ఆలీబాబా అమ్మకాల సునామీ, ఒక్క రోజులో 94,000 కోట్ల వ్యాపారం!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా.కామ్ తన ఆన్ లైన్ అమ్మకాల రికార్డను తానే బద్దలు కొట్టుకుంది. ప్రతి ఏటా నవంబర్ 11న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘సింగిల్స్ డే' షాపింగ్ ఈవెంట్ లో భాగంగా ఆలీబాబా.కామ్ అమ్మకాల సునామీని సృష్టించింది. నిన్నటి సింగిల్స్ డే షాపింగ్ ఫెస్టివల్ లో భాగంగా 14.3 బిలియన్ డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ 94,502 కోట్లు) విలువ చేసే వస్తువులను ఆలీబాబా విక్రయించి ప్రపంచ ఈ-కామార్స్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి నాంది పలికింది...
Read More : వాట్సాప్‌ను ఫ్రీగా వాడుకోవాలంటే..?

ఆలీబాబా అమ్మకాల సునామీ
ఆలీబాబా 2014లో నిర్వహించిన ‘సింగిల్స్ డే' షాపింగ్ సేల్ 9.34 బిలియన్ డాలర్ల (రూ.56,000 కోట్ల) వ్యాపారాన్ని నమోదు చేసింది

ఆలీబాబా అమ్మకాల సునామీ
ఆలీబాబా 2013లో నిర్వహించిన సింగిల్స్ డే సేల్‌లో భాగంగా 5.8బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేసింది.

ఆలీబాబా అమ్మకాల సునామీ
ఈ గణాంకాలను విశ్లేషించినట్లయితే ఆలీబాబా.కామ్ తన సింగిల్స్ డే సేల్ ద్వారా అంతకంతకకు రికార్డుల మోత మోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆలీబాబా అమ్మకాల సునామీ
నవంబర్ 11న చైనాలో జరుపుకునే ‘సింగిల్స్ డే'ను ‘యాంటీ వాలెంటైన్స్ డే'గా పిలుస్తారు.

ఆలీబాబా అమ్మకాల సునామీ
ప్రేమికుల రోజును జరపుకోవడాన్ని నిరసిస్తూ 2009 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 11న ఆలీబాబా ఈ భారీ స్థాయి డిస్కౌంట్‌లను ప్రకిటిస్తోంది.

ఆలీబాబా అమ్మకాల సునామీ
గతంలో చైనాకు మాత్రమే పరిమితమైన ఈ ‘సింగిల్స్ డే' షాపింగ్ బొనాంజా ఆఫర్‌ను ఆలీబాబా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసకువచ్చింది.

ఆలీబాబా అమ్మకాల సునామీ
దీంతో ప్రపంచదేశాల నుంచి ఆన్‌లైన్ షాపర్లు డిస్కౌంట్ ధరల పై వస్తువులను దక్కించేకునేందుకు ఎగబడుతున్నారు.


Click it and Unblock the Notifications








