ఇండియాలో కొత్తగా రిలీజ్ అయిన లెనోవా ఐదు ల్యాప్‌టాప్‌లు
ఇండియాలో లెనోవా ఈ రోజు తన ఐదు రకాల ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ ఐదు ల్యాప్‌టాప్‌లలో యోగా S940, యోగా A940, ఐడియాప్యాడ్ S540, ఐడియాప్యాడ్ S340, ఐడియాప్యాడ్ S145 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. లెనోవా యొక్క మెయిన్ ల్యాప్‌టాప్ యోగా S940 AI- ఎనేబుల్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లలో భద్రతా ప్రయోజనాల కోసం ఫేస్ రికగ్నిషన్, ఆటో-లాక్ ఆఫ్ డిస్‌ప్లే ఉన్నాయి.

ఆటో-లాక్ కింద వినియోగదారుడు తలను తిప్పిన వెంటనే డిస్‌ప్లే ఓపెన్ అయే ఫీచర్ కూడా ఉంది.లెనోవా యోగా S940 ఇప్పుడు లెనోవా ఆన్‌లైన్ స్టోర్స్ మరియు రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. దీని యొక్క ధర రూ.1,39,990 నుండి ప్రారంభమవుతుంది.

లెనోవా యోగా S940 స్పెసిఫికేషన్స్:
లెనోవా యోగా S940 ల్యాప్‌టాప్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో వస్తుంది. దీనిని మీరు స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే మాన్యువల్‌గా కాకుండా పేస్- అన్‌లాక్ ద్వారా కూడా లాక్ ఓపెన్ చేయవచ్చు. AI-ఎనేబుల్ ఫీచర్ సహాయంతో ల్యాప్‌టాప్ ద్వారా వీడియో కాల్ చేస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ ను బ్లర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ గురించి కంపెనీ గొప్పగా పలుకుతున్న మరో విషయం ఏమిటంటే దాని యొక్క డిజైన్ "కాంటూర్ గ్లాస్‌తో " చేయబడింది. ఇది ప్రపంచంలోనే కాంటూర్ గ్లాస్‌తో తయారు చేయబడిన మొట్టమొదటి ల్యాప్‌టాప్ అని పిలుస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ కాంటౌర్ గ్లాస్‌తో స్క్రీన్ నాలుగు వైపుల స్లిమ్ బెజెల్స్ నిర్మాణంతో సొగసైన మరియు మృదువైనదిగా వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ యొక్క బరువు 1.2 కిలోలు మరియు మందం 12.2mm. 14 అంగుళాలు గల ఈ ల్యాప్‌టాప్ 8 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7-8565 యు ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 15 గంటల ఎఫ్‌డిహెచ్ వరకు నడిచే భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది 16GB వరకు ర్యామ్ మరియు 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాకుండా ఇది డాల్బీ అట్మోస్ స్పీకర్ సిస్టమ్ కలిగి ఉంటుంది.
లెనోవా యోగా S940 ఇప్పుడు లెనోవా ఆన్‌లైన్ స్టోర్స్ మరియు రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. దీని యొక్క ధర రూ.1,39,990 నుండి ప్రారంభమవుతుంది.

లెనోవా యోగా A940 స్పెసిఫికేషన్స్:
లెనోవా యోగా A940 డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్. ఈ 27 అంగుళాల లెనోవా ల్యాప్‌టాప్ విండోస్ 10,డాల్బీ విజన్‌తో మరియు క్యూహెచ్‌డి ఐపిఎస్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. దీని యొక్క కీలు ల్యాప్‌టాప్‌ను 25-డిగ్రీల వరకు తిప్పడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా ఇది డిజిటల్ పెన్‌తో పనిచేయడానికి కూడా అనుమతిస్తుంది. లెనోవా యోగా A940 ప్రెసిషన్ డయల్‌తో వస్తుంది. డిజైనర్లు, ఫోటోగ్రాఫర్‌లు మరియు వీడియోగ్రాఫర్‌ల కోసం వారి కంటెంట్‌కు మరింత ఖచ్చితమైన ఎంపికలు మరియు సర్దుబాట్లు చేయడానికి లెనోవా యోగా A940 టైలర్ మేడ్ కంట్రోలర్ తో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ లెనోవా యొక్క ఆన్‌లైన్ స్టోర్స్ మరియు రిటైల్ డిజిటల్ స్టోర్లలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.దీని యొక్క ధర రూ.1,69,990 నుండి ప్రారంభమవుతుంది.

లెనోవా ఐడియాప్యాడ్ S145 స్పెసిఫికేషన్స్:
ఈ ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. దీని యొక్క ధర సుమారు 23,990 రూపాయలు. ఇది చాలా తేలికైనది మరియు అత్యంత పోర్టబుల్ అయినందున ఇది రోజువారీ ఉపయోగం కోసం ఉద్దేశించిన ల్యాప్‌టాప్.

లెనోవా ఐడియాప్యాడ్ S340 స్పెసిఫికేషన్స్:
కొత్తగా లాంచ్ చేసిన ఈ లెనోవా ల్యాప్‌టాప్ 8వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 14 అంగుళాల డిస్‌ప్లే మరియు ఒక్క ఛార్జ్ మీద 8 గంటల వరకు ఉండే బ్యాటరీతో వస్తుంది. దీని ధర 36,990 రూపాయలు.

లెనోవా ఐడియాప్యాడ్ S540 స్పెసిఫికేషన్స్:
రూ .64,990 ధరతో, ఈ ల్యాప్‌టాప్‌లో 8 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో వస్తుంది మరియు ఆప్షనల్ ఎన్విడియా జిఫోర్స్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈ 15 అంగుళాల ల్యాప్‌టాప్ పెద్ద బ్యాటరీతో ఒక్క ఛార్జ్ మీద 12 గంటల వరకు బ్యాటరీ బ్యాక్ అప్ తో వస్తుంది.


Click it and Unblock the Notifications








