ఆర్‌బిఐ సర్వర్ డౌన్, నోట్లను మార్చుకునే మార్గాలు !

Written By:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ తెరుచుకోవడం లేదు. నిన్న అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు ఆర్బీఐ వెబ్ సైట్ ను ఆశ్రయిస్తుండటంతో సైట్ పై లోడ్ ఎక్కువై సర్వర్ స్పందించడం లేదనే మెసేజ్ వెబ్ పేజ్ పై కనిపిస్తోంది. అయితే మధ్యాహ్నం నుంచి కాస్త నెమ్మదించి సైట్ ఓపెన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మీరు నోట్లను మార్చుకోవడం ఎలాగే తెలుసుకోండి.

ట్రంప్ గెలుపుతో ఐటీ గుండెల్లో రైళ్లు, సిలికాన్‌వ్యాలీ అలజడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపు

నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపు మీ దగ్గర ఏవైనా రూ. 500, రూ. 1000 నోట్లు ఉంటే బ్యాంకుల్లో గాని పోస్టాఫీసుల్లో గాని డిపాజిట్ చేసుకోవచ్చు.

నోట్లు ఎక్సేంజ్ చేసుకోవాలనుకుంటే

మీరు మీ నోట్లు ఎక్సేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి గడువు ఈ నెల 24 వరకే ఉంటుంది. పోస్టాఫీసుల్లో గాని బ్యాంకుల్లో గాని అది నాలుగు వేల వరకే అనుమతిస్తారు.

గుర్తింపు కార్డు

మీరు డబ్బులు ఎక్సేంజ్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా మీ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.

డిసెంబర్ 30 తర్వాత

డిసెంబర్ 30 తర్వాత మీ దగ్గర ఏవైనా డబ్బులు ఉంటే రిజర్వ్ బ్యాంకులో డిక్లరేషన్ ఫాంతో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టూరిస్టులు వారి నోట్లు విమానాశ్రయాల్లో చేంజ్ చేసుకోవచ్చు.

కన్జూమర్ కో ఆపరేటివ్ స్టోర్లలో

పెట్రోలు బంకులు అలాగే హస్పిటల్స్, రైల్వే, ఎయిర్ లైన్, గవర్నమెంట్ బస్ టికెట్ కౌంటర్లలో అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కన్జూమర్ కో ఆపరేటివ్ స్టోర్లలో రూ. 500, రూ. 1000 నోట్లను డిసెంబర్ 11 వరకు అనుమతిస్తారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RBI Website Down After 500, 1000, 2000 Notes Announcement by PM Narendra Modi read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot