కొత్త ఫీచర్‌లతో మరియు అప్డేట్లతో గూగుల్ మ్యాప్స్

|

గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ రిజర్వేషన్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ప్రయాణించేటప్పుడు వారి రాబోయే విమాన మరియు హోటల్ రిజర్వేషన్లను చూడటానికి అనుమతిస్తుంది. కొత్త రిజర్వేషన్ల ట్యాబ్‌ను 'యువర్ ప్లేస్' విభాగంలో చూడవచ్చు. ఇది నావిగేషన్ అనుభవాన్ని పెంచడానికి AR ని ఉపయోగించే లైవ్ వ్యూ ఫీచర్ లభ్యతను కూడా విస్తరిస్తోంది.

కొత్త ఫీచర్‌లతో మరియు అప్డేట్లతో గూగుల్ మ్యాప్స్

 

క్రొత్త అప్‌డేట్ తో టైమ్‌లైన్ ఫీచర్ కూడా అదనంగా ఉంది. ఇది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి ప్రయాణాన్ని చక్కగా ప్లాన్ చేయడంలో సహాయపడటానికి మరియు స్థలాల జాబితాను రూపొందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

రిజర్వేషన్ ఫీచర్:

రిజర్వేషన్ ఫీచర్:

క్రొత్త రిజర్వేషన్ ఫీచర్ ను ఉపయోగించి మీ విమాన మరియు హోటల్ రిజర్వేషన్లను ఒకే చోట చూడటానికి గూగుల్ మ్యాప్స్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ క్రొత్త రిజర్వేషన్ ట్యాబ్‌ను కనుగొనడానికి మీ స్క్రీన్ యొక్క ఎగువవైపున ఎడమ మూలలో బూడిద రంగులో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి> మీ స్థలాలను ఎంచుకోండి> రిజర్వేషన్ ట్యాబ్‌పై నొక్కండి. ఇలా చేసిన తరువాత మీరు రాబోయే అన్ని ప్రయాణాలను చూడగలరు. కనిపిస్తున్న ఏదైనా ఒక ట్రిప్‌ను ఎంచుకోవడం వల్ల ఆ ట్రిప్ కోసం అవసరమైన ఫ్లైట్ టైమింగ్స్ మరియు హోటల్ బుకింగ్స్ వంటివి మీ రిజర్వేషన్ ట్యాబ్ లో చూపించబడతాయి. ఈ ఫీచర్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. ఈ ఫీచర్ రాబోయే వారాల్లో Android మరియు iOS లకు వస్తోందని గూగుల్ తెలిపింది.

లైవ్ వ్యూ ఫీచర్‌:
 

లైవ్ వ్యూ ఫీచర్‌:

I/O 2019 ప్రకటించిన తరువాత గూగుల్ లైవ్ వ్యూ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా మే నెలలో పిక్సెల్ ఫోన్‌లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ వారం నుండి ARCore మరియు ARKit లకు మద్దతు ఇచ్చే Android మరియు iOS పరికరాలకు బీటాను విస్తరిస్తోంది. నావిగేషన్ సమయంలో మీ ఫోన్ కెమెరాను ఉపయోగించడానికి ఈ ఫీచర్‌ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ గమ్యస్థానానికి మార్గనిర్దేశం చేయడంలో మీకు సహాయపడటానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని రియాలిటీ (AR) లను గుర్తిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో ప్రయాణానికి అనుగుణంగా మీరు ‘నడక' మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ గత కొన్ని నెలలుగా లోకల్ గైడ్స్ మరియు పిక్సెల్ కమ్యూనిటీతో ఉంది.

అప్డేట్ టైమ్‌లైన్ ఫీచర్‌:

అప్డేట్ టైమ్‌లైన్ ఫీచర్‌:

ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా అప్డేట్ చేయబడిన టైమ్‌లైన్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది మీరు గతంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను చూడటానికి మాత్రమే కాకుండా రెస్టారెంట్లు, షాపులు, ఆకర్షణ ప్రాంతాలు, హోటళ్ళు మరియు విమానాశ్రయాలు వంటి విభాగాలుగా విభజిస్తుంది. అప్పుడు మీరు ఇష్టపడే ప్రదేశాలను కస్టమైజ్ జాబితాలోకి ఎగుమతి చేయవచ్చు మరియు మీకు నచ్చిన దాని గురించి అక్కడ ప్రస్తావించవచ్చు మరియు ఆ జాబితాను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. అప్డేట్ చేయబడిన టైమ్‌లైన్ ఫీచర్ రాబోయే వారాల్లో అన్ని రకాల ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. IOS పరికరాల్లో ఈ అప్డేట్ ఫీచర్ ఎప్పుడు ప్రవేశపెట్టబడుతుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
googles reservation tab ar navigation feature for maps is rolling out to android and ios devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X