జియో ఉద్యోగులకు పండగే పండగ

By Hazarath
|

టెలికాం సెక్టార్‌లో ఉన్న పోటీ వల్ల అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీ వీడి వెళుతుండటంతో రిలయన్స్ జియో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారిని కాపాడుకునేందుకు కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి దసరా కానుకగా భారీగా వేతనాలను పెంచింది. ప్రతిభావంతులను కాపాడుకునే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.

టార్గెట్ రూ.5 లక్షల కోట్లు: వచ్చింది రూ.60 వేల కోట్లు

జియో ఆపరేషన్‌లో

జియో ఆపరేషన్‌లో

జియో ఆపరేషన్‌లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలను దాదాపు 15శాతం వరకు పెంచింది. జూనియర్‌, మధ్యశ్రేణి మేనేజర్లకు 15శాతం వరకు జీతం పెంచగా.. డీజీఎం ఆపై అధికారులకు 10శాతం వరకు జీతం పెంచింది.

దాదాపు అన్ని విభాగాలకు

దాదాపు అన్ని విభాగాలకు

నెట్‌వర్క్‌, ఐటీ సపోర్ట్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ కేర్‌, ప్రాజెక్టు, రెగ్యులేటరీ, హెచ్‌ఆర్‌ విభాగాలకు చెందిన వారికీ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.

ఉద్యోగుల హోదాను బట్టి

ఉద్యోగుల హోదాను బట్టి

ఉద్యోగుల హోదాను బట్టి జూనియర్లకు 7నుంచి 15శాతం, మధ్యశ్రేణిలో 5 నుంచి 10శాతం పెంచారు. టెలికం సెక్టార్‌లో తాము ఇచ్చిన ఇంక్రిమెంట్లు మరే కంపెనీ ఇవ్వలేదని జియో హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌ తెలిపారు.

వార్షిక ఇంక్రిమెంట్ కింద

వార్షిక ఇంక్రిమెంట్ కింద

వార్షిక ఇంక్రిమెంట్ కింద తమ జూనియర్, మిడిల్ స్థాయి ఉద్యోగులకు 7 శాతం నుంచి 15 శాతం వేతనాలను పెంచనున్నట్టు జియో గతేడాది చివర్లోనే ప్రకటించింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్-మే నుంచి ఉద్యోగులకు అందుతాయని తెలిపింది.

పెంపు కొన్ని రోజులుగా వాయిదా

పెంపు కొన్ని రోజులుగా వాయిదా

కానీ ఆ పెంపు కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ వేతనాలను రిలయన్స్ జియో పెంచినట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో ఉద్యోగులు అందుకుంటున్న వార్షిక ఇంక్రిమెంట్స్ ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా బాగున్నాయని ఓ ప్రముఖ హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ చెప్పింది.

సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే

సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే

గతనెలలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తూ 4జీ సేవలను లాంచ్ చేసింది. కానీ ఆ సర్వీసులు ఆవిష్కరించిన కొన్ని రోజులకే ఉన్నత స్థాయి ఉద్యోగులు కొంతమంది కంపెనీకి రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలకు సరియైన కారణాలు తెలియరాలేదు.

కంపెనీని వీడిన ఉన్నత ఉద్యోగులు

కంపెనీని వీడిన ఉన్నత ఉద్యోగులు

చీఫ్‌ క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌ సోరెన ఎల్‌ హన్సన్‌, డేటా సైన్స్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరిచరణ్‌ రావు, సెక్యూరిటీ ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాయ ఆర్‌ నాయర్‌, పబ్లిక్‌ వైఫై బిజినెస్‌ హెడ్‌ పవన్‌ ఎస్‌ యాదవ్‌లు కంపెనీని వీడి వెళ్లిపోయారు. అంతకు ముందు జియో మొబిలిటీ బిజినెస్‌ హెడ్‌ అమితాబ్‌ జైపూరియా కూడా సంస్థను వీడారు.

Best Mobiles in India

English summary
Reliance Jio Infocomm hands out up to 15% salary hikes to its top performers read more at telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X