తోక చుక్క నుండి సెకనుకు 500 బాటిళ్ల మందు

Written By:

సాధారణంగా ఆల్కహాల్ తయారీకి చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అవేమీ లేకుండానే సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ తయారవుతోంది. అది కూడా ఆకాశంలో..! ఆకాశంలో ఆల్కహాల్ ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవండి. ఆకాశంలో ఆల్కహాల్ రిలీజ్ చేస్తోంది లవ్ జాయ్ అనే తోకచుక్క. అది కూడా సెకనుకు 500 బాటిళ్లు ఉత్పత్తి చేస్తోందంటున్నారు ఫ్రాన్స్ సైంటిస్ట్ లు. ఇటీవల జరిపిన పరిశోధనలో ఇది వెల్లడైందట. మద్యంలో ఉండే ఇథైల్ ఈ తోకచుక్కలో ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ఇక చదవండి.

Read more: పెను విషాదం వెనుక భయానక వాస్తవాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా ..

గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా ..

గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా తోక చుక్కలు ఒక్కోసారి సూర్యునికి దగ్గరగా వస్తుంటాయి. ఈ టైమ్ లో సూర్యుని వేడి కారణంగా తోకచుక్కలు కొన్ని వాయువులను విడుదల చేస్తాయి. ఇలా ఈ ఏడాది జనవరి 30న ‘లవ్ జాయ్' అనే తోక్కచుక్క సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చింది. దీంతో లవ్ జాయ్ తనలోని ఇథైల్ ఆల్కహాల్ ను పెద్దఎత్తున రిలీజ్ చేసింది.

లవ్ జాయ్ సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ విడుదల చేసినట్లు ...

లవ్ జాయ్ సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ విడుదల చేసినట్లు ...

లవ్ జాయ్ సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ విడుదల చేసినట్లు గుర్తించామని సైంటిస్టులు చెబుతున్నారు. లవ్ జయ్ లో విడుదలయ్యే వాయువులో ఇథైల్ ఆల్కహాల్, గ్లైకాల్డిహెడ్ సహా 21 రకాల కర్బణ అణువులు ఉన్నాయంటున్నారు. ఆల్కహాల్ ఆంతరిక్షంలోనూ ఉత్పత్తవుతోందని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక తోకచుక్కపై ఇథైల్ ఆల్కహాల్‌ను కనుగొనడం ఇదే మొదటిసారి.

లవ్‌జాయ్ ఈ ఏడాది జనవరి 30న సూర్యునికి దగ్గరగా...

లవ్‌జాయ్ ఈ ఏడాది జనవరి 30న సూర్యునికి దగ్గరగా...

అతిశీతల వాతావరణం ఉండే లవ్‌జాయ్ ఈ ఏడాది జనవరి 30న సూర్యునికి దగ్గరగా వచ్చింది. సూర్యుని వేడిమికి ఇది సెకెనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేసింది. దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో తోకచుక్కపై జీవం ఉనికికి అవసరమైన కర్బన పరమాణువులు ఉన్నట్లు తేలిందన్నారు.

స్పెయిన్‌ని నవేదా పర్వతాల్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా..

స్పెయిన్‌ని నవేదా పర్వతాల్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా..

ప్రకాశవంతమైన ఈ తోకచుక్కను స్పెయిన్‌ని నవేదా పర్వతాల్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా పరిశీలించారు. భూమిలాంటి గ్రహం నుంచి విడివడిన పదార్థమే తోకచుక్కగా రూపాంతరం చెందిందని విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయనే వాదనకు మద్దతు లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ తోకచుక్కలో ఇథైల్ ఆల్కహాల్, గ్లైకాల్ ఆల్డీహైడ్ అనే ఒక రకం చక్కెర ..

ఈ తోకచుక్కలో ఇథైల్ ఆల్కహాల్, గ్లైకాల్ ఆల్డీహైడ్ అనే ఒక రకం చక్కెర ..

ఈ తోకచుక్కలో ఇథైల్ ఆల్కహాల్, గ్లైకాల్ ఆల్డీహైడ్ అనే ఒక రకం చక్కెర సహా 21 రకాల సేంద్రియ పదార్థాలు వాయువు రూపంలో ఉన్నట్లు శాస్తవ్రేత్తల బృందం గుర్తించింది. ఈ ఏడాది జనవరి 30న లవ్‌జాయ్ సూర్యుడికి అతి చేరువగా వచ్చిందని, ఆ సమయంలో సెకనుకు 20 టన్నుల నీటిని విడుదల చేసిందనే విషయాన్ని పరిశోధకుల బృందం గుర్తించింది.

వేడిక్కిన తోకచుక్క వాయువులను విడుదల చేసి ఉంటుందనే ..

వేడిక్కిన తోకచుక్క వాయువులను విడుదల చేసి ఉంటుందనే ..

ఆ సందర్భంలో లవ్‌జాయ్ పరిసర ప్రాంతాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాయనే విషయాన్ని స్పెయిన్‌లోని సియారా నెవడా పర్వతశ్రేణుల్లోని పికో వెలెటా వద్ద 30 మీటర్ల వ్యాసార్థమున్న టెలిస్కోప్‌ను ఉపయోగించి ఖగోళశాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా తోకచుక్కలు సూర్యుడి సమీపానికి చేరుకుంటాయని, ఆ సమయంలో వేడిక్కిన తోకచుక్క వాయువులను విడుదల చేసి ఉంటుందనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.

వాయువుల్లో 21 రకాల సేంద్రియ పరమాణువులున్నాయని..

వాయువుల్లో 21 రకాల సేంద్రియ పరమాణువులున్నాయని..

పరిశోధనల్లో భాగంగా అత్యవసర జీవితానికి అవసరమైన సేంద్రియ పరమాణువులు తోకచుక్కలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఎథైల్ అల్కహాల్, గ్లెకోలాడేహైడ్‌తోపాటు తోకచుక్క విడుదల చేసే వాయువుల్లో 21 రకాల సేంద్రియ పరమాణువులున్నాయని పరిశోధకులు గుర్తించారు.

ప్రాచీనకాలంలో భూమిపై ఉన్న జీవానికి ఊతమిచ్చి ఉండవచ్చనే సందేహాన్ని..

ప్రాచీనకాలంలో భూమిపై ఉన్న జీవానికి ఊతమిచ్చి ఉండవచ్చనే సందేహాన్ని..

తోకచుక్కలు విడుదల చేసిన ఈ పరమాణువులు ప్రాచీనకాలంలో భూమిపై ఉన్న జీవానికి ఊతమిచ్చి ఉండవచ్చనే సందేహాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిశోధన ఫలితాల ఆధారంగా తోకచుక్కల్లో క్లిష్టమైన రసాయనాలు ఉన్నాయనే ఆలోచనకు బలం చేకూరుతుందని మేరీల్యాండ్‌కు చెందిన పరిశోధకుడు స్టెఫానీ మిలయం పేర్కొన్నారు.

తోకచుక్కల్లో లవ్‌జాయ్ ..

తోకచుక్కల్లో లవ్‌జాయ్ ..

అంతరిక్షంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తోకచుక్కల్లో లవ్‌జాయ్ (సీ/2014 క్యూ2) అత్యంత ప్రకాశవంతమైందని పరిశోధకుల బృందం వెల్లడించింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Comet Lovejoy produces alcohol and sugar as it moves across space
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot