స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా సాధ్యమవుతోంది.
(చదవండి: స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు)
వాట్సాప్ తాజాగా తన వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అన్ని వర్షన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ తాజాగా వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన నేపధ్యంలో ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యూప్‌ను వినియోగించుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
(చదవండి: మీ ఫోన్‌లోని వైరస్‌ను తొలగించేందుకు 10 చిట్కాలు)
‘వాట్స్‌యాప్'ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య 2015 జనవరి నాటికి 70 కోట్లకు చేరకున్నట్లు ఆ సంస్థ ఇటీవల వెల్లడించింది. 2014, ఆగష్ట్ నాటికి వాట్స్‌యాప్ వినియోగదారుల సంఖ్య 60 కోట్లు ఉండగా 4 నెలల వ్యవధిలోనే 10 కోట్ల మంది అదనంగా చేరడం గొప్ప విషయమని వాట్స్‌యాప్సీ ఈఓ జాన్ కౌమ్ కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
వాట్సాప్ అనేది ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాలింగ్ కూడా సాధ్యమవుతోంది.
యూజర్లు వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్‌లోని మొబైల్ ఇంటర్నెట్ డేటా లేదా వై-ఫై నెట్ వర్క్ సహాయంతో వాయిస్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న డేటా ప్లాన్ ఆధారంగా వినియోగం ఉంటుంది.
ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.అకౌంట్ విభాగంలోని Delete my account ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అక్కడ కనిపించే ఫీల్డ్ లో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి Delete my account పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి పూర్తిగా తొలగించబడతారు.ఇప్పుడు కొత్త సమాచారంతో కొత్త వాట్సాప్ అకౌంట్‌ను మీ డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.
వాట్సాప్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పిన్ నెంబర్ ఇంకా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకండి.
మీకు తెలియని వాట్సాప్ యూజర్ల నుంచి వచ్చిన డేటా ఫైళ్లను ఓపెన్ చేయకండి. వీటిలో ప్రమాదకర వైరస్ పొంచి ఉండే ప్రమాదముంది.
మీకు తెలియన వ్యక్తులతో కమ్యూనికేషన్ సంబంధాలను పెంచుకోవద్దు. మీ కాంటాక్ట్స్‌లో లేని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్లయితే సున్నితంగా తిరస్కరించండి.
వాట్సాప్ మీకు ఏ విధమైన సందేశాలను పంపదు. కాబట్టి వాట్సాప్ పేరుతో వచ్చే సందేశాలను విశ్వసించకండి.