జియో మరో మైలురాయి
టెలికం రంగంలో ఇటీవల అడుగు పె ట్టిన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దూ సుకుపోతున్నది.
టెలికం రంగంలో ఇటీవల అడుగు పె ట్టిన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. ఈ నెలాఖరుతో ఉచిత సేవలు ముగుస్తుండటంతో కంపెనీ 5 కోట్ల మంది చెల్లింపు వినియోగదారులను సొంతం చేసుకున్నది. జియోలో ఇప్పటి వరకు చేరిన 10 కోట్ల మంది కస్టమర్లలో సగం మంది ప్రైమ్ విభాగంలో చేరినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉచిత కాల్స్, ఉచిత డాటాతో కూడిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో జియో ప్రైమ్‌కు అప్‌గ్రేడ్ అవ్వడానికి రూ.99తో రీచార్జి చేసుకోవాలని సంస్థ ఇదివరకే సూచించింది.
అదరగొడుతున్న ఆండ్రాయిడ్ O ఫీచర్లు

30 శాతం మంది
పరిశ్రమ వర్గాల ప్రకారం.. జియోకున్న 10-10.5 కోట్ల మంది కస్టమర్లలో దాదాపు 30 శాతం మంది రెండో కనెక్షన్ కింద జియోను తీసుకున్నారట.

మూడింట రెండు వంతులు
మిగిలిన 7 కోట్ల మంది కస్టమర్లలో కనీసం మూడింట రెండు వంతులు జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకునే విధంగా రిలయన్స్ ప్రచారం చేస్తోంది.

ఈ నెల 31తో గడువు పూర్తి
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఆర్‌జియో ఉచితంగా ఇస్తున్న వాయిస్, డేటా సర్వీసుల గడువు ఈ నెల 31తో పూర్తికానుంది. అదే విధంగా జియో ప్రైమ్ సభ్యులుగా మారే గడువు కూడా ఈ తేదీతోనే ముగుస్తుంది.

వన్‌టైమ్ చార్జీ కింద 99 రూపాయలు
ఈ నేపథ్యంలో ఏడాది పాటు జియోకు సంబంధించిన పలు ఉచిత సర్వీసులను పొందడానికి వన్‌టైమ్ చార్జీ కింద 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications








