉంటుంది

‘ఫాస్ట్' టెలీస్కోప్‌కు 5 కిలో మీటర్ల దూరంలో ఏ విధమైన పట్టణాలు, నగరాలు లేవు. ఇక్కడ వాతవరణం చాలా నిశ్శబ్థంగా ఉంటుంది.  

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్’

2011లో ప్రారంభమైన ‘ఫాస్ట్' టెలీస్కోప్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తికానున్నాయి. 

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్’

అతిపెద్ద రేడియో టెలీస్కోప్ ‘ఫాస్ట్'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China starts assembling world's biggest radio telescope. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting