Home
News

మార్కెట్లోకి Gorilla Glass 6, ఫోన్ 15 సార్లు క్రింద పడినా పగలదు!

ప్రముఖ గ్లాస్ తయారీ కంపెనీ కార్నింగ్, గొరిల్లా గ్లాస్ 6 పేరుతో సరికొత్త మొబైల్ గ్లాస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

By Bommu Sivanjaneyulu

ప్రముఖ గ్లాస్ తయారీ కంపెనీ కార్నింగ్, గొరిల్లా గ్లాస్ 6 పేరుతో సరికొత్త మొబైల్ గ్లాస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. గొరిల్లా గ్లాస్ 5కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా మార్కెట్లో లాంచ్ అయిన గొరిల్లా గ్లాస్ 6 మునుపటి మోడల్‌తో పోలిస్తే రెండు రెట్ల ధృడత్వాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా కొత్త మెటీరియల్‌తో తయారు కాబడిన గొరిల్లా గ్లాస్ 6 మల్టిపుల్ డ్రాప్స్ నుంచి ఫోన్ డిస్‌ప్లేలను రక్షించగలుగుతుంది. ఈ సరికొత్త గ్లాస్ ప్యానల్‌ను తొలిగా ఏ స్మార్ట్‌ఫోన్ ద్వారా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారనేదాని పై కంపెనీ ఎటువంటి సమాచారాన్ని రివీల్ చేయలేదు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు రిపోర్ట్స్ ప్రకారం ఆగష్టు 9న లాంచ్ కాబోతోన్న నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ నోట్ డివైస్ ద్వారా గొరిల్లా గ్లాస్ 6 మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Gorilla Glass 6

సరికొత్త గ్లాస్ కాంపోజిషన్‌తో...
విడుదలకు ముందు నిర్వహించిన అన్ని ల్యాబ్ టెస్టులను గొరిల్లా గ్లాస్ 6 సమర్థవంతంగా ఎదుర్కొగలిగిందని కార్నింగ్ తెలిపింది. ఒక మీటర్ ఎత్తయిన ప్రదేశం నుంచి 15 కంటే ఎక్కువ సార్లు ఈ గాస్లును క్రింద పడేసినప్పటికి గొరిల్లా గ్లాస్ 5 కంటే మెరిగ్గే మెరుగ్గే స్పందించగలిగిందని కార్నింగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫ్రెష్ గొరిల్లా గ్లాసును తయారు చేసే క్రమంలో సరికొత్త గ్లాస్ కాంపోజిషన్‌ను వినియోగించినట్లు గొరిల్లా వెల్లడించింది.

100Mbps స్పీడుతో 3000జిబి డేటా ప్లాన్ గురించి తెలుసా ?
మోడ్రన్ డిజైన్ ట్రెండ్స్‌తో గొరిల్లా గ్లాస్ 6 మ్యాచ్ అయ్యే విధంగా...
గొరిల్లా గ్లాస్‌ 6ను కెమికల్‌గా బలోపేతం చేయటంతో గొరిల్లా గ్లాస్ 5 కంటే ఎక్కువ శాతం కంప్రెషన్‌ను కలిగి ఉందని కార్నింగ్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ విభాగం) డాక్టర్ జేమిన్ అమిన్ తెలిపారు. ఈ కొత్త ప్యానల్ రూపకల్పనలో భాగంగా వినియోగించిన గ్లాస్ ఇంకా స్పెషాలిటీ మెటీరియల్స్ గొరిల్లా గ్లాస్ 6ను మరింత డ్యామేజ్ రెసిస్టెంట్‌గా మార్చగలిగాయని ఆయన తెలిపారు. మోడ్రన్ డిజైన్ ట్రెండ్స్‌తో గొరిల్లా గ్లాస్ 6 మ్యాచ్ అయ్యే విధంగా ఆప్టికల్ క్లారిటీ, టచ్ సెన్సిటివిటీ, స్ర్కాచ్ రెసిస్టెన్స్, ఎఫీషియంట్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఎన్‌హాన్సుడ్ డ్యూరబులిటీ వంటి ఫీచర్లతో ఆప్టిమైజ్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.
గొరిల్లా గ్లాస్ 6తో పాటు గొరిల్లా గ్లాస్ డీఎక్స్, గొరిల్లా గ్లాస్ డీఎక్స్ +...
కార్నింగ్ సంస్థ తన ప్రొడక్ట్ పోర్టిఫోలియోను మరింతగా విస్తరించుకునే క్రమంలో గొరిల్లా గ్లాస్ 6తో పాటు గొరిల్లా గ్లాస్ డీఎక్స్, గొరిల్లా గ్లాస్ డీఎక్స్ + వంటి కఠినమైన సొల్యూషన్స్‌ను విడుదల చేసింది. ప్రత్యేకించి వేరబుల్స్ కోసం డిజైన్ చేయబడిన ఈ కొత్త లైన్ గ్లాస్ ప్రొటెక్షన్ వ్యవస్థలు స్టాండర్డ్ గ్లాస్ తో కంపేర్ చేసి చూసినట్లయితే 75 శాతం మెరుగుపరచబడిన ఫ్రంట్ సర్ ఫేస్ రిఫ్లెక్షన్ ను ఆఫర్ చేయగలుగుతాయట. ఈ కొత్త గ్లాస్ ప్యానల్స్ అదే బ్రైట్నెస్ లెవల్స్‌‌ను మెయింటేన్ చేస్తూ డిస్ ప్లే కాంట్రాస్ట్ రేషియోను 50శాతం వరకు పెంచగలుగుతాయట.

Best Mobiles in India

English summary
Corning has unveiled Gorilla Glass 6 as an all-new glass protection for mobile devices. As the successor to Gorilla Glass 5 that was launched back in July 2016, the new development is touted to be designed with an "entirely new material" that helps withstand multiple drops.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X