TikTok ‌లో ఎవరినైనా బ్లాక్ లేదా అన్‌బ్లాక్ చేయడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా యాప్ లలో టిక్‌టాక్ కూడా ఒకటి. ఇది మొదట కొన్ని వివాదాలను చవిచూసినప్పటికీ ముఖ్యంగా ఇండియాలో దీనిని ఎక్కువ మంది వాడుతున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌

చిన్న చిన్న వీడియోలను సృష్టించి ప్రపంచంతో పంచుకునేందుకు టిక్‌టాక్ మిమ్మల్ని అనుమతిస్తుంది. టిక్‌టాక్ లో కొన్ని అకౌంటులు నిజంగా బాధించే విధంగా ఉంటాయి. అటువంటి వాటి కోసం టిక్‌టాక్ ఆ అకౌంటులను నిరోధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. Realme Smart TV vs Xiaomi Mi TV 4A Pro: ఈ రెండింటిలో ఉత్తమమైనది ఇదే!!!!

 

వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌

వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్‌

టిక్‌టాక్‌లో మీరు అనుసరిస్తున్న వినియోగదారుడు మిమ్మల్ని అకస్మాత్తుగా అడ్డుకుంటే ఏమి జరుగుతుంది? టిక్‌టాక్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా అని మీరు ఎలా కనుగొంటారు? టిక్‌టాక్‌లో ఒకరిని ఎలా నిరోధించాలి? మరియు టిక్‌టాక్‌లో ఒకరిని ఎలా అన్‌బ్లాక్ చేయాలి వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి. JioFiber బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ప్లాన్‌ల డేటా ఆఫర్స్ ఇవే...

టిక్‌టాక్‌లో ఒకరిని ఎలా బ్లాక్ చేయాలి?

టిక్‌టాక్‌లో ఒకరిని ఎలా బ్లాక్ చేయాలి?

వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ టిక్‌టాక్‌లో ఒక వ్యక్తి చేసే వీడియోలు మీకు ఇబ్బందిని కలిగించిన లేదా వారు చేసే కామెంట్స్ నచ్చకపోయినా లేదా ఒకరిని బ్లాక్ చేయాలనుకుంటున్నట్లు మీకు అనిపించిన సందర్భాలు చాలా ఉండవచ్చు. అందుకోసం ఎవరినైనా బ్లాక్ చేయడానికి కింద ఉన్న దశలను అనుసరించండి.

 

 

టిక్‌టాక్‌లో ఒకరిని బ్లాక్ చేసే దశలు

టిక్‌టాక్‌లో ఒకరిని బ్లాక్ చేసే దశలు

1. టిక్‌టాక్‌ను ఓపెన్ చేయండి > డిస్కవర్ మీద నొక్కి మీరు బ్లాక్ చేయదలిచిన వ్యక్తి యొక్క పేరును నమోదు చేయండి. దీనికి ప్రత్యామ్నాయంగా సెర్చ్ పట్టీలో టిక్‌టాక్> ME ట్యాప్ చేయండి>ఫాలోయింగ్ మీద నొక్కండి> తరువాత మీరు బ్లాక్ చేయదలచిన వినియోగదారు పేరును వెతకండి.

2. తరువాత యూజర్ యొక్క ప్రొఫైల్ ను ఓపెన్ చేయండి> కుడివైపు ఎగువ మూలలో ఉన్న క్షితిజ సమాంతర మూడు-చుక్కల చిహ్నాన్ని నొక్కండి> ఇందులో గల బ్లాక్ అనే ఎంపికను ఎంచుకోండి.

3.ఈ విధంగా మీరు కోరుకున్న వినియోగదారుడిని మీరు బ్లాక్ చేయగలరు. బ్లాక్ చేయబడిన తర్వాత వారు టిక్‌టాక్‌లో మీతో సంభాషించలేరు మరియు మీరు వారి వీడియోలను చూడలేరు.

 

టిక్‌టాక్‌లో ఒకరిని అన్‌బ్లాక్ చేయడం ఎలా?

టిక్‌టాక్‌లో ఒకరిని అన్‌బ్లాక్ చేయడం ఎలా?

1. టిక్‌టాక్‌ను ఓపెన్ చేయండి> డిస్కవర్ ఎంపిక మీద నొక్కండి. ఇందులో మీరు అన్‌బ్లాక్ చేయదలిచిన వినియోగదారుడి యొక్క పేరును నమోదు చేయండి. లేదా దీనికి ప్రత్యామ్నాయంగా టిక్‌టాక్‌ను ఓపెన్ చేయండి> ME ట్యాప్ చేయండి> కుడివైపు ఎగువ మూలలో ఉన్న క్షితిజ సమాంతర మూడు-చుక్కల చిహ్నాన్ని నొక్కండి> గోప్యత మరియు భద్రత ఎంపికను నొక్కండి> తరువాత బ్లాకెడ్ అకౌంట్ ఎంపికను ఎంచుకోండి.

2. తదుపరి స్క్రీన్‌లో మీరు అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న వారి పక్కన గల అన్‌బ్లాక్ ఎంపికను నొక్కండి. దీని తరువాత మీరు ఆ వినియోగదారుడి యొక్క వీడియోలను చూడవచ్చు మరియు తనతో సంబాషించవచ్చు.

 

Best Mobiles in India

English summary
TikTok App: How to Block and Unblock Anyone in Your Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X