మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

Posted By:

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?, పెట్రోల్ బంక్‌లో మొబైల్ ఫోన్ వాడకం ప్రమదకరమా..?, మొబైల్ ఫోన్‌లు మీ మెదళ్లను దహించివేస్తున్నాయా..?, ఫోన్ క్యాన్సర్‌కు కారకమవుతోందా..?, మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి ఇలాంటి ఆసక్తికర పురాణగాధలు ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి మదిలో పాతకుపోయిన ఈ అంశాలకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చే క్రమంలో గిజ్‌బాట్ ఆయా ప్రచారాలకు సంబంధించి విశ్లేషనాత్మక సమచారాన్ని మీకు అందిస్తోంది. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

ప్రపంచదేశాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం ఏలా ఉంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

1.) సెల్‌ఫోన్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో పెట్టుకోవటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనం పై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.

 

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

2.) అతి మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు కారణమవుతోందా..?

మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలుమైన రుజువులు ఇప్పటికి దొరకలేదు. ఈ అంశానికి సంబంధించి పరిశోధనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా సెల్‌ఫోన్‌లను అవసరం మేరకు వినియోగించుకోవటం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి.

 

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

3.) బ్యాటరీ పవర్‌‍ను పెంచేందుకు కోడ్ ఏమైనా ఉందా..?

ఇది నూటికి నూరు శాతం అవాస్తవం. సెల్‌ఫోన్ బ్యాటరీలోని శక్తి ముగింపు దశకు చేరుకుందంటే ఆటోమెటిక్‌గా ఫోన్ స్విచ్‌ఆఫ్ అయిపోతుంది. తిరిగి మీరు చార్జింగ్ పెట్టేంత వరకు మీ ఫోన్ ఆన్ అవదు. బ్యాటరీలోని శక్తి ముగింపు దశకు వచ్చినపుడు ఓ కోడ్‌ను టైప్ చేయటం ద్వారా బ్యాటరీ శక్తి సగానికి పెరుగుతుందన్న రూమర్ వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తుంది. ఈ సమాచారాన్ని నమ్మకండి.

 

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

4.) మొబైల్ ఫోన్‌లు మెదళ్లను దహించివేస్తున్నాయా..?

మొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశ ముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌‍ను మితంగా ఉపయోగించటం మంచది.

 

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

5.) సెల్‌ఫోన్‌‍ను ప్రతి రోజు చార్జ్ చేయటం వల్ల బ్యాటరీ జీవిత పరిమాణం తగ్గిపోతుందా..?

పాత కాలం సెల్‌ఫోన్ మోడళ్లలో ఈ తరహా సమస్య ఉండేది. ఎన్ఐసీడీ, ఎన్ఐఎమ్ హెచ్ బ్యాటరీలను కలిగిన మొబైల్ ఫోన్‌లు ఈ తరహా సమస్యను ఎదుర్కునేవి. లై-యోన్, లై-యోన్ పాలిమర్ బ్యాటరీలను కలిగి ఉంటున్న సెల్‌ఫోన్‌ల ను ఉపయోగించటం ద్వారా
ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

 

మొబైల్ మగతనాన్ని దెబ్బతీస్తుందా..?

6.) పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ ఉపయోగించవచ్చా..?

సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంక్‌లో ప్రమాదం ఏర్పడిన సంఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. చిన్న రాపిడికి సైతం పెట్రోల్ స్పందించగలదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ తరహా హెచ్చరికులను

జారీ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot