బామ్మతో జుకర్‌బర్గ్ ఛాటింగ్ : రోబో తయారీలో సారు బిజీ

By Hazarath
|

అవును మీరు విన్నది నిజమే..బామ్మతో జుకర్ బర్గ్ ఛాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ఆసక్తిని రేపుతోంది. వారిద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఇప్పుడు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. బామ్మ తన మనవరాలికి నీలాంటి వాడితోనే డేటింగ్ చేయమని చెప్పానని పోస్ట్ చేస్తే.. దానికి మార్క్ జుకర్ బర్గ్ కూడా అంతే చిత్రంగా ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సంగతి పక్కన బెడితే కూర్చున్న చోటు నుంచి కదలకుండా అన్నీ పనులు చకచకా జరిగేలా ఓ రోబోను తయారు చేయనున్నారట ఫేస్ బుక్ సీఈఓ. ఆ వివరాలేంటో చూద్దాం.

Read more: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుచ్చకాయ బుడ్డోడు

ఓ టీనేజ్ అమ్మాయి గొప్ప ధనవంతురాలు కావాలంటే

ఓ టీనేజ్ అమ్మాయి గొప్ప ధనవంతురాలు కావాలంటే

షకీరాలాంటి గొంతు, షరపోవాలా ఆటతీరు, కనీసం చదువులో రాణింపు .. ఇవేవీ లేకుండా ఓ టీనేజ్ అమ్మాయి గొప్ప ధనవంతురాలు కావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న తనకుతానే వేసుకుని, తన మనుమరాలికి ఓ బామ్మ ఇచ్చిన సలహా, ఆ సలహాకు ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

'డియర్ జుకర్ బర్గ్ .. ఎవరైనా ఓ నెర్డీ

'డియర్ జుకర్ బర్గ్ .. ఎవరైనా ఓ నెర్డీ

'డియర్ జుకర్ బర్గ్ .. ఎవరైనా ఓ నెర్డీ (ఎప్పుడూ టెక్నాలజీతో కుస్తీపడే వ్యక్తి) ఫెలోతో డేటింగ్ చెయ్యమని నా మనుమరాలికి సలహా ఇచ్చా.

ఎప్పుడూ సిస్టమ్ మీద పనిచేసుకుంటూ .

ఎప్పుడూ సిస్టమ్ మీద పనిచేసుకుంటూ .

సాధారణ దుస్తులు, భూతద్దాలంటి కళ్లద్దాలు పెట్టుకుని ఎప్పుడూ సిస్టమ్ మీద పనిచేసుకుంటూ .. సాధారణ వ్యక్తిలా కనిపించే అలాంటి వాళ్లే భవిష్యత్ లో మీలా గొప్ప కార్యాలు సాధిస్తారు. కోటానుకోట్లు సంపాదిస్తారు. అందుకే నా మనుమరాల్ని నెర్డీతో డేట్ కు వెళ్లమని ప్రోత్సహిస్తున్నా 'అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది డార్లిన్ లొరెటా అనే బామ్మ.

నెర్డీ ఫెలోతో డేటింగ్ చెయ్యడం కంటే స్వయంగా

నెర్డీ ఫెలోతో డేటింగ్ చెయ్యడం కంటే స్వయంగా

అందుకు ప్రతిగా 'నెర్డీ ఫెలోతో డేటింగ్ చెయ్యడం కంటే స్వయంగా అలా తయారవ్వటమే ఉత్తమం. మీ తరఫున మీ మనుమరాలికి నేనిచ్చే సలహా ఇదే 'అని జుకర్ బర్గ్ బదులిచ్చారు.

ఏ ఆధారం లేకున్నా తమ కాళ్లపై తాము నిలబడేలా

ఏ ఆధారం లేకున్నా తమ కాళ్లపై తాము నిలబడేలా

ఏ ఆధారం లేకున్నా తమ కాళ్లపై తాము నిలబడేలా అమ్మాయిలను తయారుచేయాలని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. జుకర్ బర్గ్ ప్రతిస్పందన అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు లైక్స్ వర్షం కురిపించారు.

తన కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు

తన కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు

ఇంతకు ముందు చెప్పినట్లే తన కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఫేస్ బుక్ వ్యవస్థాపక సీఈవో జుకర్ బర్గ్. ప్రస్తుతం ఆ కంపెనీ సాధారణ ఉద్యోగుల్లో కేవలం 16 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అదే ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో 23 శాతం మహిళలున్నారు. మిగిలిన టెక్నాలజీ కంపెనీల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య అంతంతమాత్రమే!

రోబోను సేవకుడిగా

రోబోను సేవకుడిగా

ఇక ఇంటి పనులు, వ్యక్తిగత పనుల్లో సహాయం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉన్న రోబోను సేవకుడిగా పెట్టుకోవాలనుకుంటున్నాడు ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ .

హీరోకు అన్ని పనులు చేసి పెట్టే జార్విస్

హీరోకు అన్ని పనులు చేసి పెట్టే జార్విస్

హాలీవుడ్లో సంచలనం రేపిన ఐరన్‌మ్యాన్ చిత్రంలో హీరోకు అన్ని పనులు చేసి పెట్టే జార్విస్ అనే బట్లర్ లాంటి రోబోను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏఐ టెక్నాలజీతో బట్లర్ ను తయారు చేయడం 2016 లో వ్యక్తిగతంగా ఓ చాలెంజ్ లాంటిదని అని జుకర్బర్గ్ తెలిపారు.

ఈ ఏడాది జార్విస్‌ను రూపొందించడం టార్గెట్‌గా

ఈ ఏడాది జార్విస్‌ను రూపొందించడం టార్గెట్‌గా

ఈ ఏడాది జార్విస్‌ను రూపొందించడం టార్గెట్‌గా సెట్ చేసుకొన్నారు. ఇంటిపనులు, ఆఫీస్ పనుల్లో సహాయం అందించే ఏఐ బట్లర్ రోబోను తయారు చేయడం వ్యక్తిగతగా ఈ ఏడాది తన ముందు ఉన్న ఏకైక సవాల్ అని పేర్కొన్నారు.

కంఠ ధ్వనిని అర్థం చేసుకొని ఇంటిలో

కంఠ ధ్వనిని అర్థం చేసుకొని ఇంటిలో

కంఠ ధ్వనిని అర్థం చేసుకొని ఇంటిలో మ్యూజిక్, లైట్లు, ఉష్ణోగ్రతను నియంత్రించే రోబోను తయారు చేసే అంశంపై దృష్టి పెట్టామని, అందుకోసం ఇప్పటికే అందుబాటులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకొంటామని తెలిపారు.

దీనికి సరిపడా టెక్నాలజీ ఇప్పటికే ఉందనీ

దీనికి సరిపడా టెక్నాలజీ ఇప్పటికే ఉందనీ

దీనికి సరిపడా టెక్నాలజీ ఇప్పటికే ఉందనీ దీనిని అభివృద్ధి చేసి వాయిస్ కంట్రోల్తో పనిచేసేలా రూపొందించనున్నట్లు జకర్ బర్గ్ తన మనసులో మాటను వెల్లడించాడు.ఇంట్లో లైట్లు వేయడం, గది ఉష్ణోగ్రత నియంత్రించడం, సంగీతం వినిపించటం, మిత్రులు వస్తే వారి ముఖాలు గుర్తుపట్టి లోనికి ఆహ్వానించడం లాంటి పనులు ఈ జార్విస్ చేసిపెడుతుంది.

మొత్తానికి ఫేస్‌బుక్ అధినేత కూర్చున్న చోటునుంచే

మొత్తానికి ఫేస్‌బుక్ అధినేత కూర్చున్న చోటునుంచే

మొత్తానికి ఫేస్‌బుక్ అధినేత కూర్చున్న చోటునుంచే కదలకుండా అన్ని పనులు చేసేలా ఈ ఏడాది సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారన్నమాట.

Best Mobiles in India

English summary
Here Write Dating Tips For Young Girls From Mark Zuckerberg Be The Nerd

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X