1925కి కాల్ చేస్తే..?

Posted By:

ఇక మీదట మొబైల్ ఫోన్‌లలో ఇంటర్నెట్ సేవలను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయదలుచుకునే వారి కోసం సెప్టంబర్ 1 నుంచి ప్రత్యేక నెంబర్ అందుబాటులోకి రానుంది. భారత్‌లోని మొబైల్ యూజర్లు తమ ఇంటర్నెట్ డేటాను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకునేందుకు టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చే 1925 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ లేదా ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.

Read More: డిస్‌ప్లే ఎక్కువ..... ధర తక్కువ

అదనపు ఆదయాన్ని దండుకునేందుకు ప్రయివేటు టెలికం సంస్థలు మొబైల్ ఇంటర్నెట్ డీయాక్టివేషన్ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసేస్తున్నాయంటూ సర్వత్రా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టంబర్ 1 తరువాత మొబైల్ ఇంటర్నెట్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు స్టార్ట్ అని, డీయాక్టివేట్ చేసుకునేందుకు స్టాప్ అని టైప్ చేసి 1925 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఖరి నిమిషంలో టికెట్ డీల్స్ అంటూ అనేక ప్రకటనలు మనకు ఇంటర్నెట్‌లో కనిపిస్తుంటాయి. పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తూ మీ వ్యక్తిగత వివరాలను నింపమని అడుగుతుంది. మీరు బుక్ చేసుకోబోయే సంబంధిత టికెట్‌లకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించండి.

మన ఫేస్‌బుక్ అకౌంట్‌లో రకరకాల లింక్స్ పోస్ట్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో స్కామర్లు తమ కొత్త ఎత్తుగడలో భాగంగా సోషల్ మీడియా లింక్స్‌లో వైరస్‌ను జొప్పించే ఫేస్‌బుక్ అకౌంట్‌లలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని క్లిక్ చేసినట్లయితే వైరస్ మన డివైస్ పై దాడి చేసేస్తుంది.

కాలర్ ఐడీ కుంభకోణాల్లో భాగంగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్లు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లను అడిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌తో జాగ్రత్తగా ఉండండి.

ఈ తరహా స్కామ్‌లలో భాగంగా మీకో మెయిల్ వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని, కాబట్టి ఈ లింక్ పై క్లిక్ చేసి ఐడీ ఇంకా పాస్‌వర్డ్ మార్చుకోవాలని ఆ మెయిల్‌లో ఉంటుంది. పొరపాటున ఈ విధమైన లింక్స్ పై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలో  భాగంగా  అమ్మాయిల ఫోటోలను ఎరగా చూపి నెటిజనులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Consumers Can Deactivate Internet on Their Cellphones Via Text. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot