10 వ జెనరేషన్ ఇంటెల్ కామెట్ లేక్ CPUలతో డెల్ XPS 13 ల్యాప్‌టాప్

|

డెల్ XPS13 సిరీస్ ఇప్పుడు ఇంటెల్ 10 వ జెనరేషన్ కామెట్ లేక్ ప్రాసెసర్‌లతో అందించడానికి రిఫ్రెష్ చేయబడింది. ఇంటెల్ తన సరి కొత్త శ్రేణి ప్రాసెసర్‌లను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది. డెల్ XPS 13 శ్రేణి యొక్క రిఫ్రెష్ వెర్షన్‌లను అందించడంలో డెల్ ఎక్కువ సమయం వృధా చేయడం లేదు. డెల్ XPS 13 మరియు XPS13 2-ఇన్ -1 రెండు 10 వ జెనరేషన్ సిపియులతో మార్కెట్ లోకి రాబోతున్నాయి.

 
10 వ జెనరేషన్ ఇంటెల్ కామెట్ లేక్ CPUలతో డెల్ XPS 13 ల్యాప్‌టాప్

వీటి యొక్క ధర 64,400 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా అక్టోబర్ నుండి ఇన్స్పైరాన్ మరియు వోస్ట్రో లైనప్‌లలో కూడా 10 వ జెనరేషన్ సిపియులతో షిప్పింగ్ ప్రారంభిస్తాయని డెల్ ధృవీకరించింది.

ధరలు:

ధరలు:

కొత్తగా రిఫ్రెష్ చేయబడిన డెల్ XPS 13 మరియు డెల్ XPS13 2-ఇన్-1 ల్యాప్‌టాప్ లు ఆగస్టు 27 నుండి ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది అని డెల్ సంస్థ ధృవీకరించింది. డెల్ XPS 13 యొక్క ధర 99,899 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అలాగే XPS13 2-ఇన్-1 ల్యాప్‌టాప్ యొక్క ధర 71,600 రూపాయల నుండి ప్రారంభమవుతుంది.

డెల్ XPS 13 స్పెసిఫికేషన్స్:

డెల్ XPS 13 స్పెసిఫికేషన్స్:

రిఫ్రెష్ చేసిన డెల్ XPS 13 యొక్క వేరియంట్ IFA కంటే కొంచెం ముందు వస్తుంది. డెల్ XPS 13 మోడల్ యొక్క బాహ్య రూపకల్పనలో ఎటువంటి మార్పు లేదు. ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు 14nm 10 వ జనరేషన్ "కామెట్ లేక్" ప్రాసెసర్ల సీపీయూ పరిధిలో అందించబడుతుంది. ఈ సిపియులను కోర్ i3, కోర్ i5 మరియు కోర్ i7 ల వివిధ వేరియంట్ లలో ఎంచుకోవటానికి అవకాసం ఉంది. ఇది 4K ఆప్షన్లతో 13.3-అంగుళాల డిస్ప్లేతో, 16GB వరకు ర్యామ్, 2TB వరకు PCI SSD స్టోరేజ్, 52Whr బ్యాటరీ, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ మరియు రెండు 2W స్టీరియో స్పీకర్లతో వస్తుంది.

డెల్ XPS 13 2-ఇన్ -1స్పెసిఫికేషన్స్:
 

డెల్ XPS 13 2-ఇన్ -1స్పెసిఫికేషన్స్:

డెల్ XPS 13 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ కూడా సరికొత్త సిపియులను అందించడానికి రిఫ్రెష్ చేయబడింది మరియు ఇది ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో సుమారు 71,600 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఇది 13.4-అంగుళాల టచ్ డిస్ప్లే, 512GBవరకు SSD, 16GB వరకు RAM మరియు ఇంటెల్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్ తో వస్తుంది.

ఇన్స్పైరాన్ మరియు వోస్ట్రో లైనప్‌లు:

ఇన్స్పైరాన్ మరియు వోస్ట్రో లైనప్‌లు:

అక్టోబర్ 1 నుండి డెల్ యొక్క ఇన్స్పైరాన్ మరియు వోస్ట్రో లైనప్‌లు త్వరలో సరికొత్త ఇంటెల్ కామెట్ లేక్ ప్రాసెసర్‌లతో షిప్పింగ్‌ను ప్రారంభిస్తాయని డెల్ ధృవీకరించింది. ఇంటెల్ మొత్తం పనితీరు మెరుగుదల 16 శాతం వరకు పెరిగింది. కొత్తగా ప్రకటించిన ప్రాసెసర్‌లతో ఉత్పాదకత మరియు మల్టీ టాస్కింగ్ పనిభారాలలో ప్రత్యేకంగా 41 శాతం వరకు మెరుగైన పనితీరును సాధిస్తోంది అని భావిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Dell XPS 13 Laptop Comes with 10th Gen Intel Comet Lake CPUs:Price Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X