Home
News

జమ్మూ కాశ్మీర్‌లో నిరంతరాయంగా Dish TV సేవలు

ఇండియాలో అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన డిష్ టీవీ జమ్మూ కాశ్మీర్ (J&K) ప్రాంతంలోని తన చందాదారులందరికీ "ఆటో పే లేటర్" సర్వీస్ ను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల కారణంగా అమరనాథ్ యాత్రను కూడా నిలిపివేశారు. చరిత్రలో జరగడం ఇదే మొదటిసారి. జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడినందున వినియోగదారులకు నిరంతరాయంగా టీవీ సేవలను అందించడానికి ఈ చర్యను ప్రకటించారు.

dish tv promises uninterrupted services in jammu and kashmir via auto pay later

జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోవడం అంటే చందాదారులు బిల్లు చెల్లింపులు చేయలేరు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిరోధించారు. దీని అర్థం చందాదారులు తమ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ కోసం బిల్లు చెల్లింపులు చేయడం కష్టం. కానీ దానికి ప్రత్యాన్మాయంగా డిష్ టీవీ తమ వినియోగదారుల కోసం ప్రత్యక పే లేటర్ సర్వీస్ ను ప్రకటించింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద చదవండి.

ఆటో పే లేటర్ సర్వీస్:

ఆటో పే లేటర్ సర్వీస్:

డిష్ టీవీ సాధారణంగా తమ వినియోగదారులందరికీ "పే లేటర్" అనే సర్వీస్ ను అందిస్తుంది. ఈ సర్వీస్ లో భాగంగా చందాదారులు తమ డిటిహెచ్ కనెక్షన్ కోసం రీఛార్జ్ / చెల్లింపు చేయడానికి ఆప్షనల్గా మూడు రోజులు ఉంటాయి . J & K కోసం ఇప్పుడు "ఆటో పే లేటర్" సర్వీస్ ను ప్రవేశపెట్టారు. ఆటో పే లేటర్ సర్వీస్ అంటే వారు మిస్ కాల్ కూడా ఇవ్వనవసరం లేదు. అంతేకాకుండా చెల్లుబాటు వ్యవధిలో చెల్లింపు చేయడంలో విఫలమైన వారికి ఇది స్వయంచాలకంగా యాక్టీవ్ అవుతుంది. రీఛార్జ్ తేదీకి మించి నాలుగు రోజుల పాటు డిష్ టీవీ నిరంతరాయంగా డి 2 హెచ్ సర్వీస్ ను అందిస్తుంది.

జమ్మూ కాశ్మీర్‌లో పరిమితులు:

జమ్మూ కాశ్మీర్‌లో పరిమితులు:

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో తాత్కాలిక మరియు అవసరమైన పరిమితులు ఉండవచ్చు. కానీ డిష్ టివి ఇండియా లిమిటెడ్ J & K లోని డి 2 హెచ్ చందాదారులకు నిరంతరాయంగా సేవలను అందించాలని నిర్దారించింది. ఎవరైనా చందాదారుడు తమ అకౌంట్ ను రీఛార్జ్ చేసుకోవడం కష్టమనిపిస్తే ప్రస్తుతం వున్న పరిస్థితులలో డిష్ టివి మరియు డి 2 హెచ్ కనెక్షన్లు స్విచ్ ఆఫ్ కావు. ఆటో పే లేటర్ సౌకర్యం యొక్క ప్రత్యేక ప్రయోజనాన్ని జమ్మూ కాశ్మీర్లోని చందాదారులకు పరిచయం చేసాము. ఇది ప్రస్తుత పరిస్థితులలో వినోదం మరియు ప్రస్తుత వ్యవహారాలలో కొనసాగింపును అందిస్తుంది అని టెలికాం టాక్ నివేదికల డిష్ టివి సిఎండి జవహర్ గోయెల్ చెప్పారు.

డిటిహెచ్ ఆపరేటర్ ప్లాట్‌ఫామ్‌:

డిటిహెచ్ ఆపరేటర్ ప్లాట్‌ఫామ్‌:

డిటిహెచ్ ఆపరేటర్ ఇటీవల తన OTT ప్లాట్‌ఫామ్ వాచో కోసం వీడియో టెక్నాలజీ ప్రొవైడర్ Kaltura తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. క్లౌడ్ టీవీ, ఎడ్యుకేషన్ వీడియో ప్లాట్‌ఫామ్ మరియు ఎంటర్‌ప్రైజ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకత కలిగిన Kalturaకు ఊతమిస్తుంది. ఇందులో మల్టీ-స్క్రీన్ యాక్సెస్, వీడియో ఆన్ డిమాండ్, మరియు టైమ్-షిఫ్ట్ టీవీతో పాటు మూడవ పార్టీ కంటెంట్ కూడా ఉంటుంది. OTT ప్లాట్‌ఫామ్‌లపై పెరుగుతున్న ప్రేక్షకుల ఆసక్తిని తీర్చడానికి ఇది కంపెనీకి సహాయపడుతుందని డిష్ టీవీ వెల్లడించింది.

టీవీ కంటెంట్:

టీవీ కంటెంట్:

వాచో వీడియో ఆన్ డిమాండ్‌తో పాటు లైవ్ మరియు టైమ్ షిఫ్ట్డ్ టీవీని కలిగి ఉంది. వీటితో పాటు ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు సృష్టించిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయగల ప్లాట్‌ఫాం కూడా కలిగి ఉంది. ఈ విభాగం 23 మిలియన్లకు పైగా డిష్ టివి మరియు డి 2 హెచ్ చందాదారులను నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. జనాదరణ పొందిన టీవీ కార్యక్రమాలు, చలనచిత్రాలు మరియు అసలైన కంటెంట్‌ను కలిగి ఉన్న పెద్ద "VOD కంటెంట్ లైబ్రరీ" ఉందని వాచో పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
dish tv promises uninterrupted services in jammu and kashmir via auto pay later
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X