మళ్లీ 3 నెలలు ఉచితం !

Written By:

రిలయన్స్ జియో...ఇప్పుడు టెలికం రంగంలో ఓ సంచలనం. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తూ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకెళుతోంది. ఉచిత ఆఫర్లతో టెల్కోలకు తీరని నష్టాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే ఊపులో ఇప్పుడు మరో మూడు నెలల ఉచితంతో దూసుకొస్తోంది. అయితే ఈ సారి డేటా మీద కాకుండా ఫైబర్ బ్రాండ్ ద్వారా 3 నెలల ఉచితాన్ని అందిస్తోంది. జియో ఫైబర్ బ్రాండ్ అతి త్వరలోనే రాబోతుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు జియో అయిదు నగరాల్లో టెస్టింగ్ ని కూడా నిర్వహిస్తోంది.

ఆధార్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు

ఇప్పటిదాకా టెల్కోలకు షాకిచ్చిన జియో ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు కూడా గట్టి షాకే ఇవ్వనుంది. జియో ఫైబర్ పేరిట మరో రెండు నెలల్లో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.

ఫైబర్-టు-ద-హోమ్

ఫైబర్-టు-ద-హోమ్ (Fibre-to-the-Home (FTTH)) పేరిట జియో తీసుకురానున్న 'జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్' మొదటగా మెట్రో నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

జియో ఫైబర్ ముందుగా

హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలతోపాటు గుజరాత్‌లోని జియో హోమ్ టౌన్ జామ్ నగర్‌లోనూ జియో ఫైబర్ సేవలు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత దేశంలో ప్రముఖ పట్టణాలకు,  అనంతరం గ్రామాల్లో కూడా జియో ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు.

అయిదు నగరాల్లో దీని మీద ప్రీ ట్రయల్స్

ఇప్పటికే అయిదు నగరాల్లో దీని మీద ప్రీ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, గుజరాత్్ లోని జామ్ నగర్, పూణె తదితర నగరాల్లో ఈ టెస్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. కంపెనీ ఈ టెస్టింగ్ విధానాన్ని బట్టి రేట్లు నిర్ణయించే పనిలో ఉందని కూడా సమాచారం.

మొదటి 3 నెలలు ఫ్రీ

జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మొదటి మూడు నెలల పాటు యూజర్లకు ఉచితంగా అందివ్వనుంది. ఆ సమయంలో యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు.

రూ.500, రూ.2వేల ప్లాన్లు

ఆ తరువాత రూ.500, రూ.2వేల ప్లాన్లు రెండింటిని ముందుగా ప్రవేశపెట్టనున్నారు. రూ.500 ప్లాన్‌తో 600 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. రూ.2వేల ప్లాన్‌తో 1000 జీబీ డేటా వస్తుంది.

యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌

ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అయితే నిర్దేశించిన డేటా లిమిట్ పూర్తయితే స్పీడ్ తగ్గుతుంది.

ఇన్ స్టాలేషన్ ఛార్జీల కింద

ముందుగా ఇన్ స్టాలేషన్ ఛార్జీల కింద ఒకసారి రూ. 4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం తరువాత వినియోగదారుడు జియో మీద సంతృప్తిగా లేకపోతే అతనికి తిరిగి ఇస్తారు. ఈ ఛార్జిలో మీకు వైఫై రూటర్ కూడా లభిస్తుంది.

కేవలం 6 నిమిషాల్లోనే

జియో ఫైబర్ అందించనున్న 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో 5జీబీ సైజ్ గల హెచ్‌డీ సినిమాను కేవలం 6 నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది.

100 పాటలను

అదేవిధంగా 5 ఎంబీ సైజ్ గల 100 పాటలను కేవలం 24 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతటి వేగాన్ని జియో ఫైబర్ ఇవ్వనుంది.

ఇప్పటికే ఎయిర్‌టెల్

ఇప్పటికే ఎయిర్‌టెల్, యాక్ట్, హాత్‌వే వంటి ప్రముఖ సంస్థలతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. మరి జియో వాటికి పోటీనిస్తుందో లేదో చూడాలి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Exclusive: JioFiber Preview Offer to soon give users 100mbps internet connection for free read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot