నెట్ బ్యాకింగ్‌తో పనిలేకుండా మెసెంజర్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్

Written By:

మీరు అర్జెంట్ గా ఎవరికైనా డబ్బులు పంపాలి. అయితే దగ్గర్లో బ్యాంకులు కూడా లేవు. ఒకవేళ ఉన్నా పోయే టైం కూడా లేదనుకోండి నెట్ బ్యాంకింగ్ వైపు చూస్తారు.మరి నెట్ బ్యాకింగ్ లేని వాళ్లు ఏం చేస్తారు.వారికోసం ఇప్పుడు సరికొత్త సదుపాయం అందుబాటులోకి వస్తోంది. నెట్ బ్యాకింగ్ తో పనిలేకుండా మీ దగ్గర ఫేస్ బుక్ మెసెంజర్ ఉంటే చాలా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం.

Read more: ఇక జీవితంలో పీకేపై ట్వీట్లు పెట్టను : వర్మ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఫేస్‌బుక్ మెసెంజర్ చేతిలో ఉండి, ఇటు పంపేవాళ్లతో పాటు అటు అందుకునేవాళ్లకు కూడా డెబిట్ కార్డులు ఉంటే చాలు.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చట.

2

అమెరికాలో ఫేస్‌బుక్ మెసెంజర్ వాడేవాళ్లు ఇప్పటికే ఆ యాప్ ద్వారా డబ్బులు పంపుతున్నారని టెక్నాలజీ వెబ్‌సైట్ సినెట్.కామ్ తెలిపింది. ఇతర దేశాలకు కూడా త్వరలోనే దీన్ని విస్తరిస్తున్నారు.

3

దంతా పూర్తి ఉచితంగానే చేసుకోవచ్చని అంటున్నారు. ఎటూ పిన్ ఆధారంగానే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి, ఇందులో భద్రత గురించిన ఆందోళన కూడా అక్కర్లేదని ఫేస్‌బుక్ అంటోంది.

4

దీని కోసం యూజర్లు ముందుగా తమ ఆండ్రాయిడ్ మెసెంజర్ యాప్‌లో ప్రొఫైల్ ఐకాన్ టచ్ చేసి, అందులో డెబిట్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి.

5

తర్వాత పేమెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి, 'యాడ్ న్యూ డెబిట్ కార్డు' మీద ట్యాప్ చేయడం ద్వారా మిగిలిన పని పూర్తి చేయొచ్చు. మొబైల్ చెల్లింపులు చేయాలంటే, పేమెంట్స్ బటన్ టాప్ చేయాలి.

6

తర్వాత నెక్స్ట్ అనేది టచ్ చేస్తే 'పే' స్క్రీన్ వస్తుంది. అక్కడ మనం చెల్లించాల్సిన మొత్తం ఎంటర్ చేసి, ఎవరికి చెల్లించాలో కూడా ఎంటర్ చేస్తే.. దానికి సంబంధించిన నోట్ వస్తుంది.

7

అక్కడ 'పే' అనే బటన్ మీద టాప్ చేస్తే చెల్లింపు అయిపోయినట్లే. అంటే సెల్‌ఫోన్ బిల్లుల లాంటివి కూడా చెల్లించుకోవచ్చన్న మాట.

8

అయితే దీనికి సంబంధించిన ఆప్సన్ ఇంకా ఇండియాలో అందుబాటులోకి రాలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Easily make payments via Facebook Messenger soon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot