ఫోన్ నీటిలో పడిందా..? ఇలా చేయండి

Posted By:

‘ఫోన్ నీటిలో పడటం.. దాన్ని బాగుచేయటానికి నానా తంటాల పడటం'... ఈ విధమైన సమస్య మనలో చాల మందికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఇంతటితో నా ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడకుండా, చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.

ఇంకా చదవండి: తెలుగు సపోర్ట్‌తో ‘షియోమి ఎంఐ 4ఐ'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా ఫోన్‌ను స్విచాఫ్ చేయండి.

స్విచాఫ్ చేసిన తరువాత ఫోన్‌లోని బ్యాటరీ, సిమ్ కార్డ్స్ ఇంకా మెమరీ కార్డ్స్‌ను తొలగించండి.

నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

ఫోన్ లోపలి భాగాలను తొలగించిన తరువాత ఫోన్ కొద్ది సేపు షేక్ చేయండి. ఇలా చేయటంలో ఫోన్ హెడ్‌ఫోన్ జాక్, చార్జింగ్ పోర్ట్, ఇంకా ఫిజికల్ బటన్‌లలో నీరు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. పొడి క్లాత్ సహాయంతో ఫోన్ శుభ్రంగా తుడిచేయండి.

ఆ తరువాత జిప్‌లాక్ బ్యాగ్‌లో పొడి బియ్యాన్ని వేసి, ఆ బియ్యంలో ఫోన్‌ను పెట్టి బ్యాగ్‌ను టైట్‌గా లాక్ చేయండి. అనంతరం ఆ బ్యాగ్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి.

ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Dropped your phone in water? 5 Best things to do. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot