వరుసగా షాకిస్తున్న బిల్‌గేట్స్ , అంబాని ప్లేస్ ఎక్కడ..?

Written By:

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్ వరుసగా నాలుగోసారి రారాజుగా నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో 86 బిలియన్‌ డాలర్ల సంపదతో వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. బెర్క్‌షైర్‌ హాథ్‌వే చీఫ్‌ వారెన్‌ బఫెట్‌ 75.6 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ మూడో స్థానంలో నిల్చారు.

షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో

వరుసగా షాకిస్తున్న బిల్‌గేట్స్ , అంబాని ప్లేస్ ఎక్కడ..?

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన శ్రీమంతుల జాబితాకు సంబంధించి టాప్‌ టెన్‌లో సింహభాగం టెక్నాలజీ దిగ్గజాలే ఉన్నారు. దేశీయంగా అంబాని ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో అంబానిది 32వ స్థానం.

1 బిలియన్ యాహూ అకౌంట్లు అమ్మకానికి..

బిల్ గేట్స్ ఆస్తులపై దిమ్మతిరిగే నిజాలు..ఓ స్మార్ట్ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు

ఆక్స్‌ఫామ్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు బిల్ గేట్స్ తన 79 బిలియన్ డాలర్ల అదృష్టాన్ని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసినట్లయితే ఆ ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు పడుతోందట.

నాలుగు సెకన్లలో

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్. బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

అమెరికా అప్పుని

ఓ అంచనా ప్రకారం అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

బిల్ గేట్స్ ఒక దేశమైతే

బిల్ గేట్స్ ఒక దేశమైతే..ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి

బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి.. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Microsoft Co-Founder Bill Gates Tops World's Richest List Again read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting