కొత్త రోగం: మొబైల్,ల్యాప్‌టాప్‌తో వాంతులే వాంతులు

Posted By:

ప్రతి ఒక్కరూ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుండటంతో ఇప్పుడు సరికొత్త రోగాలు వారికి దర్శనమిస్తున్నాయట..టెక్నాలజీ వాడే కొద్ది వారిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయట. ఫోన్లు ,ల్యాప్ టాప్ లు వాడటం వల్ల వారిలో వాంతులు కూడిన లక్షణాలు కనిపిస్తున్నాయట. దెబ్బతో వీరంతా ఆస్పత్రుల చుట్టూ పరిగెడుతన్నారు. ఇలాంటి వారితో విదేశాల్లోని ఆస్పత్రులు ఇప్పుడు బిజిబిజీగా ఉన్నాయట. ఇంతకీ ఈ వ్యాధి పేరేంటో తెలుసా సైబర్ సిక్నెస్. నమ్మలేని నిజాలపై మరింత సమాచారం మీ కోసం.

Read more: ఆ ట్యాబ్లెట్ ధర రూ. 90వేలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో

టెక్నాలజీని అధికంగా వాడేవాళ్ళలో సైబర్ సిక్నెస్ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ల్యాప్ టాప్ లు, ఫోన్లు వాడిన వెంటనే వీరు నీరస పడిపోవడంతో పాటు ... ముఖ్యంగా వాంతి లక్షణాలతో కూడిన అనారోగ్యం చోటు చేసుకోవడం కనిపిస్తోంది.

జనాభాలో దాదాపు 80 శాతం మందిని

ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుతున్న జనాభాలో దాదాపు 80 శాతం మందిని ఈ సైబర్ సిక్నెస్ వేధిస్తోంది.

స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ

స్కైప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఆధునిక టెక్నాలజీ పుణ్యమాని ఇప్పుడు పండు ముసలి నుంచి కుర్రాళ్ల దాకా అందరూ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నారు. వీళ్లనే అధికంగా ఈ వ్యాధి వేధిస్తోందట.

ఈమె పేరు జూన్..వయస్సు 76 ఏళ్లు

ఈమె పేరు జూన్..వయస్సు 76 ఏళ్లు ఈమె కూతురు దుబాయ్ లో, అక్క ఫ్రాన్స్ లో, ఇక బంధువులు చాలా మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారందరినీ స్క్రీన్ లో చూసి మాట్లాడగల్గుతోంది ఇప్పుడు. ఇంకేముంది సైబర్ సిక్నెస్ వచ్చేసింది.

వీటి దెబ్బకి జూన్ ఇప్పుడు సైబర్ సిక్నెస్ తో

ఎలాగంటే ఆమె తన వారందరితో సంబంధ బాంధవ్యాలను పెంచుకునేందుకు టెక్నాలజీని పెద్ద ఆయుధంగా వాడుకుంటోంది. అంతేకాదు ఆమె ఒకప్పుడు ఐబీఎం లో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కూడా పనిచేసింది. వీటి దెబ్బకి జూన్ ఇప్పుడు సైబర్ సిక్నెస్ తో బాధపడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో

ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాంతం మందిలో కనిపిస్తున్న ఈ వ్యాధి ఇప్పుడు జూన్ కూ సంక్రమించింది. కాసేపు టచ్ స్క్రీన్ ఫోన్లో మాట్లాడినా, కొద్ది సెకన్లు ల్యాప్ టాప్ ను చూసినా కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్టు అనిపించడం ఇప్పడు జూన్ ను వేధిస్తున్నాయి.

వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి

ముఖ్యంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, తలతిప్పడం, తలనొప్పి వంటివి సైబర్ సిక్నెస్ లక్షణాలు. స్క్రీన్ లో వచ్చే కదలికలకు మెదడు స్పందింస్తుంది. కానీ శరీరం పెద్దగా స్పందించదు. ఇటువంటి సందిగ్ధావస్థలో కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది.

ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా

తైవాన్ లోని కావ్ షూయింగ్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఏభైమందిపై చేసిన ప్రయోగంలో భాగంగా ... కన్సోల్ గేమ్ ను 50 నిమిషాల పాటు ఆడమన్నారు. అలా అడిన వారందరూ ఆపిన వెంటనే నీరసంగా ఫీలయ్యారు.

పిల్లల్లో 56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా

అందులో సగంకంటే ఎక్కువ మంది .. ముఖ్యంగా పిల్లల్లో 56 శాతంమంది కడుపులో తిప్పినట్లుగా ఉందన్నారు. అలాగే మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చేపట్టిన మరో అధ్యయనంలో గేమ్ కన్సోల్ సిక్నెస్ పురుషుల్లో కంటే, మహిళల్లో ఎక్కువశాతం ఉంటుందని, ఇదికూడ సైబర్ సిక్నెస్ వంటిదేనని తేల్చారు.

ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది

ఇటువంటి లక్షణాలవల్ల చాలామంది ఆన్‌లైన్లో పేపర్ చదవడం, స్కైప్ లో మాట్లాడటం కూడ చేయలేకపోతున్నారు. అలాగే ల్యాప్‌టాప్ లో స్క్రీన్ కదిపినా, ఫ్లాష్ చేసినా కూడ తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను

టెక్నాలజీ ఇండస్ల్రీ ఇటువంటి సమస్యలను గత ముఫ్ఫై ఏళ్ళుగా ఎదుర్కొంటోందని .. కావెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ మొబిలిటీ అండ్ ట్రాన్స్ పోర్ట్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సైరియల్ డైల్స్ అంటున్నారు.

వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల

వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ వాడకంవల్ల మోషన్ సిక్నెస్ వస్తోందని, కొందరు అతి సున్నితత్వంవల్ల కూడ ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్ చూడ్డం వల్ల వచ్చిన సమస్యతో కొందరు ఉద్యోగాలు కూడ చేయలేకపోతున్నారని సైరియల్ చెప్తున్నారు.

అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని

అలాగే కొన్నాళ్ళక్రితం తాను తీవ్ర మైగ్రేన్ తో బాధపడ్డానని అది ఫోన్ వల్ల వస్తోందని గమనించానని, ఇప్పుడు గర్భంతో ఉన్న తనకు కనీసం కంప్యూటర్ స్క్రీన్ దూరంనుంచీ చూస్తే కూడా వాంతి వస్తోందని అంటోంది మరో మహిళ.

కనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల

ఇటువంటి లక్షణాలన్నీకనుగుడ్లు ఎక్కువగా తిప్పడంవల్ల మెదడు కదలికలకు భంగం కలుగుతుందని, దాని కారణంగానే కళ్ళు తిరిగినట్లుగా, వాంతి వచ్చినట్లుగా ఉంటుందని లండన్ కంటి ఆసుపత్రిలోని ఆప్తమాలజిస్ట్ బాబీ క్వెషి చెప్తున్నారు.

ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని

ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకొని, స్క్రీన్ చూడటానికి బ్రేక్ ఇవ్వాలని, అంతేకాక కాస్త దూరం నుంచి చూసే అలవాటు చేసుకోవడంవల్ల కొంత శ్రమ తగ్గుతుందని ఆమె చెప్తున్నారు.

ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా

వీలైంతవరకూ ఎక్కువ సమయం ఐపాడ్స్, ఫోన్లు చూడడం మానుకోగల్గితే సైబర్ సిక్నెస్ కు దూరంగా ఉండొచ్చని ఆమె సలహా ఇస్తున్నారు.

మరిన్ని అప్‌డేట్ పొందండి

టెక్నాలజీ గురించి మరిన్నిఅప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How mobiles make you sea sick. These women claim just glancing at their phones can make them dizzy and even vomit
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot