దీపావళి ధమాకా: 10 వేల ఉద్యోగాలకు స్నాప్‌డీల్ నోటిఫికేషన్
దీపావళికి స్నాప్‌డీల్ ఉద్యోగ అవకాశాల బొనాంజాను ప్రకటించనుంది. దాదాపు 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించనుంది. దీపావళి సీజన్ లో అమ్మకాలే లక్ష్యంగా కష్టమర్ల డెలివరి కోసం అదనపు ఉద్యోగులను నియమించుకోనుంది. 10 వేల మందికి ఈ దీపావళి సీజన్ లో ఉద్యోగఅవకాశాలు కల్పిస్తామని స్నాప్‌డీల్ తెలిపింది.
ఇండియాకి ఆపిల్ షాక్:ఆ మోడల్ ఐఫోన్ల అమ్మకాలు బంద్

#1
పండుగ సీజన్‌ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని దేశీయ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో తాత్కాలికంగా అదనపు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది.

#2
సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మధ్య కాలంలో దాదాపు 10,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించనున్నట్టు స్నాప్‌డీల్ పేర్కొంది. ఆర్డర్లు రిసీవ్ చేసుకుని, స్క్రీన్ చేసి, వాటిని డెలివరీ చేసేందుకు ఈ తాత్కాలిక ఉద్యోగులు పనిచేయనున్నారు.

#3
ముఖ్యంగా డెలివరీలో ఎలాంటి సమస్యలు రాకుండా, వెనువెంటనే జరిపేటట్టు లాజిస్టిక్ పొజిషన్లలో వీరిని నియమించుకోనుంది. కష్టమర్లను సంతోషపరచడమే ధ్యేయంగా వీరంతా పనిచేయనున్నారు.

#4
దీపావళి కానుకగా ఈ తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించనున్నట్టు స్నాప్‌డీల్ పేర్కొంటోంది. అలాగే దీపావళి పండుగ సీజన్ అంతా, అన్ని లాజిస్టిక్ సెంటర్లు 24X7 పనిచేయనున్నట్టు తెలిపింది.

#5
ఎస్‌డీ ప్లస్ సెంటర్లు ఆర్డర్లను ప్రాసెస్‌ను నిరంతరాయం కొనసాగిస్తాయని, అర్థరాత్రి స్వీకరించిన ఆర్డర్లను, తర్వాతి రోజు ఉదయం పూట అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

#6
దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ దీపావళి సీజన్‌లో కస్టమర్లు ఆర్డరు చేసిన వస్తువులను ఒకటి రెండు రోజుల్లోనే డెలివరీ చేసే విధంగా అప్‌గ్రేట్ కావాలని నిర్ణయించుకున్నట్టు స్నాప్‌డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు.

#7
ఇంకెందుకాలస్యం.. ఉద్యోగం కావాలనుకున్న వారు వెంటనే స్నాప్ డీల్ ఆఫీసులో రెజ్యూమ్ ఇచ్చేయండి. మీకే కాల్ రావచ్చు.. లేకుంటే ఆన్‌లైన్ లో అప్లయి చేయండి..


Click it and Unblock the Notifications








