ఆవు పిడకలకు అమెజాన్‌లో భలే డిమాండ్

Written By:

ఇప్పుడు ఏం కొనాలన్నా అందరూ ముందుగా చూసేది ఆన్‌లైన్ వైపే. ఇప్పుడు ఆన్‌లైన్ పోర్టల్ లో దొరకని వస్తువంటూ ఏదీ ఉండదు. అయితే అదే వరసలో కొత్త కొత్త వస్తువులు కూడా వచ్చి చేరుతుంటాయి. ఇంతకుముందు ఆవులు అమెజాన్ లో దర్శనమిస్తే ఈ సారి ఆవు పేడ దర్శనమిచ్చింది.. ఆవు పేడను పిడకలుగా చేసి అమెజాన్ లో అమ్ముతున్నారు...చాలా చిత్రంగా ఉంది కదా.. న్యూస్ చూస్తే ఇంకా చిత్రంగా ఉంటుంది మరి.

Read more: అడుగుదూరంలో మృత్యువు: అయినా సెల్ఫీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఆవు పేడ ఇప్పుడు ఆర్డర్లతో చాలా బిజగా

ఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో యమ డిమాండ్ ఉంది. ఈ ఆవు పేడ ఇప్పుడు ఆర్డర్లతో చాలా బిజగా ఉందండోయ్ అమెజాన్ లో..

అమెజాన్, షాప్‌క్లూస్ వంటి పోర్టల్స్‌లో

అమెజాన్, షాప్‌క్లూస్ వంటి పోర్టల్స్‌లో ఇప్పుడీ పిడకలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర కూడా అందుబాటులోనే లభిస్తోంది....ఇంకా ఎక్కువ కొన్న వారికి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు.

హైందవ ఆచారాల్లో శుభ కార్యానికైనా

హైందవ ఆచారాల్లో శుభ కార్యానికైనా, కర్మలకైనా ఆవుపేడ తప్పనిసరి. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా అన్ని పనులు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటున్నారు.

మహానగరాల్లో అదెక్కడ దొరుకుతుందో

ఏదో కార్యం పడింది.. మహానగరాల్లో అదెక్కడ దొరుకుతుందో తెలియదు, పూజాద్రవ్యాలను అమ్మే షాపులకు వెళ్తే దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అలాంటి షాపులు కూడా ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి. అంత ఓపిక లేని నెటిజన్లు ఇప్పుడు ఎంచక్కా మొబైల్‌లో ఆర్డరిచ్చేస్తున్నారు.

99 రూపాయలు మొదలు కొని 500 పైచిలుకు

99 రూపాయలు మొదలు కొని 500 పైచిలుకు (ప్యాక్‌లో పిడకల సంఖ్యను బట్టి) ధరలకు ఆవుపేడ పిడకలు అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఇదేదో ఆషా మాషీ వ్యవహారం కాదండోయ్.

ఢిల్లీకి చెందిన ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లాకు

ఢిల్లీకి చెందిన ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లాకు ఇప్పుడు ఈ బిజినెస్ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఆసియా క్రాఫ్ట్స్ మతపరమైన సామగ్రిని అమ్ముతుంది.

ప్రీతికి చటుక్కున ఓ ఆలోచన

కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతి పూజాదికాల్లో ఇప్పుడేవి వాడుతున్నారో తెలుసుకోవడానికి భక్తి చానళ్లను చూస్తుంది. ఒకరోజు ఓ స్వామివారు ఆవుపేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పడంతో... ప్రీతికి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది.

ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో

ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలు పెట్టింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో సైజులో, మందంతో చేస్తుండటంతో ప్యాకింగ్ కష్టమై పోయేది

దీంతో ఓ ఊరిలో సొంతంగా పిడకల తయారీని

దీంతో ఓ ఊరిలో సొంతంగా పిడకల తయారీని చేపట్టింది. 8 పిడకల ప్యాక్‌ను ఆసియా క్రాఫ్ట్స్ రూ.419కు అమ్ముతోంది.

నెలకు 4,000 పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను

నెలకు 3,000 పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను ఈ సంస్థ అమ్ముతోంది. విదేశాల్లో ని హిందూ ఆలయాల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి.

మరి తెలివి ఉండాలే కాని సంపాదనకు కొదవా

మరి తెలివి ఉండాలే కాని సంపాదనకు కొదవా..ఈ రోజుల్లో తెలివే పెట్టుబడి మరి...సో మీరు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Cow dung cakes selling hot on Amazon, Shopclues and eBay
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot