ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

Written By:

కొన్ని కంపెనీలు ఉద్యోగులను పనిపేరుతో వేధించి చంపుకుతింటాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఉద్యోగులకు కావాల్సిన అవకాశాలు ఇచ్చి వారి చేత పనిచేయించుకుంటాయి. ఇంకొన్ని కంపెనీలు అయితే ఉద్యోగులను తమ బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాయి. అలాంటి కంపెనీలపై ఈ మధ్య ఓ సర్వే జరిగింది. ఏయే కంపెనీలు తమ ఉద్యోగులకు బాగా చూసుకుంటున్నాయనేదానిపై ఓ 10 కంపెనీలు ముందు వరుసలో నిలిచాయి. అవేంటో చూడండి.

ఇండియాలో ఉద్యోగానికి బెస్ట్ కంపెనీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిఫ్‌కార్ట్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

ఈ సంస్థ మహిళలకు  ఆరు నెలల పెయిడ్ లీవ్ సౌకర్యం కలిగిస్తుంది. అదే సమయంలో పురుష ఉద్యోగికి కూడా తండ్రి అయ్యే ముందు పది రోజులు లేదా ఆ తర్వాత పది రోజుల సెలవులు ఇస్తోంది. బిడ్డ పుట్టిన మూడు నెలల పాటు ఆఫీసులో కొంచెం పని మిగిలితే ఇంటికి వెళ్లి పని చేసుకునే అవకాశాన్నీ ఇస్తోంది.

గూగుల్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

గూగుల్ కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా మరణించినట్లయితే వారి వేతనంతో 50 శాతాన్ని 10 సంవత్సరాల పాటు ఏటా ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.

గూగుల్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

GOOGLEను THE GODFATHER OF UNBELIEVABLE OFFICE PERKS అని కార్పొరెట్ ప్రపంచం ప్రశంసిస్తుంది. అటువంటి సంస్థ తమ ఉద్యోగులకు శని, ఆదివారాలు ఎలాగూ సెలవులే అని శుక్రవారం పని ఎక్కువ తీసుకుంటుందా అంటే లేదు. ఆ మధ్యాహ్నం నుంచే రిక్రియేషన్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తూ సరదాగా ఆటపాటలతో ఎంజాయ్ చేయడానికి సహకరిస్తూ వీకెండ్స్‌కి ఉద్యోగులను ఇలా హాయిగా ఇంటికి సాగనంపుతుంది.

అసెంచుర్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

సెలవులు ఇవ్వడంలో ఆక్సెంచర్ (ACCENTURE) కంపెనీ ఒక సరికొత్త విప్లవాన్నే ప్రారంభించింది. ఉద్యోగులు తమ సహోద్యోగులకు తమ సెలవులను డొనేట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో ఒకరి సెలవులు మరొకరు వాడుకుంటూ పరస్పర సహకారంతో తమ జీవితాన్ని సులభతరం చేసుకునే అవకాశం లభిస్తోంది.

అసెంచుర్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

ఈ పాలసీ ప్రారంభించిన బహుళజాతి సంస్థలో అవసరం ఉంటే ఆ కంపెనీ సీఈఓ కూడా తమ కింది ఉద్యోగుల ఏడాది సెలవుల్లోంచి ఒక ఐదు నాకిస్తావా ప్లీజ్ అని అడిగి, అలా సెలవులను సర్దుబాటు చేసుకునే వీలుంది.

గోద్రెజ్ కంపెనీ

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

గోద్రెజ్ కంపెనీ అయితే జ్వరం వస్తే యాజమాన్యమే ఇబ్బంది పడుతుంది. ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని చెబుతోంది. ఆ కంపెనీ తాజాగా తమ ఉద్యోగులు జబ్బు పడితే సిక్ లీవ్స్ విషయంలో ఉదారంగా ఉండాలని కూడా నిర్ణయించుకుంది. ఆరోగ్యం బాగా లేక నాలుగురోజులు రాకపోతే ఉద్యోగం ఊడిపోతుందన్న బాధ ఎంతమాత్రం పెట్టుకోవద్దని ఆ కంపెనీ ఉద్యోగులకు చెబుతోంది.

టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (TTSL) కంపెనీ.

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

ఇక్కడ ఆఫీసుకు రావాలన్న నియమమే లేదు. అటెండెన్స్ రిజిస్టర్, థంబ్ ఇంప్రెషన్, కార్డ్ స్వైప్స్ గట్రా ఏమీ వుండవు. ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకుంటే చాలు. అప్పజెప్పిన పని హాయిగా చేసుకుంటే అదే పదివేలు అన్నట్టుంటుంది యాజమాన్యం.

టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (TTSL) కంపెనీ.

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

ఒకవేళ ఆఫీసుకు రావాలనుకుంటే ముందే ఇన్ఫాం చేయాలట. అది కూడా ఎందుకంటే- ఉద్యోగులు తమ కార్యాలయానికి వస్తే వారికి అవసరమైన కాఫీ, టీలు సర్వ్ చేయడం కోసం, ఇంకేదైనా విధంగా సహకరించడానికేనట!

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

వికలాంగులను కూడా దివ్యాంగులుగా గుర్తించడం, ఉద్యోగులుగా వారి ఉన్నతికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ సంస్థ విధానం. అంతేకాదు, మహిళా ఉద్యోగుల విషయంలో ఈ సంస్థ చూపుతున్న శ్రద్ధ కూడా అభినందించదగ్గది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళా ఉద్యోగులకు 20 వారాల పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇస్తుంది.

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

అంతేకాదు, ప్రెగ్నెన్సీకి తర్వాత కూడా, సెలవులయ్యాక ఆఫీసుకు వచ్చే మహిళలను తల్లులను చూసుకున్నట్టే చూసుకుంటుంది. వాళ్లకు ప్రత్యేక క్యాబ్స్ అరేంజ్ చేయడం దగ్గర్నుంచీ వైద్య సహాయం విషయంలోనూ ప్రత్యేక దృష్టి పెడుతుంది. (అంతేకాదు, మధ్యలో ఆఫీసులో పని చేసుకోవడం కష్టంగా అనిపిస్తే వారంలో ఒకరోజు ఆమె ఇంటినుంచే పని చేసుకోవచ్చు).

మారియట్ హోటల్స్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

మారియట్ హోటల్స్ యాజమాన్యం ఎంప్లాయిస్ అన్న మాటే నిషేధించి తమ ఉద్యోగుల విషయంలో మరో ముందడుగు వేసింది. ఈ సంస్థ ఉద్యోగులను తమ సహచరులుగా గుర్తించాలని నిర్ణయించి, వాళ్లను సంస్థలో అసొసియేట్స్‌గా పేర్కొంటోంది.

మారియట్ హోటల్స్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

ఇది మాటల వరకే కాకుండా ఆచరణలో పాటించాలని దశల వారీగా వాళ్లకు తగు వసతి సౌకర్యాలను అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా సంస్థలో పనిచేసే ప్రతి అసోసియేట్ తల్లిదండ్రులతో యాజమాన్యం టచ్‌లో ఉంటుంది. వాళ్ల బాగోగుల గురించీ విచారిస్తుంది.

కోకాకోలా కంపెనీ

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

బాగోగుల గురించి అంటే కోకాకోలా కంపెనీ పద్ధతి చెప్పాలి. అందులో ఒక స్థాయిలో పని చేయడానికి చేరితే అదే స్థాయిలో ఉండిపోం. సంస్థ మన ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలను గమనించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉన్న చోటునుంచి వేర్వేరు విభాగాలకూ పంపి ఉన్నత ఉద్యోగులుగా మార్చే పని చేస్తుంది.

కోకాకోలా కంపెనీ

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

దాంతో ఉద్యోగి ఎదుగుదల అన్నది వ్యక్తిగత విషయమే కాదు, అది సంస్థ బాధ్యత అని నిరూపిస్తోంది. కీలక పదవులకు మహిళా ఉద్యోగులను ఎంపిక చేయడంలో కూడా ఈ సంస్థ ప్రత్యేకమైన పాలసీ పెట్టుకుంది. అంతేకాదు, అత్యున్నత పదవుల్లో అనుభవజ్ఞులనే తీసుకోవాలని కాకుండా యువతకు కూడా పెద్దపీట వేస్తోంది.

శాప్

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

ఇక్కడ మీరు కొత్త కొత్త అయిడియాలను షేర్ చేసుకుంటూ పనిచేస్తారు.మీకు అది చేయండి ఇది చేయండి అనిడిమాండ్ చేసేవాళ్లే కనిపించరు.

ఐటీసీ

ఈ కంపెనీలు ఉద్యోగులకిచ్చే ఆఫర్లు వింటే షాకవుతారు

యంగ్ టాలెంట్ ని ప్రోత్సాహించే కంపెనీల్లో ముందు వరుసలో ఉండేది ఐటీసీ మాత్రమే. సీనియర్ల కన్నా జూనియర్లకే ఎక్కువ అవకాశాలు కల్పించి వారిలోని టాలెంట్ ను బయటకు తీస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Companies In India That Take Great Care Of Their Employees
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot