దటీజ్.. కలాం!

Posted By:

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం సోమవారం కన్నుమూశారు. ఈ మహనీయుడి ఆకస్మిక మృతి పట్ల యావత్ భారతావని తీవ్ర దిగ్ర్భాంతికి లోనవుతోంది. కలాం, క్షిపణి శాస్త్రవేత్తగానే కాదు దేశానికి రాష్ట్రపతిగా, యువతకు స్పూర్తిధాతగా నిలిచారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలకు జీవితమంటే ఎంతో గొప్పదని తనకితాను ఆచరించి నిరూపించిన గొప్ప వ్యక్తి కలాం. అంతటి మహనీయుడు ఈ రోజున భౌతికంగా మన మధ్య లేకపోవచ్చేమోగానీ ఆయన ఆశయాలు, సంకల్పాలు ప్రతీక్షణం మనలో స్పూర్తినింపుతూనే ఉంటాయి. భరతజాతి ముద్దుబిడ్డ డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం జీవన ప్రస్థానంలోని కీలక ఘట్టాలు...

Read More: దుమ్ము దులుపుతున్న సోషల్ సైట్ ఏది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1960లో మద్రాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తిచేసిన కలాం వెనువెంటనే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ)లో చేరారు.

కలాం, భారత సైన్యం కోసం హెలికాఫ్టర్‌లను డిజైన్ చేసారు.

1969లో భారత అంతరిక్ష పరిశోధనను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం వద్ద నుంచి కలాం అనుమతి తీసుకున్నారు.

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు బదిలీ అయిన తరువాత కలాం, భారత మొట్ట మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-IIIకి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.

జూలై 1980లో SLV-III రాకెట్ రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టి గగనతల సామ్రాజ్యంలో భారత్ తన సత్తాను చాటింది.

ఆ తరువాత ఇండియా మిస్సైల్ ప్రోగ్రామ్‌ను మరంత ముందుకు తీసుకువెళ్లిన కలాం అగ్ని, పృథ్వీ క్షిపణుల విజయంతో భారత మిలటరీ శక్తిని మరింతగా పెంచారు.

కలాం 1992 నుంచి 1999 వరకు ప్రధాని శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహాదారుగా, డీఆర్ డీఓ కార్యదర్శిగా సేవలందించారు.

1998లో ప్రముఖ కార్డియోలజిస్ట్ డాక్టర్ సోమ రాజుతో కలిసి చౌకధర స్టెంట్ లను తయారు చేసారు. దీని పేరు ‘కలాం-రాజు స్టెంట్' గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల నిమిత్తం వీరిద్దరూ కలిసి ఓ ధృఢమైన టాబ్లెట్ పీసీని తయారు చేసారు. దీని పేరు ‘కలాం-రాజు టాబ్లెట్'.

1998లో ప్రోఖ్రాన్-2 అణు పరీక్షలు జరపడంలోనూ కలాం కీలక పాత్ర పోషించారు.

శాస్త్రవేత్తగా కలాం అందిచిన సేవలకు భారత ప్రభుత్వం వివిధ కాలాల్లో పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న అవార్డులను బహుకరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dr. APJ Abdul Kalam’s Remarkable Achievements. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot