Laptop, స్మార్ట్‌ఫోన్‌ల వాడకం 2020 కరోనా సమయంలో ఎంత పెరిగిందో తెలుసా?
2020 సంవత్సరం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరపురాని సంవత్సరంగా ముద్ర పడింది. ఎంతలా అంటే కొంత మంది జీవితాలను కూడా ఛిద్రం చేసే అంతలా. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ప్రస్తుతం సర్వసాధారణం అయింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే బయటకు రాని విధంగా తయారైంది. ఇండియాలో కూడా కరోనా మహమ్మారి ప్రవేశించడంతో మార్చి నెల నుండి దాదాపుగా నాలుగు నెలల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ ను విధించారు. తరువాత విడతల వారిగా కొన్ని నిబంధనలతో లాక్ డౌన్ ను ఎత్తివేశారు. ఈ సమయంలో కొన్ని రంగాలు పూర్తిగా పడిపోతే కొన్ని రంగాలు మాత్రం విపరీతంగా లాభాలను ఆర్జించాయి. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను మరియు ల్యాప్‌టాప్ ల వినియోగం ముందుతో పోలిస్తే అధికంగా వినియోగించడం జరిగింది. వీటి యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కరోనా సమయంలో ల్యాప్‌టాప్ ల వినియోగం
కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు తమ యొక్క ఉద్యోగస్థులను ఇంటి వద్ద నుండి పనిచేయడానికి ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగస్థుల విషయం పక్కన పెడితే ప్రైవేట్ ఉద్యోగస్థులు మాత్రం ఇంటి వద్ద నుండి పనిచేయడానికి వారి యొక్క సంస్థలు ల్యాప్‌టాప్లు లేదా డెస్క్ టాప్ లను వారికి అందించింది. సాధారణ ఆఫీస్ సమయాలలో 7 లేదా 9 గంటల సమయం పనిచేసే వారు ప్రస్తుతం 10 గంటల వరకు పనిచేస్తున్నారు. అంతేకాకుండా తమకు నచ్చిన సినిమాలు మరియు టీవీ షోలను ఆన్ లైన్ ద్వారా చూడడానికి మరొక 3 నుంచి 4 గంటల సమయం గడుపుతున్నారు. అంటే ఒక రోజులో నిద్ర సమయం తప్ప మిగిలిన సమయం ఇందులో గడుతున్నారు. ఇంటిలో ల్యాప్‌టాప్లను వినియోగించే వారు ఎక్కువ మంది ఉంటే కనుక కేవలం 5 నుంచి 6 గంటల సమయం మాత్రమే ల్యాప్‌టాప్ లేదా డెస్క్ టాప్ ఆఫ్ చేయబడి ఉంటుంది. ముందు సంవత్సరంతో పోలిస్తే 2020 లో కొత్త ల్యాప్‌టాప్ ల కొనుగోలు శాతం కూడా పెరిగింది. ఇప్పుడు రూ.15,990 కే స్టూడెంట్ ల్యాప్‌టాప్ లు అందుబాటులోకి కూడా వచ్చాయి.

కరోనా సమయంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం
2020 లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. సాధరణ రోజులలో ఉద్యోగస్థులు తమ యొక్క ఆఫీస్ సమయాలలో తమ తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు. కొన్ని ఆఫీసులు ఫోన్‌లను అనుమతించినప్పటికీ పనిచేస్తున్న సమయాలలో మరొకరితో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. అయితే ప్రస్తుతం ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌లే ఆధారంగా మారాయి. ఎంతలా అంటే ఆఫీస్ వారు ఆన్ లైన్ గ్రూప్ మీటింగ్ వంటివి మొదలుపెట్టినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లనే ఉపయోగిస్తున్నారు. అలాగే ల్యాప్‌టాప్ లలో ఆఫీస్ పనిచేయడానికి wi-fi కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. బ్రాడ్ బ్యాండ్ ఎక్కువ ధర కనుక మొబైల్ నెట్ వర్క్ ల మీద ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఇంతకు ముందు ఒక రోజులో స్మార్ట్‌ఫోన్‌ను 4 లేదా 5 గంటలు ఉపయోగిస్తూ ఉంటే ప్రస్తుతం దాదాపుగా 10 నుంచి 13 గంటల వరకు వినియోగిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో పెరుగుదల
2020 లో స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఉద్యోగస్థులు ఇంటి వద్ద పనిచేయడంతో పాటుగా వారి యొక్క పిల్లల స్కూలు మరియు కాలేజ్ లు కూడా మూతపడడంతో వారికి ఆన్ లైన్ ద్వారా క్లాసులను బోధిస్తున్నారు. పిల్లల కోసం తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను వారి యొక్క తల్లిదండ్రులు కొనిస్తున్నారు. ఇంతకు ముందు 5 మంది ఉన్న ఇంటిలో స్మార్ట్‌ఫోన్‌లు ఒకరు లేదా ఇద్దరికీ ఉంటే ఇప్పుడు వారి 4 నుంచి 5 కు పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు అనేవి ఇప్పుడు రూ.4000 నుంచి కూడా ప్రారంభం అవుతున్నందున ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు.

కరోనా సమయంలో పెరిగిన టెలికాం సంస్థల ఆదాయం పెరుగుదల
ఇంటి వద్ద నుండి పనిచేసే వారికి ముఖ్యంగా కావలసినది ఇంటర్నెట్. ఇందుకోసం చాలా మంది మొబైల్ నెట్ వర్క్ ను వినియోగిస్తున్నారు. 4G నెట్ వర్క్ దేశం మొత్తం అందుబాటులో ఉండడంతో డేటా కూడా అధిక వేగంతో ఎటువంటి ఆటంకం లేకుండా వస్తున్నది. కావున బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో మొబైల్ డేటా అధికంగా ఉపయోగకరంగా ఉంది. ఇండియాలోని టెలికాం సంస్థలు ప్రతి నెల తమ యొక్క వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూనే పోతున్నారు. వినియోగరులు వారి యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో గల రెండు సిమ్ స్లాట్ లలో ఖాళీని ఉంచకుండా రెండు వేరు వేరు సిమ్ కార్డులను వినియోగిస్తున్నారు. ఇంతకు ముందు ఒక రోజులో 1GB డేటాను వినియోగించే వారు ప్రస్తుతం ఆఫీస్ అవసరాల కోసం రోజుకు 3 or 4GB డేటాను వినియోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications








