ల్యాప్‌టాప్‌‌లతో అమెరికా రావద్దు !

Written By:

ముస్లిం దేశాలపై అమెరికా రోజు రోజుకి కొరడా ఝుళిపిస్తోంది. మొన్నటికీ మొన్న హెచ్ 1బి వీసా విషయంలో తీవ్ర ఆంక్షలు విధించన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా వెళ్లే ఎనిమిది దేశాల ముస్లింలపై కఠినమైన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ముస్లిం దేశాల‌పై అమెరికా తాజాగా మ‌రికొన్ని ఆంక్ష‌లు విధించినట్లు తెలుస్తున్నది. ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ సామాగ్రిని త‌మ ల‌గేజీలో తీసుకెళ్ల‌రాద‌ని మ‌ధ్య ప్రాచ్య దేశాలు త‌మ ప్ర‌యాణికుల‌కు సూచించాయి.

వరుసగా షాకిస్తున్న బిల్‌గేట్స్ , అంబాని ప్లేస్ ఎక్కడ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిడిల్ ఈస్ట్‌తో పాటు ఉత్త‌ర ఆఫ్రికా దేశాల‌కు

మిడిల్ ఈస్ట్‌తో పాటు ఉత్త‌ర ఆఫ్రికా దేశాల‌కు ఈ నిషేధం వర్తించ‌నుంది. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై విధించిన నిషేధంపై రాయ‌ల్ జోర్డానియ‌న్ ఎయిర్‌లైన్స్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఈ మంగ‌ళ‌వారం నుంచే నిషేధం అమ‌లు కానున్న‌ది.

అమెరికా వెళ్లే ప్ర‌యాణికులు

అమెరికా వెళ్లే ప్ర‌యాణికులు ఎవ్వ‌రూ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఎల‌క్ట్రానిక్ గేమ్స్‌, కెమెరాల‌ను త‌మ ల‌గేజీలో తీసుకెళ్ల‌రాద‌ని జోర్డాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

సెల్ ఫోన్లు, ఇత‌ర మెడిక‌ల్ ప‌రిక‌రాల‌కు

అయితే సెల్ ఫోన్లు, ఇత‌ర మెడిక‌ల్ ప‌రిక‌రాల‌కు మాత్రం ఈ నిషేధం వ‌ర్తించదని రాయ‌ల్ జోర్డానియ‌న్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఎందుకు అక‌స్మాత్తుగా నిషేధం విధించార‌న్న అంశాన్ని

ల్యాప్‌టాప్‌ల‌పై ఎందుకు అక‌స్మాత్తుగా నిషేధం విధించార‌న్న అంశాన్ని వెల్ల‌డించేందుకు అమెరికాకు చెందిన హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ నిరాక‌రించింది.

మొత్తం ఎనిమిది దేశాలకు

మొత్తం ఎనిమిది దేశాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఇవాళ వాషింగ్ట‌న్‌లో అర‌బ్ దేశాల అధికారుల‌తో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద అంశంపై జ‌రిగే స‌మావేశంలో మ‌రికొన్ని విష‌యాలు వెల్ల‌డి అయ్యే అవ‌కాశాలున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Electronics to be banned on some US-bound flights read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot