ఆగిపోయిన జీమెయిల్ సేవలు,ట్విట్టర్లో హోరెత్తిన పోస్టులు

|

ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ జీమెయిల్ అకౌంట్ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి జీమెయిల్ సడన్ గా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది. అందరికీ ఎక్కడలేని కోపం వస్తుంది కదా.. సరిగ్గా నిన్న అలానే జరిగింది. జీమెయిల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. తమ మెయిల్‌లు పనిచేయడం లేదంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు.

Discontinued Googles Gmail Services, Lot of Posts on Twitter

మెయిల్ పంపుకోవడం, వచ్చినవి చూడటం సహా ఇతర చర్యల్లో ఈ ఇబ్బంది తలెత్తిందని వారు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సమస్య పర్సనల్ ఖాతాల కంటే బిజినెస్ ఖాతాల్లోనే ఎక్కువగా ఉందని సమాచారం. అయితే గూగల్ క్లౌడ్‌ ఇబ్బందితోనే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది.

బిజినెస్ ఎంటర్ ప్రైజ్ జీమెయిల్:

బిజినెస్ ఎంటర్ ప్రైజ్ జీమెయిల్:

గూగుల్ అందించే సర్వీసుల్లో బిజినెస్ ఎంటర్ ప్రైజ్ జీమెయిల్ సర్వీసు నిలిచిపోయింది. ఇండియాలో జీమెయిల్ ఎంటర్ ప్రైజ్ సర్వీసుకు అంతరాయం కలిగిందని, జీమెయిల్ ద్వారా పంపే ఈమెయిల్స్ వెళ్లడం లేదని కొందరు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. అంతే కాకుండా పంపిన మెయిల్స్ రావడం లేదని మరికొంత మంది యూజర్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.

ఇతర సర్వీసుల్లో సమస్య తలెత్తిందా:

ఇతర సర్వీసుల్లో సమస్య తలెత్తిందా:

ప్రైవేట్, యాడ్ ఫ్రీ ఈమెయిల్ సర్వీసులో కూడా ఇదే సమస్య తలెత్తినట్టు ఓ నివేదిక తెలిపింది. అయితే బిజినెస్ జీమెయిల్ సర్వీసుతో పాటు ఇంటర్నెట్ దిగ్గజం అందించే ఇతర సర్వీసులైన గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ సర్వీసుల్లో సమస్య తలెత్తిందా? లేదా అనేదా క్లారిటీ లేదు. రిపోర్టుల ఆధారంగా జీమెయిల్ సర్వీసులో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే అందిస్తామని పేర్కొంది.

యూజర్లకు ఎర్రర్ మెసేజ్‌లు:

యూజర్లకు ఎర్రర్ మెసేజ్‌లు:

జీమెయిల్ యాక్సస్ అవుతున్నప్పటికీ.. కొంతమంది యూజర్లకు ఎర్రర్ మెసేజ్‌లు, హై లేటెన్సీ, రీలోడింగ్ వంటి సమస్యలు ఎదురైనట్టు గుర్తించామని కంపెనీ అందరికి ఈమెయిల్ పంపింది. గూగుల్ GSuiteలో ఒక భాగమైన ఎంటర్ ప్రైజ్ జీమెయిల్ ఎడిషన్ కాసేపటికి కొంతమంది యూజర్లకు రీస్టోర్ అయినట్టు గుర్తించింది.

గత నెలలో కూడా అంతరాయం:

గత నెలలో కూడా అంతరాయం:

గత జూన్ నెలలో అమెరికాలో గూగుల్ సర్వీసులైన యూట్యూబ్, స్నాప్ చాట్, జీమెయిల్, నెస్ట్, డిస్ కార్డ్ తోపాటు ఇతర సర్వీసులు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఆ మధ్యన ఫేస్‌బుక్ సహా పలు యాప్‌ల సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఏంటో గూగుల్ సొంత సర్వీసుల్లో క్లౌడ్ సర్వీసుతో పాటు పవర్ యాప్స్ లో తలెత్తిన సమస్య కారణంగా అంతరాయం కలిగినట్టు భావిస్తోంది.

 

Best Mobiles in India

English summary
Discontinued Google's Gmail Services, Lot of Posts on Twitter

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X