3జీబి ర్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో హాటెస్ట్ ఫోన్ రాబోతోంది

Written By:

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ కూల్‌ప్యాడ్, తన క్వాలిటీ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 2015, అక్టోబర్‌లో ఈ బ్రాండ్ నుంచి విడుదలైన నోట్ 3 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. 3జీబి ర్యామ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి విప్లవాత్మక స్పెక్స్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ.8,999 కావటం విశేషం.

 3జీబి ర్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో హాటెస్ట్ ఫోన్ రాబోతోంది

అదే జోరును కొనసాగిస్తూ కొత్త ఏడాదిలో మరో సంచలనం పై కన్నేసిన కూల్‌ప్యాడ్, జనవరి 15న మరో లాంచ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీ లాంచ్ చేయబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మార్కెట్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏ విధమైన వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

లెనోవో ఏ7000 టర్బో, రూ.10,999

విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు మిడ్-రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రాబోతున్న ఈ ఫోన్ నోట్ 3 తరహాలోనే ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వంటి ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశముంది. జనవరి 15న ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బహర్గితమవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720*1280పిక్సల్స్)

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ ప్యాడ్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతంది.

 

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

కూల్ ప్యాడ్ డాజన్ నోట్ 3 డ్యయల్ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది

 

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6753 ఆక్టా కోర్ ప్రాసెసర్,

 

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

3జీబి ర్యామ్,

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, ఫోన్ వెనుక భాగంలో కెమెరా క్రింద ఉంటుంది.

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3 స్పెక్స్

కూల్‌ప్యాడ్ డాజెన్ నోట్ 3, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad to launch a new phone on January 15: Fingerprint Scanner, 3GB RAM in Tow. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot