డౌన్‌లోడ్‌లలో టిక్‌టాక్ రికార్డును అధిగమించిన Chingari యాప్...

|

ఇండియాలో చిన్న చిన్న వీడియోలను తయారు చేయడానికి అనేక యాప్ లు ఉన్నాయి. కానీ అన్నిటితో పోలిస్తే టిక్‌టాక్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ టిక్‌టాక్ యాప్ ను ఇండియాలో నిషేదించడంతో దీనికి ప్రత్యామ్నాయంగా 'మేడ్ ఇన్ ఇండియా' తో గల 'చింగారి' యాప్ యొక్క డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగాయి.

చింగారి యాప్

చింగారి యాప్

టిక్‌టాక్ నిషేధంతో దీని యొక్క డౌన్‌లోడ్‌లు కేవలం 10 రోజుల్లోనే 3 మిలియన్ల మైలురాయిని చేరుకుంది. అయితే ఇప్పుడు ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో 22 రోజుల్లో 10 మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించింది. చిన్న సైజు వీడియోల కోసం 'మేడ్ ఇన్ ఇండియా' యాప్ "చింగారి" కి ఇప్పుడు ప్రజలలో ప్రజాదరణ మరింత ఎక్కువగా పెరిగింది. ఇది ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 2 యాప్ లలో ఒకటిగా ఉంది.

మేడ్ ఇన్ ఇండియా చింగారి యాప్

మేడ్ ఇన్ ఇండియా చింగారి యాప్

మేడ్ ఇన్ ఇండియా పేరుతో వచ్చిన చిన్న సైజు వీడియో యాప్ 'చింగారి' టిక్‌టాక్ మొదటిలో అధిక డౌన్‌లోడ్‌లను సాధించిన విధంగా ఇది సరికొత్త రికార్డును సృష్టిస్తున్నది. ఇంకా చెప్పాలంటే టిక్‌టాక్ కంటే వేగంగా అధిక డౌన్‌లోడ్‌ల రికార్డును అధిగమిస్తున్నది. టిక్‌టాక్ నిషేధంతో దీని యొక్క డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగాయి. రోజువారీలో ఇది ఘనమైన పెరుగుదలను చూస్తున్నాయి. వినియోగదారులందరి నమ్మకానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యాప్ లోకి చేరమని ఇతరులను కూడా ఆహ్వానించాలనుకుంటున్నాము అని చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు బిస్వాత్మ నాయక్ అన్నారు.

 

Also Read: JioMeet HD వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్!!! 100 మందితో జూమ్‌కు పోటీగా...Also Read: JioMeet HD వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్!!! 100 మందితో జూమ్‌కు పోటీగా...

చింగారి యాప్ ఫీచర్స్

చింగారి యాప్ ఫీచర్స్

చిన్న-వీడియో తయారీ యాప్ టిక్‌టాక్ మాదిరిగానే "చింగారి" యాప్ కూడా స్నేహితులతో చాట్ చేయడం, క్రొత్త వ్యక్తులతో సంభాషించడం, కంటెంట్‌ను షేర్ చేయడం, ఫీడ్ ద్వారా బ్రౌజ్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లతో పాటు వీడియోలను డౌన్‌లోడ్ చేయడం మరియు అప్‌లోడ్ చేయడం వంటి వాటికి కూడా అనుమతిస్తుంది. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం మరియు తెలుగుతో సహా పలు భాషలలో లభిస్తుంది. వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యొక్క యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

చింగారి యాప్ తో డబ్బును సంపాదించడం

చింగారి యాప్ తో డబ్బును సంపాదించడం

చైనీస్ యాప్ టిక్‌టాక్ కు పోటీగా వచ్చిన చింగారి యాప్ లో చాలా రకాల బహుమతులు కూడా ఉంటాయి. చింగారి యాప్ లో వినియోగదారులు అప్‌లోడ్ చేసిన కంటెంట్‌కు డబ్బు కూడా లభిస్తుంది. వీడియో ఎంత వైరల్ అవుతుందో దాని ఆధారంగా చింగారి కంటెంట్ సృష్టికర్తకు డబ్బును చెల్లిస్తుంది. చింగారి యాప్ లో ఒకరు అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో కోసం మీరు పాయింట్లను పొందుతారు. ఈ పాయింట్ల ద్వారా యూజర్లు డబ్బును రీడీమ్ చేయవచ్చు.

చింగారి యాప్ స్పెసిఫికేషన్స్

చింగారి యాప్ స్పెసిఫికేషన్స్

చింగారి యాప్ వినియోగదారుడు వాట్సాప్ స్టేటస్ వంటి వాటి కోసం వీడియోలు, ఆడియో క్లిప్‌లు, GIF స్టిక్కర్లు మరియు ఫోటోలతో సృజనాత్మకంగా కొత్తగా తయారు చేయవచ్చు. ఈ అనువర్తనం ట్రెండింగ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, ఫన్నీ వీడియోలు, సాంగ్ వీడియోలు, శుభాకాంక్షలు, ప్రేమ కోట్స్, స్టేటస్ వీడియోలు, గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ వీడియోలు, షయారిస్, క్లిప్స్ మరియు మీమ్స్ లకు కూడా యాక్సిస్ అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Chingari Video App Cross 10 Million Downloads in Just 22 days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X