మీ సెల్‌ఫోన్ మిమ్మల్ని చంపేస్తోందని మీకు తెలుసా..

By Hazarath
|

ఒక చిన్న పరీక్ష, సడెన్‌గా భూకంపం వస్తే మీకు అందుబాటులో ఉన్న వస్తువుల్లో దేన్ని చేతిలో ఉంచుకొని బయటకు పరిగెడతారు. అంటే నూటికి తొంభై మంది ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌ అనే చెబుతారు. నిజమే ఈ రోజుల్లో సెల్‌ఫోనే సర్వస్వం అయిపోయింది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ల ప్రవేశంతో అది మరీ ముఖ్యంగా మారిపోయింది. సెల్‌ఫోన్‌ మన శరీరంలో ఒక భాగమైపోతోందని పలువురి అభిప్రాయం. అయితే నిజానికి సెల్‌ఫోన్‌ మీకు ఎంత వరకూ మేలు చేస్తుంది. అంటే ఇదేం ప్రశ్న అని అంటారు. కానీ నిజమే మీ సెల్‌ఫోన్‌ నిజంగా మీకు ఎంత వరకూ మేలు చేస్తుంది అని ప్రశ్నించుకుంటే, ఆశ్చర్యకరమైన కఠోర నిజాలు బయటపడతాయి. అవేంటో ఇప్పుడు కొన్ని చూద్దాం.

Read more : నీ సెల్ఫీ అదిరిందయ్యా గణేశా..

సెల్‌ఫోన్‌ మీ చేతులను తీవ్రంగా గాయపరుస్తుంది

సెల్‌ఫోన్‌ మీ చేతులను తీవ్రంగా గాయపరుస్తుంది

సెల్‌ఫోన్‌తో మెసేజ్‌ టెక్స్‌టింగ్‌ అనేది ఒక కళ. చకచక మునివేళ్లను టచ్‌పాడ్‌పై కదలాడిస్తూ టెక్స్ట్‌ చేయడం యూత్‌ అలవాటుగా మారుతోంది. కానీ ఇలా ముని వేళ్లను నిరంతరంగా విరామం లేకుండా టెక్ట్స్‌ టైప్‌ చేస్తూ పోతే మోచేతి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం గేమ్స్‌ ఆడే వారిలో మోచేతి నరాలు వాచిపోయే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్‌ కాస్త జాగ్రత్త మరి.

వెన్నునొప్పికి కూడా ఇదే పెద్ద కారణమట !

వెన్నునొప్పికి కూడా ఇదే పెద్ద కారణమట !

సెల్‌ఫోన్‌ లో గంటల తరబడి టెక్స్ట్‌ మెసేజెస్‌ పంపడానికి కేటాయిస్తాం. అలాగే గేమింగ్‌ కోసం కూడా మనం కీ పాడ్‌ను తరచూ వాడుతుంటాం అయితే టెక్ట్స్‌ మెసేజెస్‌ పంపే సమయంలో మనం తలను కదిలిస్తుంటాం. అయితే ఇలా తరచూ చేయడం వల్ల మెడ నరాలు మీ వెన్నుపై ఒత్తిడి కలుగజేస్తాయని వైద్యులు అంటున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉంటుంది అంటే సుమారు 60 పౌండ్ల బరువును మీ మెడపై వేసినంత ఉంటుందని పరిశోధనల్లో తేలింది. యూకే లో జరిపిన ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు సుమారు 84 శాతం మందికి నడుము నొప్పికి కారణం చెబుతూ ఫోన్‌లను సరైన పొజిషన్‌లో పట్టుకోకుండా మెసేజింగ్‌ చేయడం వల్లే కలిగిందని అంటున్నారు.

కంటి మంటే కాదు తలపోటు కూడా వస్తుంది

కంటి మంటే కాదు తలపోటు కూడా వస్తుంది

ఫోన్‌లలో ఉండే చిన్న ఫాంట్‌ అక్షరాలను అలాగే తదేకంగా చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. అలాగే తరచూ సెల్‌ఫోన్‌ వాడటం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. చూపు మందగించడంతో పాటు ముఖకండరాలు పట్టేయడంతో తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

నిద్రలేమి

నిద్రలేమి

మీ సెల్‌ఫోన్‌ మీకు నిద్రలేని రాత్రులు మిగిల్చడం ఖాయమనే అంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రి పూట సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే కాంతిని ఎక్కువగా చూడటం వల్ల నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. మెలటోనిన్‌ మీ నిద్రకు ఉపకరిస్తుంది. మెలటోనిన్‌ లోపం వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌, ప్రోస్టెట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒత్తిడి స్థాయి పెరగడం..

ఒత్తిడి స్థాయి పెరగడం..

మీ స్మార్ట్‌ ఫోన్‌ స్మార్ట్‌గా మీ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. నిరంతరం ఫోన్‌తోనే మమేకం అయి ఉండటం వల్ల మీలో ఆత్రుత, కోపం, నిస్పృహ పెరిగిపోతుంది. ఫలితంగా మీలో ఒత్తిడి పెరిగిపోతుంది.

రోడ్డు ఆక్సిడెంట్లకు ప్రధాన కారణం

రోడ్డు ఆక్సిడెంట్లకు ప్రధాన కారణం

సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వారు 23 శాతం చొప్పున తగ్గిపోతున్నారని పరిశోధనలు తేల్చాయి.

మీ సెల్‌ఫోన్‌ టాయ్‌లెట్‌ సీట్‌ కన్నా పది రెట్లు అపరిశుభ్రమైనది

మీ సెల్‌ఫోన్‌ టాయ్‌లెట్‌ సీట్‌ కన్నా పది రెట్లు అపరిశుభ్రమైనది

ఈ విషయం వింటేనే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది కదా. కానీ ఇది నిజం. ముఖ్యంగా చేతులకి ఉండే మురికి అంతా సెల్‌ఫోన్‌కే అంటుకుంటుంది. అంతేకాదు ముఖ్యంగా జలుబు, జ్వరం వచ్చినప్పుడు సెల్‌ఫోన్‌ వాడినప్పుడు రోగ క్రిములు సెల్‌ ఫోన్‌పై నిక్షిప్తమై, మనకు మళ్లీ రోగాన్ని తిరగతోడుతాయి.

 గర్భస్త శిశువుకు సెల్‌ ఫోన్‌ అత్యంత ప్రమాదకరం

గర్భస్త శిశువుకు సెల్‌ ఫోన్‌ అత్యంత ప్రమాదకరం

ఈ విషయం నిజమే. నిరూపించబడింది. ముఖ్యంగా గర్భస్రావం జరిగేంత దుష్పరిణామాలు సెల్‌ ఫోన్‌ వల్ల సంభవిస్తాయని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు.

నాడీ మండలం పై ప్రభావం

నాడీ మండలం పై ప్రభావం

సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్‌ ఏకంగా మీ డీఎన్‌ఏ కణాలనే ధ్వంసం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఫలితంగా నాడిమండల వ్యాధులు వస్తాయంటున్నారు.

గుండెపోటుకు కారణం

గుండెపోటుకు కారణం

యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆంకాలజీ రిపోర్టు ప్రకారం సెల్‌ ఫోన్‌ రేడియేషన్‌ గుండెకు హానికరమని తేల్చింది. అంతేకాదు రక్తహీనతకు సైతం గురయ్యే ప్రమాదం ఉంది.

చెవుడుకి కారణం..

చెవుడుకి కారణం..

మీరు కంటిన్యూగా రెండు నుంచి మూడు గంటలు సెల్‌ఫోన్‌లో మాట్లాడితే వినికిడి శక్తి నెమ్మదిగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

పేలుడు పదార్థం కూడానూ..

పేలుడు పదార్థం కూడానూ..

నిజమే.. పలు సందర్భాల్లో సెల్‌ఫోన్‌లు పేలి పలువరు మరణించిన దాఖలాలు సైతం ఉన్నాయి.

ఇప్పుడు చెప్పండి సెల్‌ఫోన్‌ మీకు ఎంతఅవసరమో ?

ఇప్పుడు చెప్పండి సెల్‌ఫోన్‌ మీకు ఎంతఅవసరమో ?

ఇప్పుడు చెప్పండి సెల్‌ఫోన్‌ మీకు ఎంతఅవసరమో ?

Best Mobiles in India

English summary
here write Do You Know Your Cellphone Is Doing This To Your Body?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X