ఆధార్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ !

Written By:

దేశంలో ఇప్పుడు ఆధార్ చాలా ముఖ్యమైపోయిందన్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకే కాదు, ఇతరత్రా సేవలకు కూడా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి అవుతోంది. అయితే ఆధార్ అనుసంధానంతో ఇంతవరకు ఒక్కఫోన్ కూడా రాలేదు. ఈ కొరతను తీర్చడానికి అతి త్వరలో ఆధార్ అనుసంధాన ఫోన్లు రానున్నాయి. ఫోన్‌లో అవసరం ఉన్నప్పుడు ఆధార్‌ను వాడుకునేందుకు గాను ఓ కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నారు.

ఇండియన్లకు వాట్సప్ మీద ఇంత పిచ్చి ఉందా...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండస్ ఓఎస్

దేశీయ ఆండ్రాయిడ్ ఓఎస్ తయారీ సంస్థ ఇండస్ ఓఎస్, ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ ప్రొవైడర్ డెల్టా ఐడీ సంస్థ రెండు కలిసి సంయుక్తంగా కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేస్తున్నాయి. దీంట్లో ఆధార్ నంబర్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది.

ఎప్పుడు కావాలంటే అప్పుడు

దాన్ని యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. పేమెంట్లు చేసుకోవడం, ఇతర సేవలకు అథెంటికేషన్ ఇవ్వడం తేలికవుతుంది.

ఈ ఓఎస్ ఉన్న ఫోన్‌ను

ఈ ఓఎస్ ఉన్న ఫోన్‌ను యూజర్లు ఆన్ చేయగానే తమ కళ్లను ఆ ఫోన్ కెమెరా ఎదుట పెట్టి ఐరిస్ స్కాన్ చేయాలి. దీంతో ఆ వివరాలు యూఐడీఏఐ సర్వర్‌కు అనుసంధానం అయి వెరిఫై అవుతా

యూజర్ ఆధార్ నంబర్

దీంతో యూజర్ ఆధార్ నంబర్ ఫోన్‌లో ఫీడ్ అవుతుంది. ఆ తరువాత ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ సేవలను ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు.

ఈ ఓఎస్ కలిగిన ఫోన్లను

ఈ ఓఎస్ కలిగిన ఫోన్లను మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్, సెల్‌కాన్, స్వైప్ సంస్థలు తయారు చేయనున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indus OS, Delta ID to Launch Aadhaar-Authenticated Operating System
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot