అడుగుదూరంలో మృత్యువు: అయినా సెల్ఫీ

Written By:

మృత్యువు అడుగుదూరంలో ఉన్న అదురు లేదు బెదురు లేదు. కాని ఫర్ఫెక్ట్ సెల్ఫీ ఎక్కడ మిస్సవుతాననే క్షణం నన్ను అణుక్షణం బాధిస్తూ ఉంటుంది. అందుకే చావు ఎంత దగ్గరగా వచ్చినా నేను మాత్రం సెల్ఫీ తీసుకుని తీరాల్సిందే. ఏంటి ఈ సెల్ఫీ చావు గోల అని మీరనుకోవచ్చు కాని ఇది నిజం. నేటి కుర్రకారు దీనినే ఫాలో అవుతున్నారు. ఎంతలా అంటే చావు పక్కనే ఉన్నా కాని ఆ చావుతో ఆటలాడుతూ దానినే అందమైన సెల్ఫీగా మల్చుకుంటున్నారు..కావాలంటే మీరూ చూడండి ఎంత ప్రమాదకర స్థితిలో సెల్ఫీ తీసుకుంటున్నారో..

Read more: మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతం సమీపంలోకి వెళ్లి సెల్ఫీ

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతం సమీపంలోకి వెళ్లి సెల్ఫీ దిగాడు. అతగాడి పేరు నిక్‌హాలిక్ అనే వ్యక్తి ఎంబ్‌రిం ద్వీపానికి వెళ్లినపుడు అక్కడ బెంబో అగ్నిపర్వతం ఏ క్షణంలో అయినా పేలే స్థితిలో పొగలు కక్కుతూ ఉంది. అది గమనించిన నిక్ ప్రమాదమని తెలిసినా వెంటనే దానికి సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు.

అగ్ని పర్వతానికి కాదు కాదు తన మృత్యువుకి

మరి ఆ అగ్ని పర్వతానికి కాదు కాదు తన మృత్యువుకి అడుగుదూరంలో ఉన్నాడు అయినా అతడికి సెల్పీ మీద ఉన్న పిచ్చి ఆ చావును సైతం లెక్కచేయలేదు. అగ్ని పర్వతం వద్ద వేడి ఎంతో ప్రమాదకర స్థాయిలో ఉందని దాని నుంచి ప్రమాదకర విషవాయువులు వెలువడుతున్నాయని తోటి ప్రయాణికుడు తెలిపారని లండన్ నుంచి వెలువడే ఓ పత్రిక తెలిపింది.

నేను చావడానికి పోవడం లేదు సెల్ఫీ తీసుకోడానికి

ఇక్కడ చూడండి నేను చావడానికి పోవడం లేదు సెల్ఫీ తీసుకోడానికి వెళుతున్నానంటో ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి

నీటిలోపల చావుతో చెలగాటమాడుతూ

నీటిలోపల చావుతో చెలగాటమాడుతూ మంచి సెల్పీ కోసం ఆరాటపడుతున్న చిత్రం.ఇతగాడు ఇంకా నాతో సెల్పీ దిగేందుకు ఎవరు వస్తున్నారంటూ కామెంట్ కూడా పెట్టాడు దీనికి.

10 వేల అడుగుల ఎత్తు..కిందకు చూస్తేనే కళ్లు బైర్లు

10 వేల అడుగుల ఎత్తు..కిందకు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటి చోట నుంచి మనోడు ఏకంగా దూకుతూ సెల్ఫీ తీసుకున్నాడు

రక్తం రుచి మరిగిన షార్క్ చేపల మధ్య సెల్ఫీ..

రక్తం రుచి మరిగిన షార్క్ చేపల మధ్య సెల్ఫీ..

ఆకాశ దేశాన పయనిస్తూ సెల్ఫీ

ఆకాశ దేశాన పయనిస్తూ సెల్ఫీ. అక్కడ నుంచి కింద పడితే ఇంక అంతే సంగతులు 

ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం నుంచి సెల్ఫీ

మేము ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశం నుంచి సెల్ఫీ దిగుతున్నామంటున్న ఓ క్రేజీ యువత

అత్యంత ఎత్తయిన జీసస్ విగ్రహంపై నుంచి సెల్ఫీ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన జీసస్ విగ్రహంపై నుంచి సెల్ఫీ తీసుకుంటున్న ఓ యువకుడు..పైగా జీసస్ తో సమావేశంలో ఉన్నారట.

నిప్పులు చిమ్మకుంటూ వెళుతున్న రాకెట్

ఓ పక్క నిప్పులు చిమ్మకుంటూ వెళుతున్న రాకెట్ మరో పక్క సెల్ఫీ

ఎంతో ఎత్తు నుంచి ఓ పిల్లవాడు సెల్ఫీ

ఎంతో ఎత్తు నుంచి ఓ పిల్లవాడు సెల్ఫీ దిగుతూ ఇలా దూకుతున్నాడు. కింద జరగరానిది జరిగితే ఎవరు భాధ్యులు

ఈ సెల్ఫీ తో ఎంతో మంది అమ్మాయిలను

ఈ సెల్ఫీ తో ఎంతో మంది అమ్మాయిలను నేను సాధిస్తానంటూ చావు అంచుల మధ్య సెల్ఫీ దిగుతున్న ఓ సెల్ఫీ ప్రేమికుడు

బొమ్మ తుఫాకితో సెల్పీ దిగుదామని ప్రయత్నించి

బొమ్మ తుఫాకితో సెల్పీ దిగుదామని ప్రయత్నించి పోలీసుల చేతిలో చావును కొని తెచ్చుకున్న యువకుడు ఉదంతం మనకు తెలిసిందే.

ఎగురుతున్న విమానంలో నుంచి సెల్ఫీ దిగేందుకు

ఎగురుతున్న విమానంలో నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ఫైలెట్ తో పాటు ప్రయాణికుడు చనిపోయిన ఘటన

వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా

ఆగ్రాలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి సెల్ఫీ.. అనంతలోకాలకు పయనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write US man clicks selfie near active volcano
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot