DishSMRT HUB స్మార్ట్ బాక్స్ పొందడానికి సరైన సమయం!! మిస్ అవ్వకండి....

|

ఇండియాలో ప్రస్తుతం స్మార్ట్ టీవీల యొక్క వినియోగం అధికంగా ఉంది. ప్రజలు ఇప్పుడు అధిక వినోదం కోసం అధికంగా ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌లపై ఆధారపడుతున్నారు. ప్రముఖ డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్లు ఈ డిమాండ్‌ను ముందుగానే అర్థం చేసుకొని తమ వినియోగదారులకు OTT కంటెంట్‌కు యాక్సిస్ ను అందించడానికి అనేక స్మార్ట్ టివి బాక్స్‌లను ప్రారంభించారు. ఈ స్మార్ట్ బాక్స్‌లు సాధారణ టీవీలను కూడా స్మార్ట్ టీవీలుగా మార్చగలవు. అయితే దీనికి క్రియాశీల ఇంటర్నెట్ / వై-ఫై కనెక్షన్ అవసరం ఉంటుంది అని గమనించుకోవాలి. దేశంలో అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన డిష్ టివి తన వినియోగదారులకు 'DishSMRT HUB' అనే స్మార్ట్ బాక్స్ ను ఇప్పుడు అందుబాటు ధరలో మునుపెన్నడూ లేని విధంగా అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మునుపెన్నడూ లేని వినోద ప్రయోజనాలతో DishSMRT HUB

మునుపెన్నడూ లేని వినోద ప్రయోజనాలతో DishSMRT HUB

DishSMRT HUB స్మార్ట్ బాక్స్‌ గురించి తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే వినియోగదారుల యొక్క అవసరాలను బట్టి వెబ్ నుండి సాధారణ శాటిలైట్ టీవీ కంటెంట్ మరియు సాధారణ కంటెంట్ ను రెండింటినీ చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతుంది. అంటే యూజర్లు తమ అభిమాన యాప్ లన్నింటినీ గూగుల్ ప్లే స్టోర్ నుండి సులభంగా యాక్సెస్ చేయగలరు.

DishSMRT

DishSMRT HUB స్మార్ట్ బాక్స్ అనేది ఆండ్రాయిడ్ మద్దతుతో వస్తుంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ డివైస్ల నుండి టీవీకి తమకు నచ్చిన కంటెంట్‌ను ప్రతిబింబించేలా ఈ స్మార్ట్ బాక్స్ చేస్తుంది. అలాగే ఇది వినియోగదారుల ఇంటిలో గల తమ అన్ని స్మార్ట్ హోమ్ డివైస్ లను ఒకే స్థలం నుండి నియంత్రించడానికి అనుమతిస్తుంది. మిరాకాస్ట్‌తో పాటు టీవీలో కంటెంట్‌ను ప్రతిబింబించేలా స్మార్ట్ బాక్స్ కూడా Chromecast తో వస్తుంది. ఈ స్మార్ట్ బాక్స్‌లో అనేక యూజర్ ప్రొఫైల్‌లను సృష్టించవచ్చు. అలాగే వినియోగదారులు 'రిమోట్ యాప్' సహాయంతో తమ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ యొక్క రిమోట్‌గా మార్చవచ్చు. వాయిస్ సెర్చ్ ను మరింత సులభతరం చేయడానికి గూగుల్ అసిస్టెంట్‌ మద్దతుతో ఈ స్మార్ట్ బాక్స్ వస్తుంది. అలాగే వినియోగదారులు వారి హోమ్ స్క్రీన్‌ను కూడా అనుకూలీకరించవచ్చు.

డిష్ టివి

డిష్ టివి యొక్క వినియోగదారులు సంస్థ యొక్క వెబ్‌సైట్‌ ద్వారా DishSMRT HUB స్మార్ట్ బాక్స్ ను పొందవచ్చు. అలాగే సాధారణ సెట్-టాప్ బాక్స్ (STB) ను కలిగిన యూజర్లు స్మార్ట్ బాక్స్ కు అప్‌గ్రేడ్ పొందే అవకాశం కూడా ఉంది. అప్‌గ్రేడ్ పొందాలని చూస్తున్న ప్రస్తుత వినియోగదారులకు ఇది రూ.2,499 ధర వద్ద మరియు కొత్త వినియోగదారులకు రూ.3,999 ధర వద్ద లభిస్తుంది. అయితే ఈ ధర వద్ద ఎటువంటి OTT సబ్స్క్రిప్షన్ లేదా ఛానెల్ ప్యాక్‌లు ఉండవని గమనించాలి. ఉచితంగా OTT సబ్స్క్రిప్షన్ లను పొందడానికి వినియోగదారులు మరికొంత అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
DishSMRT HUB Smart Box Now Comes Discount Offers For Only Rs 2,499

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X