చందమామ ఆ పక్క రహస్యం చైనా చేతిలో...

Written By:

భూమి నుంచి చందమామ తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. అదే చంద్రుడికి అవతలి వైపు బూడిద రంగులో ఉంటుంది. చంద్రుని ఆవలివైపు భూమిపై నుంచి ఎప్పటికీ కనిపించదు. అయితే ఇటీవల నాసా ఉపగ్రహం ఒకటి చంద్రమండలం ఆవలివైపును చిత్రీకరించిన ఫొటోలు విడుదల చేసింది. చైనా ఇప్పుడు చంద్రమండలం అవతలి వైపును పరిశోధించేందుకు సిద్ధమైంది. భూమికి కనిపించని చందమామ అవతలివైపు భౌగోళిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిశోధించడానికి చేపట్టిన ప్రాజెక్టును 2020 సంవత్సరాని కంటే ముందే పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు.దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :ప్రేయసిని చంపాడు, సెల్ఫీతో బొక్కలో పడ్డాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చంద్రుడికి అవతలి పక్కన ఏముందో..

చంద్రుడికి అవతలి పక్కన ఏముందో..

అందమైన చందమామను మనం ఓ పక్కనే చూస్తున్నాం. చంద్రుడికి అవతలి పక్కన ఏముందోననే సందేహం చాలా ఏండ్లుగా పరిశోధకులను వెంటాడుతున్నది.

చీకటి కోణాన్ని ఆవిష్కరించే తొలి దేశంగా..

చీకటి కోణాన్ని ఆవిష్కరించే తొలి దేశంగా..

చంద్రుడి గురించి ప్రపంచానికి తెలియని చీకటి కోణాన్ని ఆవిష్కరించే తొలి దేశంగా ఘనతను సొంతం చేసుకోవడానికి చైనా అడుగులేస్తున్నది.

చాంగ్‌ ఈ-4 ప్రాజెక్ట్‌

చాంగ్‌ ఈ-4 ప్రాజెక్ట్‌

చంద్రగ్రహానికి మరోపక్క భాగంలో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై పరిశోధనలు చేయడానికి చాంగ్‌ ఈ-4 ప్రాజెక్ట్‌ను 2020లోగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని తగిన ఏర్పాట్లు చేస్తున్నదని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుడు జో యాంగ్లియావో తెలిపారు.

రష్యా అమెరికాల తర్వాత..

రష్యా అమెరికాల తర్వాత..

రష్యా అమెరికాల తర్వాత చాంగ్‌ఏ-3 మిషన్‌తో చంద్రుడిపై అడుగుపెట్టిన మూడో దేశం గా చైనా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఎక్కువ పేలోడ్‌ను భరించగలిచే చాంగ్‌ ఈ -4

ఎక్కువ పేలోడ్‌ను భరించగలిచే చాంగ్‌ ఈ -4

ఈ పరిశోధన కోసం ఎక్కువ పేలోడ్‌ను భరించగలిచే చాంగ్‌ ఈ -4 మిషన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు.

చంద్రుడికి మరోవైపు ఉన్న ప్రాంతం

చంద్రుడికి మరోవైపు ఉన్న ప్రాంతం

గురుత్వాకర్షణ కారణంగా చంద్రుడికి మరోవైపు ఉన్న ప్రాంతం భూమిపై ఉన్నవారికి కనిపించదు.

మరిన్ని వాస్తవాలు..

మరిన్ని వాస్తవాలు..

మనకు కనిపించే భాగమంతా స్వచ్ఛమైన ఎలెక్ట్రోమాగ్నటిక్ వాతావరణంతో తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో అధ్యయానికి అనువుగా ఉంది. ఆ భాగంలో స్పెక్ట్రోగ్రాఫ్ ఫ్రీక్వెన్సీని ప్రవేశపెడితే.. మరిన్ని వాస్తవాలు తెలుసుకోవచ్చు అని తెలిపారు.

2003లో అంతరిక్షంలోకి చైనా..

2003లో అంతరిక్షంలోకి చైనా..

2003లో అంతరిక్షంలోకి చైనా వ్యోమగాములను పంపింది. అంతరిక్షంలో ఉండే నివాసయోగ్యమై ప్రదేశాలను కనుగొనేందుకు చైనా ఈ పరిశోధనలు ప్రారంభించింది.

చంద్రునిపై 12 మంది

చంద్రునిపై 12 మంది

ఇప్పటివరకు చంద్రునిపై 12 మంది దిగారు. వారిలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బుజ్ ఆల్డ్రిన్ లు జూలై 20 1996న చంద్రునిపై తొలిసారిగా తమ అడుగులను మోపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China wants to land a probe on the moon's far side: Chang'e 4 mission will study rocks and could pave the way for a lunar telescope
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting