చైనా యునికామ్ ద్వారా ఐఫోన్ 4ఎస్.. ఫ్రీ.. ఫ్రీ..

Posted By:

చైనా యునికామ్ ద్వారా ఐఫోన్ 4ఎస్.. ఫ్రీ.. ఫ్రీ..

 

చైనా ఆపరేటర్ 'చైనా యునికామ్' తమయొక్క కస్టమర్స్ కోసం బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఇంతకీ ఆ బంఫర్ ఆఫర్ ఏంటని అనుకుంటున్నారా..? ఎవరైతే కస్టమర్స్ తమతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటారో వారికి 'ఐఫోన్ 4ఎస్'లను ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఇందు కోసం గాను చైనా యునికామ్ కొత్త టారిఫ్‌లను కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా విడుదల చేసింది. జనవరి 13న చైనాలో చైనా ఆపరేటర్ 'చైనా యునికామ్' అత్యంత గ్రాండ్‌గా ఐఫోన్ 4ఎస్‌ని విడుదల చేయనుంది. చైనా యునికామ్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ఎవరైతే కస్టమర్స్ చైనా యునికామ్‌తో మూడు సంవత్సరాల డీల్‌ని కుదుర్చుకుంటారో వారికి 32జిబి డివైజ్‌ని, రెండు సంవత్సరాల డీల్‌ని కుదుర్చుకున్న కస్టమర్స్‌కి 16జిబి డివైజ్‌లను అందించనున్నారు.

ఇక చైనా యునికామ్ ఆపరేటర్ విషయానికి వస్తే 'చైనా మొబైల్' తర్వాత చైనాలో రెండవ అతి పెద్ద ఆపరేటర్. గతయేడాది చైనా యూనికామ్ కస్టమర్స్‌కి అద్బుతమైన ఆఫర్స్‌ని ప్రకటించడం వల్ల 3జీ సబ్ స్క్రైబర్స్ ఎక్కువగా పొందింది. తక్కువ నెలసరి చార్జీలతో ఎక్కువ మంది కస్టమర్స్‌ని ఆకర్షించే భాగంలో చైనా యూనికామ్ ఈ సరిక్రొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

ఇది ఇలా ఉంటే ఆపిల్ కంపెనీ మాత్రం అధికారకంగా ప్రపంచపు అతి పెద్ద టెలికామ్ ఆపరేటర్ చైనా మొబైల్‌తో ఒప్పంద కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  వన్ ఇండియా పాఠకుల కోసం 'ఐఫోన్ 4ఎస్' ప్రత్యేకతలు క్లుప్తంగా...

‘ఐపోన్ 4ఎస్’ మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు: 115.2 x 58.6 x 9.3 mm

బరువు: 140 g

ఇంటర్నల్ మెమరీ: 16/32/64 GB storage, 512 MB RAM

కెమెరా: 8 MP, 3264×2448 pixels, autofocus, LED flash

ఆపరేటింగ్ సిస్టమ్: iOS 5

సిపియు: 1 GHz dual-core ARM Cortex-A9 processor, PowerVR SGX543MP2 GPU, Apple A5 chipset

బ్యాటరీ: Li-Po 1432 mAh

మెబైల్ లభించు కలర్స్: Black, White

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot