ఎరికా ...ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావో

Posted By:

ఒసాకా యూనివర్సీటీ ఫ్రొపెసర్ హిరోషి ఇషిగురో ఓ కొత్త ఆండ్రాయిడ్ రోబోను కనిపెట్టారు...ఈ ఆండ్రాయిడ్ రోబో చేసే పనులు చూస్తే ఎవరికైనా ఇట్టే ఆశ్చర్యం కలుగుక మానదు. తన బాడీ కమ్యూనికేషన్స్ తో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ రోబో పేరేంటో తెలుసా..ఎరికా. పేరు చాలా బాగుంది కదా...ఈ అమ్మాయిని చూస్తే ఇంకా బాగుంటుంది. మరి ఏం పనులు చేస్తుంది. ఎలా మాట్లాడుతుందో ఓ సారి చూసేద్దాం.

read more : మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక మాటలు ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో...రజీని కాంత్ సినిమాలో రోబోలాగా అన్ని మానవ స్పర్శలకు అనుగుణంగా రోబోను తయారు చేశారు..

మనిషికి ఉన్నట్లే అన్ని ఎమోషన్స్ ఈ ఆండ్రాయిడ్ రోబోకు ఉంటాయి. జపాన్ సమాచారంలో అంటే వారి జపనీస్ స్టైల్లో దీన్ని డెవలప్ చేశారు.

ఈ రోబో మాటలు వినగలుగుతుంది అలాగే మీరు అడిగినదానికి తిరిగి సమాధానం కూడా ఇస్తుంది. ఈ రోబోను తయారు చేసిన ఇషిగురో మనిషిని పోలిన రోబోలను తయారు చేయడంలో చాలా నిపుణులు.

అంతే కాకుండా ఇతరుల మాట్లాడుతున్న పదాలను కూడా గుర్తించగలదు. ఈ రోబోల పనితీరును చూసిన చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఆపీసుల్లో రిసెప్షనిస్టులుగా ఈ రోబోలనే పెట్టుకున్నారు.

ఈ ఆండ్రాయిడ్ రోబోలు ఎవరైనా ఆఫీసుకు రాగానే వారిని సాదరంగా ఆహ్వనిస్తాయి. నమస్కారం సార్ ఏం కావాలి అంటూ వారి లాంగ్వేజ్ లో రిక్వస్ట్ గా అడుగాతాయి.

మీరు ఏం ప్రశ్నలు అడిగినా టకటకమని సమాధానం చెబుతుంది ఈ ఆండ్రాయిడ్ రోబో..అంతేకాకుండా మిమ్మల్ని ఇంకా చిక్కుల్లో ఇరుక్కునే ప్రశ్నలు వేసినా మీరు ఆశ్ఛర్యపోనవసరం లేదన్నమాట.

ఈ ఆండ్రాయిడ్ రోబోలు ఇంకా ఇండియాకు రాలేదు.అక్కడ డెవలప్ చేస్తున్నారు..సో ఇండియాకు ఇటువంటి రోబోలు రావాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.

ఆండ్రాయిడ్ రోబోతో మాట్లాడిస్తున్న యూనివర్సిటీ ప్రొపెసర్ హిరోషి 

అచ్చం మనిషిలాగే ఉన్న రోబో పేరు ఎరికా..చాలా స్మార్ట్ గా అందమైన అమ్మాయిలకు తీసిపోని విధంగా ఉంది కదా 

నేను చకచకా మాట్లాడగలను.మీరు ఎవరైనా నన్ను డౌట్లు అడగవచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Osaka University professor Hiroshi Ishiguro, who has delivered creepily real androids in past years, is back with a new hyper-realistic robot called Erica.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot