Home
News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుచ్చకాయ బుడ్డోడు

By Hazarath

పుచ్చకాయను మాములుగా ఎవరైనా ఎలా తింటారు..ముక్కలుగా కోసుకుని తింటారు. కాని ఇక్కడ ఓ బుడ్డోడు కాయనే పట్టుకుని తినేశాడు. అదీ క్రికెట్ మ్యాచ్ చూస్తూ అలానే తినేవాడు. ఆ బుడ్డోడి తతంగాన్ని చూసిన అక్కడి కెమెరాలన్నీ మ్యాచ్ ని వదిలేసి ఏకంగా ఆ బుడ్డోడినే లైవ్ లో చూపించాయి. కామెంటేటర్లు అయితే ఇక మ్యాచ్ ని వదిలేసి మనోడి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు కూడా. ఒక పుచ్చకాయని తినడమంటే మాటలా...వారెవ్వా మీరే చూడండి ఎలా తింటున్నాడో.

Read more: మరణానికి ముందు ఏం జరిగింది ?

పుచ్చకాయ బాలుడు సోషల్ మీడియాను షేక్

పుచ్చకాయ బాలుడు సోషల్ మీడియాను షేక్

పుచ్చకాయ బాలుడు (వాటర్ మెలన్ బాయ్) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. 10 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు మిచెల్ స్కెహిబెసీ పుచ్చకాయను తొక్కతో సహా ఆబగా తింటూ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఫస్ట్ వైరల్ హిట్ ఆఫ్ ది 2016'గా చక్కెర్లు కొడుతోంది.

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో శనివారం మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగాడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తూ మిచెల్ లైవ్ టీవీ కెమెరాకు చిక్కాడు. పుచ్చకాయను తొక్కతో సహా తినేస్తున్న అతడిని చూసి కామెంటేటర్లు అవాక్కయ్యారు.

అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ

అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ

అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ లాగించేస్తున్నాడు' అంటూ కామెంట్లు చేయడంతో అందరూ అతడిని ఆసక్తిగా గమనించారు. కెమెరా కంటపడగానే అతడు రెట్టించిన ఉత్సాహంతో పుచ్చకాయను కొరకడం మొదలు పెట్టాడు.

ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016

ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016

ఈ వీడియో వాటర్ మెలన్ బాయ్ హేష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండవుతోంది. ట్విటర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016'గా పీపుల్స్ మేగజీన్ వర్ణించింది.

అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని

అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని

అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని బీబీసీతో మిచెల్ స్కెహిబెసీ చెప్పాడు. చాలా ప్రయత్నం చేసిన తర్వాతే ఇలా తినగలుగుతున్నానని తెలిపాడు.

మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్ ది డే

మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్ ది డే

మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్ ది డే'గా ప్రకటించింది. అయితే ఈ పురస్కారం అందుకునేందుకు అతడు నిరాకరించాడు. 'నేను నిజంగా హీరోను కాదు. నేనో సాధారణ బాలుడిని 'అంటూ మిచెల్ వినయంగా చెప్పాడు.

ఇక బాలుడి చర్యకు కామెంటేటర్లు సహా అందరూ

ఇక బాలుడి చర్యకు కామెంటేటర్లు సహా అందరూ

ఇక బాలుడి చర్యకు కామెంటేటర్లు సహా అందరూ ఆశ్చర్యపోయారు. 'క్రికెట్ కు కొత్త హీరో దొరికాడు. మొత్తం పుచ్చకాయను ఖతం చేశాడు. బాగా ఆడావు 'అంటూ ట్వీట్ల వర్షం కురిసింది.

ఈ ఏడాది తొలి ఇంటర్నెట్ హీరో అంటూ ఓ మ్యాగజీన్

ఈ ఏడాది తొలి ఇంటర్నెట్ హీరో అంటూ ఓ మ్యాగజీన్

ఈ ఏడాది తొలి ఇంటర్నెట్ హీరో అంటూ ఓ మ్యాగజీన్ రాసింది. కాగా రెండేళ్ల వయసప్పటి నుంచి పుచ్చకాయను ఇలా తింటున్నట్టు మిచెల్ తెలిపాడు. కాగా ఇది ఇప్పుడు ఫస్ట్ వైరల్ హిట్ ఆఫ్ ది 2016 గా చక్కర్లు కొడుతోంది.

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Watermelon Boy' Finds Fame As First 'Viral Hit Of 2016'
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X