5జీ గురించి తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే !
5జీ గురించి కొన్ని ఆసక్తికర పాయింట్లు తెలుసుకుంటే అందరూ ఔరా అంటారు.
జియో రాకతో ఇప్పడిప్పుడే 4జీ వేగం పుంజుకుంటోంది. అన్ని కంపెనీలు ఇప్పుడు 4జీ మొబైల్స్ వెంట పరుగులు పెడుతున్నాయి. 3జీ, 2జీ ఫోన్లను పూర్తిగా బంద్ చేశాయి కూడా. చైనా ఇప్పటికే 4జీని దాటేసి 5జీ మీద కసరత్తులు చేస్తోంది. ట్రయల్స్ నిర్వహించడానికి వ్యూహాలను కూడా సిద్ధం చేస్తోంది. ఈ నేపధ్యంలో 5జీ గురించి కొన్ని పాయింట్లు మీ ముందుకు తెస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

5జీ అంటే ఏంటీ
3జీ ,4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే దీని వేగం అపరిమితంగా ఉంటుంది. సిగ్నల్ లేని ప్రదేశాల్లో కూడా అపరిమిత వేగంతో మీకు అప్ లోడ్ కాని డౌన్ లోడ్ కాని ఉంటుంది. ఈ వేగం 4జీ కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జనరేషన్ మధ్య తేడాలు
తొలితరం నెట్‌వర్క్ 1జిలో కాల్స్ మాత్రమే చేసుకునేవారు. దాని తరువాత వచ్చిన 2 నెట్‌వర్క్‌లో కాల్స్‌తో పాటు మెసేజ్‌లు కూడా పంపుకునే స్థాయికి వచ్చింది. ఇక తరువాత వచ్చిన 3జీలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది.ఇంటర్నెట్ వాడకంతో అందరూ తెగ ఖుషీ అయ్యారు కూడా. తరువాత వచ్చిన 4జీ ఏకంగా వీడియో కాల్స్‌తో పాటు పెద్ద పెద్ద ఫైల్స్ ను క్షణాల్లో పంపే స్థాయికి వచ్చింది.

5జీ ఉపయోగం
5జీ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక కిలోమీటర్ పరిధిలో దాదాపు మిలియన్ మంది 5జీ నెట్‌వర్క్‌ని అందుకునే కెపాసిటి ఉంటుంది. మిలియన్ మొబైల్స్ కి ఇది ఒకేసారి ఎటువంటి అంతరాయం లేకుండా సపోర్ట్ చేస్తుంది. 3జీ,4జీ కన్నా ఎన్నో రెట్లు వేగంతో అందుకుంటుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డేటా స్పీడ్
5జీ డేటా స్పీడ్ విషయానికొస్తే 4జీ కన్నా 20 రెట్లు వేగంతో కనెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయి హై ఢెఫినేషన్ సినిమాని కేవలం ఒక సెకండ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 5జీ ultra-low latency rate కూడా 1 మిల్లి సెకండ్ ఉంటుంది. అదే 4జీలో అయితే 10మిల్లి సెకండ్స్ ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుభూతి
ఈ స్పీడ్ లో మీరు ఎటువంటి అంతరాయం లేకుండా వీఆర్ ఏఆర్ లాంటి హై క్వాలిటీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. సిగ్నల్ తక్కువగా ఉన్న సమయంలో కూడా మీకు ఎటువంటి అంతరాయం కలుగదు.

5జీ స్టాండర్డ్స్
The International Telecommunication Union (), United Nations agencyలు ఈ స్టాండర్స్ ని గుర్తించేందుకు, తగు సలహాలు ఇచ్చేందుకు సాయం చేస్తున్నాయి. Asia, Europe and North Americaల మధ్య సహకారానికి ఈ సంస్థలు పనిచేస్తున్నాయి.ఈ 5జీని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు సంయుక్తంగా ITUతో కలిసి Third Generation Partnership Project (3GPP) and the GSM Association (GSMA) పనిచేస్తున్నాయి.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డీల్
విస్తారమైన ఈకో సిస్థం ద్వారా జీఎస్ఎమ్ దాదాపు 800 మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్, 300 కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తోంది. హ్యాండ్‌సెట్‌లలో 5జీ ట్రయల్స్ నిర్వహించాలని చూస్తోంది. ఈ మేరకు సాప్ట్‌వేర్ కంపెనీలతో అలాగే పరికరాలను సరఫరా చేసే టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో మంతనాలు కూడా జరుపుతోంది.

5జీ ఎప్పుడు
అన్నీ కుదిరితే 5జీ 2020లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదీ 2018లో సౌత్ కొరియలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరగనున్న వింటర్ ఒలంపిక్స్ లో ఈ 5జీపై ట్రయల్స్ వేసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముందున్న దేశాలు
చైనా , జపాన్, సౌత్ కొరియాలు ఇప్పటికే 5జీ మీద టెస్టింగ్ లు నిర్వహిస్తున్నాయి. 5జీ రిలేటెడ్ మొబైల్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి. అక్కడ ఇప్పటికే హై లెవల్ 4జీ సమర్థవంతంగా రన్ అవుతోంది. 5జీ డెవలప్ కోసం ప్రభుత్వం కూడా కంపెనీలకు సపోర్ట్ చేస్తోంది.

చైనా 5జీ
5జీ కోసం చైనా అన్ని రకాల ఎక్విప్ మెంట్ లను సిద్ధం చేస్తోంది. చైనాలో అతి పెద్ద టెలికమ్యూనికేషన్స్ అయిన హువాయి , జడ్‌టీఈలు ఈ 5జీ సంబంధిత ఎక్విప్‌మెంట్ తయారీ నిర్మాణంలో తలమునకలయ్యాయి కూడా.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








