రూ.200కే సంవత్సరమంతా ఇంటర్నెట్

Written By:

కెనడాకి చెందిన డేటావిండ్ భారత మార్కెట్లోకి మిగతా టెల్కోలకు షాకిచ్చేలా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే దేశంలో అత్యంత చవకగా ఆకాష్ ట్యాబ్లెట్లను విడుదల చేసిన ఈ కంపెనీ అత్యంత తక్కువ ధరకే ఇంటర్నెట్ అందివ్వాలని చూస్తోంది. అదే జరిగితే టెల్కోలకు భారీ షాక్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జియో మరో మైలురాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 200 వెచ్చిస్తే

సంవత్సరానికి రూ. 200 వెచ్చిస్తే వినియోగదారులకు ఇంటర్నెట్ అవసరాలు తీరుస్తామని డేటావింట్ చెబుతోంది.

రూ. 100 కోట్ల పెట్టుబడి

ఇందుకోసం ఇండియాలో మొదటగా రూ. 100 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. దీన్ని మరింత పెంచుతామని డేటావిండ్ పేర్కొంది

vno లైసెన్స్ కోసం

దేశవ్యాప్తంగా Virtual Network Operator (vno) లైసెన్స్ కోసం అప్లయి చేసింది. ఇతర టెలికం ఆపరేటర్ల సహాయంతో మొబైల్ డేటా సేవలు అందించడానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుందని అంచనా.

రానున్న నెలరోజుల్లో


రానున్న నెలరోజుల్లో తమకు లైసెన్స్ వచ్చే అవకాశం ఉందని అయితే మొదటి ఆరునెలలు డేటాసేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని, రూ. 100 కోట్ల పెట్టుబడి పెడతామని డేటావిండ్ అధ్యక్షుడు, సీఈఓ సునీత్ సింగ్ తెలిపారు.

జియో అందిస్తున్న రూ. 300 ప్లాన్

దేశంలో జియో అందిస్తున్న రూ. 300 ప్లాన్ సామాన్యులకు కొంచెం దూరమని అయితే డేటావిండ్ నుంచి రానున్న ప్లాన్ నెలకి రూ. 90తో వారి అవసరాలను తీర్చే విధంగా తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Datawind Plans to Offer Data Services at Rs 200 Per Year read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot