పెద్ద నోట్ల రద్దు..మార్కెట్లో కుప్పకూలిన టాటా, అంబానీ..

Written By:

భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామంటూ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం బడా పారిశ్రామికవేత్తలను భారీగానే తాకింది. గత 15 రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూ సామాన్యులకు కష్టాల కొనితెచ్చిన పెద్ద నోట్ల రద్దు టాటా అంబానీలకు కూడా అదే స్థాయిలో మార్కెట్లో కష్టాలను తెచ్చిపెట్టింది. దాదాపు 9 బిలియన్ల డాలర్ల మేర సంపద ఆవిరి అయిపోయింది.

ప్రజల ముందుకు ప్రధాని మోడీ 10 ప్రశ్నలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టీసీఎస్

ఈ నోట్ల రద్దు దెబ్బకి కేవలం నవంబర్ 8 నుంచి 21వ తేదీ మధ్య కాలంలో టీసీఎస్ మార్కెట్లో కోల్పోయిన మొత్తం సంపద విలువ రూ .21,839 కోట్లు

టాటా గ్రూపు

నవంబర్ 8 నుంచి 21వ తేదీ మధ్య కాలంలో టాటా గ్రూపులో ఉన్న మొత్తం 27 మంది వాటాదారులు కోల్పోయిన సంపద విలువ రూ. 39.636 కోట్లు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిలయన్స్ గ్రూప్

అయితే అన్నీ మేజర్ కంపెనీలు భారీగా పతనమైతే ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మాత్రం స్వల్ప నష్టాలకు పరిమితమై మార్కెట్లో షాకిచ్చింది. రిలయన్స్ కోల్పోయిన మొత్తం సంపద విలువ కేవలం రూ. 1748 కోట్లు మాత్రమే.

మహీంద్రా గ్రూపు

మహీంద్రా గ్రూపు కూడా భారీ స్టాయిలో నష్టాలను చవిచూసింది. ఈ సంస్థకు చెందిన రూ. 6 వేల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఒక్కసారిగా మార్కెట్ వాల్యూ కుప్పకూలిపోయింది.

నోట్ల రద్దుతో మార్కెట్ వాల్యూ

వీటితో పాటు టైటాన్, బిర్లా గ్రూపు, ఆర్ఐఎల్ హిందాల్కో లాంటి దిగ్గజాలు మార్కెట్లో కోట్ల నష్టాలతో సరిపెట్టుకున్నాయి.నోట్ల రద్దుతో మార్కెట్ వాల్యూ కుప్పకూలిపోయి కోట్ల నష్టాలను చవిచూశాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Demonetisation shaves off $9 billion wealth of Tatas, Birlas & Mahindras; Ambanis relatively safer
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting