Home
News

Alert : స్టీల్‌, ప్లాస్టిక్‌ సామాన్లకు పాత ఫోన్‌లను విక్రయిస్తున్నారా.. ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉంది..!

భారత్‌లో ప్రస్తుతం ప్రతి నెల వివిధ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. దీంతోపాటు చాలా మంది యూజర్లు ప్రతి ఆరు నెలలు, సంవత్సరానికి కొత్త ఫోన్‌లను మారుస్తున్నారు. కొంత మంది సంవత్సరాల తరబడి ఫోన్‌ను ఉపయోగించి, అనంతరం పక్కన పెట్టేస్తున్నారు. అయితే పాత ఫోన్‌లను కొంత మంది ఎక్స్చేంజీ చేస్తుకుంటున్నారు. మరికొందరు వాటిని స్థానికంగా విక్రయిస్తున్నారు.

బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం :
ప్రస్తుతం టెక్నాలజీ భాగా అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. అయితే కొందరు నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తగత విషయాలు, ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం కూడా ఉంది.

Do you Selling Old phones for steel and plastic Products  here is the risk with cyber criminals

పాత ఫోన్‌లు ఏం చేస్తున్నారు :
కొత్త ఫోన్‌లను కొనుగోలు చేసే సమయంలో చాలా మంది తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను (Old Phones) ఎక్చ్సేంజీ చేస్తున్నారు. మరి కొంత మంది ఇంట్లో ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. అయితే కొంత మంది సరైన అవగాహన లేకపోవడంతో గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చే చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

సైబర్ నేరాలకు అవకాశం :
పాత సామాన్లు కొనుగోలు చేసే నెపంతో ఇటీవల కాలంలో నేరగాళ్లు కూడా పాత స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. పాత ఫోన్‌లకు బదులుగా ఇంట్లో అవసరం అయిన ప్లాస్టిక్, స్టీల్‌ సామాన్లు ఇస్తున్నారు. అయితే చాలా మందికి అవగాహన లేక చిల్లర వ్యాపారుల ముసుగులో గ్రామాల్లోకి వస్తున్న నేరగాళ్లకు పాత ఫోన్‌లను విక్రయిస్తున్నారు.

పాత ఫోన్‌లను ఏం చేస్తారు?
ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కాపర్, లిథియం. ఐసీ, స్క్రీన్, మదర్‌బోర్డును వేరుచేసి, విక్రయిస్తున్నారు. ఇలా చేయడం పెద్ద ప్రమాదకరం కాదు. వినియోగించడం లేదు కదా అని చాలా మంది పనిచేసే స్థితిలో ఉన్న ఫోన్‌లను కూడా విక్రయిస్తున్నారు.

మోసాలకు పాల్పడే అవకాశం :
ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌లో నకిలీ సిమ్ కార్డులతో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు కొంత మంది ఫోన్‌లను విక్రయించే సమయంలో అందులోని కాంటాక్ట్‌లు, డేటాను తొలగించడం లేదు. ఇలా చేయడం వల్ల మీ పాత ఫోన్‌లోని డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

డేటాను డిలీట్‌ చేయాలి :
పాత ఫోన్‌లోని ఫోన్‌ నంబర్‌లు, ఫోటోలు, వీడియోలు, ఇతర మెసేజ్‌లను నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు వాటితో బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉంది. అందువల్ల పాత ఫోన్‌లను విక్రయించే ముందే అందులోని డేటాను పూర్తిగా డిలీట్‌ చేయాలి.

పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజీ చేయడం లేదా విక్రయిస్తున్న సందర్భాల్లో అందులోని డేటాను పూర్తిగా ఫార్మాట్‌ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లో ప్రత్యేక ఆప్షన్‌లు ఉంటాలి. ఫ్యాక్టరీ ఫార్మాట్‌ ఆప్షన్‌ ద్వారా ఫోన్‌లోని డేటాను పూర్తిగా తొలగించాలి. అనంతరమే విక్రయించాలి.

అయితే పాత ఫోన్‌లను ఇం‌ట్లో ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. పాత ఫోన్‌ బ్యాటరీ, కెమెరా సక్రమంగా పనిచేస్తుంటే సీసీ కెమెరాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అనేక యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని సీసీ కెమెరాగా వినియోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Do you Selling Old phones for steel and plastic Products, here is the risk with cyber criminals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X