భారీగా తగ్గనున్న ఐఫోన్ ఎస్ఈ ధర

Written By:

మీరు ఐ ఫోన్ ఎస్ఈ కొనాలనుకుంటున్నారా.. అయితే మీరు ఇంకో కొన్ని నెలలు ఆగారంటే తక్కువ రేటుకే దాన్ని కొనుక్కోవచ్చు.ఎందుకంటే అప్పుడు ఐ ఫోన్ ఎస్ఈ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు..ప్ర్తస్తుతం భారత మార్కెట్లో రూ.39 వేలుగా ఉన్న దీని ధర రూ. 30 వేలకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేట్టు ఈ ఫోన్ ధర తగ్గించనున్నట్టు తెలుస్తోంది.

Read more : ఐఫోన్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో

1

కారణం ఏంటంటే ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో మంచి డిమాండ్ పలకడం, ఐఫోన్ ఎస్ఈకి ధర తగ్గుదలకు ఆటంకంగా మారింది.

స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ

2

2015 చివరి క్వార్టర్ లో ఈ ఐఫోన్ 5ఎస్‌లను కంపెనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఈ స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39 వేలగానే ఉంచేందుకు కంపెనీ నిర్ణయించింది.

5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు

3

ఒకవేళ ఇప్పుడే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గిస్తే 5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉండటంతో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింపుకు మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను

4

కాని కొన్ని నెలల్లోనే ఆపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను తగ్గిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను కూడా ఐఫోన్ ఎస్ఈకి యాపిల్ కల్పించనుంది.

ఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు

5

ఐఫోన్ ఎస్ఈకు ముందు మార్కెట్లోకి వచ్చిన 16జీబీ ఐఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు పడిపోయింది.

ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు

6

ఇదే విధంగా కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ ధరను కూడా ఆపిల్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు ఏమీ లేవని, ఒకే విధమైన ఫీచర్స్ ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయంటున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

7

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేపి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Don't buy Apple iPhone SE now, buy it after a month
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting